తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Kheer Recipe : ఆరోగ్యాన్ని అందించే తియ్యని బీట్‌రూట్ ఖీర్.. రెసిపీ చాలా సింపుల్

Beetroot Kheer Recipe : ఆరోగ్యాన్ని అందించే తియ్యని బీట్‌రూట్ ఖీర్.. రెసిపీ చాలా సింపుల్

31 January 2023, 6:00 IST

google News
    • Beetroot Kheer Recipe : ఉదయాన్నే హెల్తీ రెసిపీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే దానిని ఎంత టేస్టీగా వండుకుంటామనేది మ్యాటర్. చాలా మంది బీట్‌రూట్ తినరు. కానీ దానితో మంచి రెసిపీ తయారు చేసుకుంటే.. మీరు కూడా హ్యాపీగా లాగించేవచ్చు. ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ ఖీర్
బీట్‌రూట్ ఖీర్

బీట్‌రూట్ ఖీర్

Beetroot Kheer Recipe : వింటర్-స్పెషల్ బీట్‌రూట్ ఖీర్. ఇది మీ స్వీట్ క్రేవింగ్స్ తీర్చడమే కాకుండా.. మీకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. బీట్‌రూట్ వల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కాదు. అంతేకాకుండా బ్లడ్ లేనివారు దీనిని తీసుకోవడం వల్ల రక్తం శాతం పెరుగుతుంది అంటారు. కానీ దీనిని తినేందుకు ఎక్కువమంది ఇష్టపడరు. అలాంటివారు ఈ ఖీర్ రెడీ చేసుకోవచ్చు. దీనివల్ల టేస్ట్, ఆరోగ్యం.. రెండింటీని మీరు మిస్ కాలేరు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పాలు - 2 కప్పులు

* నెయ్యి - 1 టేబుల్ స్పూన్

* బీట్ రూట్ - 1 కప్పు (తురిమినది)

* యాలకుల పొడి - 1/2 టీస్పూన్

* జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్

బీట్‌రూట్ ఖీర్ తయారీ విధానం

ముందుగా పాలను మరిగించండి. అనంతరం దానిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయండి. దానిలో జీడిపప్పు లేదా మరేదైనా డ్రై ఫ్రూట్స్‌ని వేసి.. అవి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించండి. అవి వేగిన తర్వాత.. వాటిని తీసి పక్కన పెట్టండి. దానిలో బీట్‌రూట్ వేసి దానిలోని పచ్చివాసన పోయే వరకు వేయించండి. దానిలో చక్కెర వేసి.. అది పూర్తిగా కరగనివ్వండి. అనంతరం కాచిన పాలు వేసి.. ఉడకనివ్వండి. అది మందపాటి, క్రీములాగా వచ్చేవరకు తక్కువ మంట మీద ఉడకబెట్టండి. చివరగా వేయించిన జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలపాలి. దానిని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆపేయండి. అంతే వేడి బీట్‌రూట్ ఖీర్ రెడీ.

తదుపరి వ్యాసం