తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Idly Tikki Recipe : ఇడ్లీలతో టిక్కీలు.. సాయంత్రానికి స్పెషల్ స్నాక్..

Idly Tikki Recipe : ఇడ్లీలతో టిక్కీలు.. సాయంత్రానికి స్పెషల్ స్నాక్..

23 December 2022, 16:00 IST

    • Idly Tikki Recipe : ఉదయాన్నే వండిన ఇడ్లీలు మిగిలిపోతే.. మీరు సాయంత్రం రుచికరమైన టిక్కీలు తయారు చేసుకోవచ్చు. మీ ఈవెనింగ్​ని టేస్టీగా మార్చుకోవాలంటే.. మీరు కచ్చితంగా ఈ స్నాక్ ట్రై చేయాల్సిందే.
ఇడ్లీ టిక్కీ
ఇడ్లీ టిక్కీ

ఇడ్లీ టిక్కీ

Idly Tikki Recipe : ఇడ్లీలు పోషకాహారంగా చెప్తారు. అయితే ఉదయం వీటిని తింటే బాగుంటుంది. కానీ అవి మిగిలిపోతే సాయంత్రం వాటిని తినాలంటే ఏదోలా ఉంటుంది. అయితే వీటిని మరింత రుచిగా తీసుకోవాలంటే మీకోసం ఇక్కడో రెసిపీ ఉంది. అదే ఇడ్లీ టిక్కీ. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

కావాల్సిన పదార్థాలు

* ఇడ్లీ - 4-5

* బంగాళాదుంపలు - 1 కప్పు (ఉడికించినవి)

* క్యారెట్ - 1 (తరిగినవి)

* క్యాప్సికమ్ - 1 (తరిగినవి)

* బఠాణీలు - అరకప్పు

* కారం - 1 టీస్పూన్

* మిరియాలు - 1 టీస్పూన్

* ధనియాల పొడి - 1 టీస్పూన్

* కరివేపాకు - 1 రెబ్బ

* ఆవాలు - 1 టీస్పూన్

తయారీ విధానం

ఇడ్లీ టిక్కీ తయారు చేయడానికి.. ఓ గిన్నెలో ఇడ్లీలను తీసుకుని వాటిని ఒక గిన్నెలో వేసి పిండి చేయండి. దానిలో బంగాళాదుంపలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ తురుము, బఠాణీలు వేసి కలపండి. అనంతరం కారం, పెప్పర్ పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కలపండి.

ఈ పిండితో చిన్న చిన్న టిక్కీలు తయారు చేసుకుని.. వేడి వేడి నూనెలో వేసి.. డీప్ ఫ్రై చేయండి. వాటిని క్రిస్పీగా, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి.

టాపిక్

తదుపరి వ్యాసం