తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Milk Recipe : చలికాలంలో క్యారెట్ మిల్క్ వల్ల కలిగే లాభాలు ఎన్నో.. రెసిపీ ఇదే..

Carrot Milk Recipe : చలికాలంలో క్యారెట్ మిల్క్ వల్ల కలిగే లాభాలు ఎన్నో.. రెసిపీ ఇదే..

27 December 2022, 6:30 IST

google News
    • Carrot Milk Recipe : చలికాలంలో ఉదయాన్నే మీకు ఎనర్జీనిచ్చే, రోగ నిరోధక శక్తిని పెంచే డ్రింక్ కావాలి అనుకుంటే.. మీకోసం ఇక్కడ ఓ చక్కని రెసిపీ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని హాయిగా లాగించేవచ్చు. అదే క్యారెట్ మిల్క్. ఇది ఆరోగ్యంతో పాటు.. అందానికి, కంటి చూపు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.
క్యారెట్ మిల్క్
క్యారెట్ మిల్క్

క్యారెట్ మిల్క్

Carrot Milk Recipe : మీ ఉదయాన్ని హాట్ డ్రింక్​తో హెల్తీగా ప్రారంభించాలి అనుకుంటే మీరు క్యారెట్ మిల్క్​ని ట్రై చేయవచ్చు. ఇది మీకు వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా.. అందానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా మీకు ఎక్కువసేపు ఎనర్జీనిస్తుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* క్యారెట్లు - 2 (పొట్టు తీసిపెట్టుకోవాలి)

* పాలు - 2 కప్పులు

* దాల్చిన చెక్క - 1

* ఏలకులు - 2

* చక్కెర - మీ రుచికి తగినంత

* బాదం పప్పులు - 5

* కుంకుమ పువ్వు - కొంచెం

తయారీ విధానం

ముందుగా క్యారెట్​లను పీల్​ చేసి.. ముక్కలుగా కట్ చేసి.. మెత్తగా ఉడికించాలి. క్యారెట్​లను.. బాదంలతో కలిపి బ్లెండర్​లో వేయండి. కొంచెం నీరు వేసి ప్యూరీలా చేయండి. ఇప్పుడు పాన్​లో పాలు వేడి చేసి.. దానిలో దాల్చిన చెక్క వేయండి. అనంతరం క్యారెట్ ప్యూరీ వేసి.. 5 నిమిషాలు ఉడికించండి. దానిలో కుంకుమ పువ్వు, పంచదార వేసి బాగా కలపండి. అంతే వేడి వేడి క్యారెట్ పాలు మీకు రెడీ. అంతే దానిని ఓ గ్లాసులోకి బాదం పలుకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోండి.

తదుపరి వ్యాసం