World Cancer Day 2023: మూల కణాల మార్పిడితో క్యాన్సర్ నయమవుతుందా?
08 January 2024, 20:34 IST
World Cancer Day 2023: మూల కణాల మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్)తో క్యాన్సర్ చికిత్సల గురించి క్యాన్సర్ వైద్య నిపుణుల సూచనలివే. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా ప్రత్యేక కథనం.
Cancer treatment: స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ వల్ల క్యాన్సర్ నయమవుతుందా?
క్యాన్సర్ కణాల వల్ల ఏర్పడిన రక్తంలో లోపాలు, రోగనిరోధక వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు 30 ఏళ్లకు పైగా స్టెమ్ సెల్స్ (మూల కణాలు) ఉపయోగపడుతున్నాయి. కీమోథెరపీ లేదా రేడియేషన్‌తో కూడిన చికిత్స సమయంలో కూడా మూలకణాలు ఉపయోగపడుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థ సరిదద్దిడంలో ఉపయోగడపడడంతో పాటు మూల కణాలు కణజాల పునరుత్పత్తిలో, క్యాన్సర్ థెరపీల్లో డెలివరీ వాహకాలుగా పనిచేస్తున్నాయి.
క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అనే భావన భవిష్యత్తు క్యాన్సర్ థెరపీల్లో కొత్త పరిశోధనలకు మార్గం చూపింది. స్టెమ్‌ఆర్ఎక్స్ బయో సైన్స్ సొలూష్యన్స్ ఫౌండర్, రీజనరేటివ్ మెడిసిన్ పరిశోధకులు డాక్టర్ ప్రదీప్ మహాజన్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అంటే ఏమిటో హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
‘అవి క్యాన్సర్‌తో పోరాటే మూల కణాల్లా అనిపిస్తాయి. కానీ కాదు. అవి క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలు. గతంలో అన్ని క్యాన్సర్ కణాలు ఒకేవిధమైనవి అని అనుకునేవారు. అయితే కొన్ని నిర్ధిష్టమైనవి, వేగంగా పెరిగే క్యాన్సర్ స్టెమ్ సెల్స్ పేషెంట్‌ను అత్యంత వేగంగా అనారోగ్యానికి గురిచేస్తాయనడానికి ఇప్పుడు ఆధారాలు దొరికాయి. క్యాన్సర్ చికిత్స చేయడానికి, పునరావృతం కాకుండా ఉండేందుకు ఇచ్చే ప్రామాణిక మందులతో పాటు క్యాన్సర్ స్టెమ్ సెల్స్‌ను లక్ష్యంగా చేసే చికిత్సలు కీలకంగా మారాయి..’ అని వివరించారు.
క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇమ్యునోథెరపీని వివరించారు. ‘ఇమ్యునోథెరపీ అనేది క్యాన్సర్ చికిత్సా పద్ధతి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం లేదా ప్రయోగశాలలో సృష్టించిన సమ్మేళనాలను ఉపయోగించి క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేయడంలో శరీరానికి సహాయపడుతుంది. అనేక రకాల క్యాన్సర్లకు చికిత్స చేయడానికి ఇమ్యునోథెరపీని ఉపయోగించవచ్చు. ఇది విడిగా లేదా కీమోథెరపీ లేదా ఇతర క్యాన్సర్ చికిత్సలతో ఉపయోగించవచ్చు..’ అని వివరించారు.
‘వివిధ రకాలైన క్యాన్సర్‌లు వేర్వేరు కణాలతో పోరాడుతాయి. ఉదాహరణకు, క్యాన్సర్‌పై రోగనిరోధక వ్యవస్థ దాడి చేసే ఒక మార్గం టీ కణాలను విడుదల చేయడం. ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు. టీ కణాలు క్యాన్సర్‌ను "విదేశీ" కణాలుగా చూస్తాయి. ప్రాణాంతక కణాలను తొలగించడానికి ప్రయత్నిస్తాయి..’ అని వివరించారు. ‘ఇవి ఒకరకంగా ట్రీట్మెంట్ వల్ల కలిగే సైడ్‌ఎఫెక్ట్స్‌ను కూడా నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతాయి..’ అని వివరించారు.
స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే క్యాన్సర్‌పై పోరాడుతాయా?
స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే క్యాన్సర్‌పై పోరాడుతాయా? అన్న ప్రశ్నకు డాక్టర్ బదులిచ్చారు. ‘స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్స్ సాధారణంగా నేరుగా క్యాన్సర్‌పై పోరాడవు. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ లేదా రెండింటి అధిక డోసులతో చికిత్స తర్వాత మూలకణాలను తయారు చేసే మీ శరీర సామర్థ్యాన్ని పునరుద్ధరించడంలో అవి సహాయపడతాయి. మల్టిపుల్ మైలోమా, కొన్ని రకాల లుకేమియాలో స్టెమ్ సెల్ మార్పిడి ద్వారా ప్రాణాంతకత పరిస్థితులను నేరుగా ఎదుర్కోవచ్చు. గ్రాఫ్ట్-వర్సెస్-ట్యూమర్ అని పిలువబడే ఒక పరిణామం దీనికి కారణం..’ అని వివరించారు.
‘కొన్ని ప్రాణాంతక పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించే కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ బలమైన డోసుల వల్ల మూలకణాలు దెబ్బతిన్న వ్యక్తులకు మూలకణాలను పునరుద్ధరించే చికిత్స స్టెమ్ సెల్ మార్పిడి. క్యాన్సర్ చికిత్సలో బోన్ మ్యారో, స్టెమ్ సెల్ మార్పిడిని తరచుగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల లుకేమియా, లింఫోమా వంటి కొన్ని ప్రాణాంతక పరిస్థితులకు వీటి ద్వారా చికిత్స చేయవచ్చు..’ అని వివరించారు. అయితే చికిత్సలో భాగంగా తదుపరి క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదిస్తూ ఉండాలి. స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అనంతరం ఏవైనా దుష్ప్రభావాలు సంభవించకుండా ఉండేందుకు ఇది అవసరం..’ అని వివరించారు.