Blood Group and Food : మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం చికెన్‌, మటన్‌లో ఏది తినాలి?-chicken or mutton which food is healthy to you according to your blood group ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Group And Food : మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం చికెన్‌, మటన్‌లో ఏది తినాలి?

Blood Group and Food : మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం చికెన్‌, మటన్‌లో ఏది తినాలి?

Anand Sai HT Telugu
Jan 22, 2024 01:00 PM IST

Blood Group and Food : అందరి బ్లడ్ గ్రూప్ వేరుగా ఉంటుంది. అయితే దీని ప్రకారం మనం తీసుకునే ఆహారం కూడా ఉంటే బాగుంటుంది. ఏ బ్లడ్ గ్రూప్ వారు చికెన్, మటన్‌లలో ఏది తినాలో చూద్దాం..

చికెన్
చికెన్ (Pinterest)

మీ ఆహారం కూడా మీ రక్త వర్గాన్ని బట్టి ఉండాలి. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో కచ్చితంగా తెలుసుకోవాలి. కొందరికి చికెన్ అంటే ఇష్టం, కొందరికి మటన్ అంటే ఇష్టం. అయితే అవి తిన్నా సరిగా అరగదు. అందుకోసమే ఏం తినాలో కూడా ఐడియా ఉండాలి. కొన్ని రకాల బ్లడ్ గ్రూప్ వారు కొన్ని ఆహారాలు తీసుకోవాలని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

మీరు ఏం తినాలో మీ బ్లడ్ గ్రూప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి బ్లడ్ గ్రూప్ ను బట్టి ఆహారం నిర్ణయించకపోతే ప్రమాదం పొంచి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా మీ బ్లడ్ గ్రూప్ ప్రకారం, మీరు అనేక ఆహారాలను జీర్ణం చేయడంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే చికెన్‌, మటన్‌ని అందరూ జీర్ణించుకోలేరు. కొందరికి చాలా సమయం పడుతుంది. మీ ఆహారం మీ బ్లడ్ గ్రూప్‌పై కూడా ఆధారపడి ఉండాలి. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..

మొత్తం నాలుగు రకాల రక్త గ్రూపులు ఉన్నాయి. O, A, B మరియు AB. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులకు చెందిన వ్యక్తులు నేరుగా తినగలిగే ఆహారం రక్తం గ్రూపుపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారి జీర్ణశక్తి ఒక్కోలా ఉంటుంది. కొందరికి త్వరగా జీర్ణమైతే మరికొందరికి లేట్ అవుతుంది. అందుకే ఎవరు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోవాలి.

A బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రాథమికంగా శాఖాహారం ఈ సమూహానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మాంసాన్ని సులభంగా జీర్ణించుకోలేరు. చికెన్ లేదా మటన్ తక్కువగా తినడం మంచిది. అంతేకాకుండా సీఫుడ్, వివిధ రకాల పప్పులను చేర్చాలి. ఈ ఆహారాలు వారికి జీర్ణమయ్యేందుకు సులభంగా ఉంటాయి.

B బ్లడ్ గ్రూప్ వారు రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. చికెన్, మటన్ లేదా మాంసాహారం హాయిగా తినొచ్చు. అయితే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, చేపలు ఉండటం చాలా ముఖ్యం.

AB, O రక్త సమూహాలు సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకపోయినా మటన్, చికెన్ తినడంలో కొంత సంయమనం పాటించడం మంచిది. ఆకుకూరలు, సీఫుడ్ తినొచ్చు.

అయితే కొందరికి మాత్రం జీర్ణసమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా తింటే వెంటనే కడుపులో ఇబ్బంది మెుదలవుతుంది. జీర్ణమయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అలాంటివారు వైద్యుడిని సంప్రదించాలి.

Whats_app_banner