తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Masala Recipe : చికెన్ మసాలా రెసిపీ.. లంఛ్, డిన్నర్​కి పర్​ఫెక్ట్​

Chicken Masala Recipe : చికెన్ మసాలా రెసిపీ.. లంఛ్, డిన్నర్​కి పర్​ఫెక్ట్​

31 January 2023, 13:11 IST

google News
    • Chicken Masala Recipe : చికెన్ అంటే ఇష్టపడేవారు రోజూ చికెన్ తినాలని అనుకుంటారు. దానిని పూటపూటకి పెట్టిన కాదు అనరు. అయితే ఈ చికెన్ కర్రీలో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. మీరు కూడా కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే చికెన్ మాసాలా రెసిపీని చేయవచ్చు. 
చికెన్ మసాలా
చికెన్ మసాలా

చికెన్ మసాలా

Chicken Masala Recipe : చికెన్ మసాలా రెసిపీని మీరు వెజిటెబుల్ బిర్యానీ, పులావ్, అన్నం, రోటీలలో కలిపి తీసుకోవచ్చు. ఏ కర్రీలోనైనా గ్రేవీ ఉంటే.. మీరు కచ్చితంగా దానిని దేనితోనైనా కాంబినేషన్ ట్రై చేస్తారు. అలాంటి కర్రీనే చికెన్ మసాలా. మరి దీనిని ఎలా తయారు చేయవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* చికెన్ - 500 గ్రాములు

* ఉల్లిపాయ - 1 పెద్దది (ముక్కలుగా కోసి.. గోధుమ రంగు వచ్చేవరకు వేయించి.. పేస్ట్ చేయాలి.)

* జీడిపప్పు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

* టొమాటో ప్యూరీ - 1/4 కప్పు

* నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

* హెవీ క్రీమ్ - 1 టేబుల్ స్పూన్

* లవంగాలు - 4

* యాలకులు - 3

* బిర్యానీ ఆకులు - 2

* దాల్చిన చెక్క - 1

* కొత్తిమీర - గుప్పెడు

మెరినేషన్ కోసం..

* పెరుగు - 1/2 కప్పు

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp

* గరం మసాలా - 1 tsp

* జీలకర్ర పొడి - 1 స్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

* పెప్పర్ - 1 స్పూన్

* పసుపు - 1 స్పూన్

* కారం - 1 tsp

చికెన్ మసాలా తయారీ విధానం

చికెన్ మసాలా తయారు చేయడానికి పొడి పదార్థాలను అన్నింటినీ కలపండి. ఇప్పుడు ఒక గిన్నెలో మెరినేట్ పదార్థాలన్నింటినీ కలపి.. చికెన్ వేసి బాగా కలిపి పక్కన పెట్టండి. వంట చేసేటప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవాలంటే.. మీరు ముందు రోజు రాత్రి చికెన్​ను మెరినేట్ చేయవచ్చు.

అనంతరం పెద్ద కడాయి లేదా పాన్ తీసుకుని.. దానిలో నెయ్యి వేడి చేసి.. దానిలో పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, బే ఆకులు, దాల్చినచెక్క వేసి వాటిని బాగా కలపండి. దానిలో మెరినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలపండి. దానిని తక్కువ నుంచి మీడియం వేడి మీద ఉడికించాలి. చికెన్ రంగు మారే వరకు కలపండి.

అనంతరం ఉల్లిపాయ, జీడిపప్పు, టొమాటో పేస్ట్ వేసి బాగా కలపండి. ఈ గ్రేవీలో మీరు నీరు కూడా వేసి బాగా కలపవచ్చు. మూత వేసి సుమారు 20 నిమిషాలు ఉడికించాలి. అనంతరం మూత తీసి దానిలో ఉప్పు వేసి కలపండి. మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. అనంతరం గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర ఆకులతో అలంకరించండి.

తదుపరి వ్యాసం