తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Fingers: స్పైసీగా చికెన్ ఫింగర్స్ ఇంట్లోనే ఇలా చేసేయండి, వీటిని అరగంటలో వండేసుకోవచ్చు

Chicken Fingers: స్పైసీగా చికెన్ ఫింగర్స్ ఇంట్లోనే ఇలా చేసేయండి, వీటిని అరగంటలో వండేసుకోవచ్చు

Haritha Chappa HT Telugu

03 September 2024, 11:30 IST

google News
    • Chicken Fingers: వాతావరణం చల్లబడితే చాలు, క్రిస్పీగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఎప్పుడూ పకోడీలు, బజ్జీలు తిని బోర్ కొడితే చికెన్ ఫింగర్స్ ప్రయత్నించండి. వీటిని అరగంటలో వండేసుకోవచ్.చు రెసిపీ చాలా సులువు.
చికెన్ ఫింగర్స్ రెసిపీ
చికెన్ ఫింగర్స్ రెసిపీ

చికెన్ ఫింగర్స్ రెసిపీ

Chicken Fingers: వానలతో వాతావరణం చల్లబడిపోయింది. సాయంత్రం అయితే చాలు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తుంది. బజ్జీలు, పకోడీలు తిని తిని బోర్ కొట్టి ఉంటే ఒకసారి చికెన్ ఫింగర్స్ ప్రయత్నించండి. మీరు ఇంట్లోనే కేవలం అరగంటలో వీటిని వండేసుకోవచ్చు. తినే కొద్ది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. నాన్ వెజ్ ప్రియులకు ఇవి బాగా నచ్చుతాయి. బయట కొంటే వీటి ధర ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే అయితే అరకిలో చికెన్‌తో ఇంటిల్లిపాది తినేంత చికెన్ ఫింగర్స్ రెడీ అయిపోతాయి. వీటి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

చికెన్ ఫింగర్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బోన్‌లెస్ చికెన్ - అరకిలో

కోడిగుడ్డు - ఒకటి

నిమ్మరసం - రెండు స్పూన్లు

వెల్లుల్లి తరుగు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

బ్రెడ్ ముక్కలు - రెండు

వెల్లుల్లి పొడి - ఒక స్పూను

ఉల్లిపాయ పొడి - ఒక స్పూను

మిరియాల పొడి - అర స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

ఎండు మిర్చి - రెండు

చికెన్ ఫింగర్స్ రెసిపీ

1. ఎముకల్లేని చికెన్‌ను ఈ రెసిపీ కోసం ఎంపిక చేసుకోవాలి.

2.చికెన్ ముక్కలను కాస్త పొడవుగా, సన్నగా కట్ చేసుకోండి.

3. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డును కొట్టి సొనను వేయండి.

4. అందులోనే ఒక స్పూను నూనె, నిమ్మరసం, వెల్లుల్లి తరుగు, వెల్లుల్లి పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపండి.

5. ఆ తర్వాత ముందుగా నిలువుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి అరగంట పాటు మ్యారినేట్ చేయండి.

6. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను మిక్సీలో వేసి పొడి చేసుకోండి.

7. బ్రెడ్ ముక్కలతో పాటు ఎండుమిర్చి, వెల్లుల్లి పొడి, ఉల్లిపాయ పొడి కూడా వేసి ఒకసారి కలుపుకోండి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకోండి.

9. స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా కళాయి పెట్టుకోండి.

10. లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా దీన్ని చేయొచ్చు.

11. చికెన్ ముక్కలను ఒక్కోదాన్ని తీసి బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో వేయించాలి.

12. అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

13. ఇలా అన్నీ చేసుకుంటే చికెన్ ఫింగర్స్ రెడీ అయినట్టే.

14. ఎయిర్ ఫ్రైయర్ ఉన్నవాళ్లు దానిలో వేయించుకోవచ్చు.

15. ఓవెన్ లో కూడా వీటిని చేయొచ్చు. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను బ్రెడ్ పొడిలో దొర్లించి బేకింగ్ ట్రేలో వరుసగా పెట్టుకోవాలి.

16. వాటిని ఓవెన్ లో పెట్టి పది నిమిషాలు పాటు ఉంచాలి.

17. అవి క్రిస్పీగా అయ్యాక తీసేయాలి. అంతే చికెన్ ఫింగర్స్ రెడీ అయినట్టే.

18. ఇవి క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి చేసుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం.

ఇదే చికెన్ ఫింగర్స్‌ను బయట కొన్నారంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే ఇంట్లో చేసుకుంటే మీ ఇంట్లోని వారంతా సంతృప్తిగా తినేంత వండుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే ఇవి రెడీ అయిపోతాయి. చికెన్‌ను కొని తెచ్చుకుంటే చాలు మిగతావి పెద్దగా ఖర్చు అయ్యేవి కాదు.

తదుపరి వ్యాసం