తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kfc Style Crispy Chicken Popcorn Recipe : కేఎఫ్​సీ స్టైల్ క్రిస్పీ చికెన్ పాప్​ కార్న్.. ఇంట్లోనే చేసేయండిలా..

KFC Style Crispy Chicken Popcorn Recipe : కేఎఫ్​సీ స్టైల్ క్రిస్పీ చికెన్ పాప్​ కార్న్.. ఇంట్లోనే చేసేయండిలా..

24 December 2022, 16:30 IST

google News
    • KFC Style Crispy Chicken Popcorn Recipe : చికెన్​లందూ కేఎఫ్​సి చికెన్ వేరయా అనడంలో ఎటువంటి సందేహం లేదు. జ్యూసీ, టేస్టీ చికెన్ అందించడంలో కేఎఫ్​సి ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే మీరు మీ న్యూఇయర్, క్రిస్మస్​ కోసం కేఎఫ్​సి రెసిపీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 
క్రిస్పీ చికెన్ పాప్​ కార్న్
క్రిస్పీ చికెన్ పాప్​ కార్న్

క్రిస్పీ చికెన్ పాప్​ కార్న్

KFC Style Crispy Chicken Popcorn Recipe : కేఎఫ్​సి చికెన్​ను చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలు బాగా తింటారు. అయితే రోజూ కేఎఫ్​సికి వెళ్లాలంటే బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. కాబట్టి మీరే ఇంట్లోనే కేఎఫ్​సి రెసిపీని ట్రై చేయవచ్చు. ఇంట్లోనే కెఎఫ్​సి స్టైల్​లో క్రిస్పీ చికెన్ పాప్​కార్న్ తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసినవి

* చికెన్ బ్రెస్ట్ - 250 గ్రాములు (బోన్స్ లేనివి)

* వెల్లుల్లి - 2 టీస్పూన్లు (ముక్కలు చేసినవి)

* నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

* ఒరేగానో - 1 టీస్పూన్

* థైమ్ ఆకులు - 1 టీస్పూన్

* రోజ్మేరీ - 1 టీస్పూన్

* రెడ్ చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

* జీలకర్ర పొడి - 1 టీస్పూన్

* గరం మసాలా పొడి - 1 టీస్పూన్

* బ్రౌన్ బ్రెడ్ - 4

* గుడ్డు - 1

* పాలు - 1 టేబుల్ స్పూన్

* ఆల్ పర్పస్ ఫ్లోర్ (మైదా) - 1/2 కప్పు

తయారీ విధానం

KFC స్టైల్ క్రిస్పీ చికెన్ పాప్‌కార్న్‌ను తయారు చేయడం కోసం ముందుగా చికెన్‌ను బాగా కడగాలి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్‌ను మెరినేట్ చేయడానికి.. మిక్సింగ్ గిన్నెలో, చికెన్, వెల్లుల్లి, నిమ్మరసం, ఒరేగానో, థైమ్, రోజ్మేరీ, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలపాలి. దీన్ని సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

ఇప్పుడు మీడియం- మంట మీద గ్రిడిల్ వేడి చేయండి. బ్రెడ్ ముక్కలను క్రిస్పీగా రోస్ట్ చేయండి. దానిని చల్లార్చనిచ్చి.. మిక్సర్ జార్‌లో బ్రెడ్‌ను గ్రైండ్ చేయండి. ఆ పౌడర్ ఒక గిన్నెలోకి తీసుకుని.. జీలకర్ర పొడి, గరం మసాలా మిక్స్ వేసి పక్కన పెట్టుకోవాలి.

మరొక గిన్నెలో గుడ్డు పగలగొట్టి.. గుడ్లలో పాలు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. మైదాను ఒక గిన్నెలో వేసి సిద్ధంగా ఉంచుకోవాలి. మీడియం మంట మీద పాన్ పెట్టి నూనె వేడి చేయండి. చికెన్, గుడ్డు, మైదా, బ్రెడ్ పౌడర్​ను ఓ క్రమంలో పెట్టుకోండి. ఇప్పుడు చికెన్​ను గుడ్డులో ముంచి, మైదాలో రోల్ చేసి, మరోసారి గుడ్డులో ముంచి, చివరగా బ్రెడ్ ముక్కల్లో రోల్ చేయండి. ఆ చికెన్​ను నూనెలో వేసి.. 3-4 నిమిషాలు కుక్ చేయండి. అవి ఉడికిన తర్వాత.. పక్కకు తీసేయండి. అంతే వేడి వేడి క్రిస్పీ చికెన్ పాప్‌కార్న్‌ రెడీ. మంచి డిప్స్​తో లేదా టీతో వీటిని సేవించవచ్చు.

తదుపరి వ్యాసం