Symptoms of bladder cancer: ఈ 5 లక్షణాలు కనిపించాయా? బ్లాడర్ క్యాన్సర్ కావొచ్చు
08 January 2024, 20:35 IST
- Symptoms of bladder cancer: బ్లాడర్ క్యాన్సర్ గుర్తించేందుకు 5 సంకేతాలు, లక్షణాలను క్యాన్సర్ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు తెలుసా
మూత్రాశయ క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. మూత్రాశయంలో ఉండే కణాల్లో మొదలవుతుంది. ఆ కణాలు నియంత్రణ లేకుండా పెరగడంతో మూత్రాశయ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. మూత్రాశయం అనేది పొత్తికడుపులో మూత్రాన్ని నిల్వ చేసే అవయవం. మూత్రం నిల్వ ఉన్నప్పుడు మూత్రాశయ గోడలు వ్యాకోచిస్తాయి. మూత్రనాళం ద్వారా మూత్రం విసర్జించినప్పుడు గోడలు సంకోచిస్తాయి. మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలను త్వరితగతిన గుర్తిస్తే వ్యాధి నిర్ధారణ, చికిత్స సులువవుతుంది. మూత్రాశయ క్యాన్సర్ లక్షణాల్లో మూత్రంలో రక్తం పడడం తొలుత కనిపించే లక్షణం. అలాగే యూరిన్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉంటుంది. లేదా తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.
Bladder cancer cases increasing: పెరుగుతున్న బ్లాడర్ క్యాన్సర్ కేసులు
‘ప్రపంచవ్యాప్తంగా మూత్రాశయ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. 2018లో 5.49 లక్షల మూత్రాశయ క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అలాగే బ్లాడర్ క్యాన్సర్ కారణంగా 2 లక్షల మంది పేషెంట్లు మరణించారు. ఈ బ్లాడర్ క్యాన్సర్ కేసుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉంది. అదే ఏడాది మన దేశంలో 18,921 కేసులు నమోదవగా, 10,231 మంది మరణించారు. బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలను త్వరితగతిన గుర్తించి వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స అందించవచ్చు. బతికే అవకాశాలు మెరుగుపడతాయి..’ అని మరెంగో క్యూఆర్‌జీ హాస్పిటల్ సీనియర్ ఆంకాలజీ కన్సల్టెంట్ డాక్టర్ సన్నీ జైన్ వివరించారు. బ్లాడర్ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలను వివరించారు.
Bladder cancer warning signs and symptoms: బ్లాడర్ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు
• మూత్రంలో రక్తం లేదా రక్తం గడ్డలు పడడం
• యూరిన్ చేసేటప్పుడు నొప్పి లేదా మంట కలగడం. ఇది ప్రమాద సంకేతం. వైద్యుడిని సంప్రదించాలి.
• రాత్రి పూట తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం
• మూత్ర విసర్జనలో ఇబ్బంది: మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది. కానీ చేయలేరు. బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవకపోవడం వల్ల మూత్ర విసర్జన తరచుగా చేయాల్సి వస్తుంది.
• దిగువ వెన్ను భాగంలో నొప్పి