Dragon Fruit Benefits : చెడు కొలెస్ట్రాల్ తగ్గించే డ్రాగన్ ఫ్రూట్.. ఒక్కటి తింటే చాలు-dragon fruit can reduce bad cholesterol and cancer cells details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dragon Fruit Benefits : చెడు కొలెస్ట్రాల్ తగ్గించే డ్రాగన్ ఫ్రూట్.. ఒక్కటి తింటే చాలు

Dragon Fruit Benefits : చెడు కొలెస్ట్రాల్ తగ్గించే డ్రాగన్ ఫ్రూట్.. ఒక్కటి తింటే చాలు

Anand Sai HT Telugu
Nov 20, 2023 03:30 PM IST

Dragon Fruit Benefits : మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడంలో డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది. అంతే కాదు రెగ్యులర్ గా డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు
డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు (Unsplash)

భారతదేశంలోని ప్రముఖ పోషకాహార నిపుణులు క్రమం తప్పకుండా డ్రాగన్ ఫ్రూట్ తినమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే దీన్ని తినడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి పెను ప్రమాదాన్ని కలిగిస్తుంది. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మన సిరల్లో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది నిరంతర అధిక రక్తపోటు సమస్యలను కలిగిస్తుంది. దానిని అదుపులో ఉంచుకోవడానికి, డ్రాగన్ ఫ్రూట్ మంచి ఫలితాలను ఇస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

yearly horoscope entry point

డ్రాగన్ ఫ్రూట్ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటిన్, ప్రొటీన్లు, థయామిన్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి.

ఇందులో పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అందుకే ఈ పండును తరచుగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిక్ రోగులకు డ్రాగన్ ఫ్రూట్ మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, థియోల్స్, కెరోటినాయిడ్లు, గ్లూకోసినోలేట్స్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఈ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడతాయి. ఇది ధమనుల దృఢత్వాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండులో మోనోశాచురేటెడ్ కొవ్వు సరైన మొత్తంలో ఉంటుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

డ్రాగన్ ఫ్రూటలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలతోపాటుగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ దొరుకుతాయి. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయని నియంత్రించడంలో సాయపడతాయి. డ్రాగన్ ఫ్రూట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది. డయబెటిస్ లేనివారు ఈ పండు తింటే షుగర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది మహిళలకు రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షమ కల్పిస్తాయి. క్యాన్సర్ పెషెంట్స్ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే కొంత ఉపశమనం దొరుకుతుంది. రోజుకు ఒక్క డ్రాగన్ ఫ్రూట్ తింటే చాలు చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు.

Whats_app_banner