తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dragon Fruit For Diabetes: డయాబెటిస్‍ ఉన్న వారు డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్‌గా తినొచ్చా?

Dragon Fruit for Diabetes: డయాబెటిస్‍ ఉన్న వారు డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్‌గా తినొచ్చా?

26 November 2024, 19:00 IST

google News
    • Dragon Fruit for Diabetes: డ్రాగన్ ఫ్రూట్ తినడం మీకు బాగా ఇష్టమా? ఒకవేళ మీకు డయాబెటిస్ ఉండే ఈ పండును రెగ్యులర్‌గా తినొచ్చా అనే విషయం ఇక్కడ చూడండి. రోజులో ఎంత తీసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
Dragon Fruit for Diabetes: డయాబెటిస్‍ ఉన్న వారు డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్‌గా తినొచ్చా?
Dragon Fruit for Diabetes: డయాబెటిస్‍ ఉన్న వారు డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్‌గా తినొచ్చా?

Dragon Fruit for Diabetes: డయాబెటిస్‍ ఉన్న వారు డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్‌గా తినొచ్చా?

డిఫరెంట్ టేస్ట్‌తో ఉండే డ్రాగన్ ఫ్రూట్‍ను చాలా మంది ఇష్టంగా తింటారు. కొంతకాలంగా ఈ ఫ్రూట్ చాలా పాపులర్ అయింది. దీన్ని తినే వారు ఎక్కువతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‍లో పోషకాలు మెండుగా ఉంటాయి. దీన్ని తింటే ఆరోగ్యానికి కొన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి. డ్రాగన్ ఫ్రూట్‍తో జ్యూస్, మాక్‍టైల్స్ కూడా డిఫరెంట్‍గా ఉంటాయి. అయితే, తీపిగా ఉండే ఈ పండును డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్‌గా తినొచ్చా అనే సందేహం ఉంటుంది.

డయాబెటిస్ ఉన్న వారు తినొచ్చా?

డ్రాగన్ ఫ్రూట్‍లో పాలీన్యూట్రియంట్స్, యాంటీఆక్సిడెంట్లతో పాటు ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. డ్రాగన్ పండులో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు ఈ పండును రెగ్యులర్‌గా మోతాదు మేరకు తీసుకోవచ్చు. డ్రాగన్ పండులో 48 నుంచి 52 గ్లెసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీంతో డయాబెటిస్ ఉన్న వారికి ఈ పండు సూటవుతుంది. ఫైబర్ ఉండడం వల్ల మోతాదు మేరకు ఈ పండును తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా తోడ్పడుతుంది.

రోజులో ఎంత తినొచ్చు?

డయాబెటిస్ ఉన్న వారు రోజులో 100 గ్రాముల డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చు. 100 గ్రాముల్లో సుమారు 60 క్యాలరీలు ఉంటాయి. ఈ మోతాదు మేరకు డ్రాగన్ ఫ్రూట్ తింటే డయాబెటిస్ ఉన్న వారికి ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. మొత్తంగా మధుమేహం ఉన్న వారు రోజులో 100 గ్రాముల వరకు డ్రాగన్ పండు తీసుకోవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్‍తో ప్రయోజనాలు

ఫైబర్ వల్ల..: డ్రాగన్ ఫ్రూట్‍లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ సెన్సివిటీని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేలా తోడ్పడతుంది.

బీపీ నియంత్రణ: డ్రాగన్ పండులో మెగ్నిషియం మెండుగా ఉంటుంది. దీంతో ఇది తింటే బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు కూడా సాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు: డ్రాగన్ పండులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ ఉన్న వారికి గుండె వ్యాధులు వచ్చే రిస్క్ ఈ పండు తినడం వల్ల తగ్గుతాయి.

బరువు తగ్గేందుకు..: డ్రాగన్ ఫ్రూట్‍లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. చిటికీమాటికీ ఆకలి అనిపించదు. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేస్తుంది. తద్వారా బరువు తగ్గే ప్రయత్నానికి ఈ పండు తోడ్పడుతుంది. జీర్ణక్రియను కూడా ఈ పండు మెరుగుపరుస్తుంది.

తదుపరి వ్యాసం