Carrot Dosa: వేడివేడిగా స్పైసీ క్యారెట్ దోశ ఇలా చేసుకోండి, పల్లీ చట్నీతో అదిరిపోతుంది
21 March 2024, 6:00 IST
- Carrot Dosa: ఎప్పుడూ ఒకేలాంటి దోశెలను తినకుండా ఒకసారి క్యారెట్ దోశ ప్రయత్నించండి. పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరం. క్యారెట్ దోశ రెసిపీ చాలా సులువు.
క్యారెట్ దోశె రెసిపీ
Carrot Dosa: అల్పాహారం అనగానే అందరికీ ఇడ్లీ, దోశ, పూరీ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా దోశకు అభిమానులు ఎక్కువ. ఇప్పుడు ఒకేలాంటి దోశెలు తినే బదులు... కాస్త డిఫరెంట్‌గా క్యారెట్ దోశను తినేందుకు ప్రయత్నించండి. దీన్ని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. క్యారెట్ దోశ కాస్త స్పైసీగా చేసుకుంటే పెద్దలకు కూడా నచ్చుతుంది. దీన్ని గట్టి చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. క్యారెట్ దోశ ఎలా చేయాలో ఇక్కడ మేము చెప్పాము. దాన్ని ఫాలో అయిపోండి.
స్పైసీ క్యారెట్ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం - ఒక కప్పు
మినప్పప్పు - ఒక కప్పు
తురిమిన క్యారెట్ - ఒక కప్పు
పసుపు - అర స్పూను
కారం - అర స్పూను
వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
అల్లం పేస్ట్ - ఒక స్పూను
నూనె - సరిపడా
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
స్పైసీ క్యారెట్ దోశ రెసిపీ
1. బియ్యం, మినప్పప్పును శుభ్రంగా కడిగి విడివిడిగా మూడు గంటల పాటు నానబెట్టాలి.
2. తరువాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
3. దాన్ని రాత్రంతా వదిలేయాలి. దీనివల్ల ఆ పిండి పులుస్తుంది.
4. మరుసటి రోజు దోశ పిండిని బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, నీరు కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టఫింగ్ కోసం క్యారెట్‌ను రెడీ చేసుకోవాలి.
6. ఒక స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఒక కప్పు తురిమిన క్యారెట్ ను వేసి బాగా వేయించాలి.
7. అందులోనే పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా చూడాలి.
8. కాస్త ఉప్పును కూడా వేసుకోవాలి.
9. నాలుగు నిమిషాల పాటు వేయించాక మిక్సీలో వేసి పేస్టులాగా చేసుకోవాలి.
10. దాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
11. మసాలా దోశకు ఎలా అయితే ఆలూ కూర చేస్తారో క్యారెట్ దోశకు అలాగే ఈ క్యారెట్ మిశ్రమాన్ని చేసుకోవాలి.
12. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ రాసి దోశను వేసుకోవాలి.
13. దోశ మీద ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి దోశ అంతా పరుచుకునేలా చేయాలి.
14. బాగా కాలాక దోశెను మడతపెట్టి ఒక ప్లేట్లో వేయాలి.
ఈ దోశలో అదనంగా క్యారెట్‌ని వినియోగించాము. కాబట్టి సాధారణ దోశతో పోలిస్తే ఈ క్యారెట్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ క్యారెట్ దోశను చేస్తే మళ్లీ మళ్లీ మీరే చేసుకుని తింటారు. పిల్లలకు ఇది ఉత్తమ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవాలి. అప్పుడప్పుడు దీన్ని లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా పిల్లలకు తినిపించవచ్చు. దీన్ని కేవలం పిల్లలే కాదు, పెద్దలు కూడా తినడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. దీన్ని పిల్లలకు పదేపదే తినిపిస్తారు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. పెద్దగా సమయం పట్టదు. క్యారెట్ తురమడానికి మాత్రమే కొంత సమయం పడుతుంది. ప్రతిసారీ క్యారెట్ కూరను వండుకునే బదులు ఇలా క్యారెట్ దోశను చేసుకోవడం వల్ల కాస్త కొత్తగా ఉంటుంది.
టాపిక్