Calisthenics Workouts : బరువు తగ్గడమే కాదు.. ఈ వర్కౌట్స్‌తో బలాన్ని కూడా పెంచుకోవచ్చు..
05 November 2022, 7:35 IST
- Calisthenics Workouts : కొందరు పైకి ఎంత గంభీరంగా కనిపించినా వారిలో బలం పెద్దగా ఉండదు. చిన్నవాటికే అలసిపోతూ ఉంటారు. అలాంటివారికి కాలిస్టెనిక్స్ వర్కౌట్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి శరీర బరువుని బట్టి మీ బలాన్ని క్రమంగా పెంచుతాయి. దీనిలోని కొన్ని మోస్ట్ ఎఫెక్టివ్ వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిస్టెనిక్స్ వర్కౌట్స్
Calisthenics Workouts : ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్న వర్కౌట్స్‌లో కాలిస్టెనిక్స్ వర్కౌట్ గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇవి ఎప్పటినుంచో ఉన్నవైనా.. ప్రజలు ఇప్పుడు తమ బలాన్ని పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాలిస్టెనిక్స్ అనేది వ్యక్తి మొత్తం శరీర బరువుపై మాత్రమే ఆధారపడి ఉండే వ్యాయామాల సమితి. ఈ వ్యాయామాలు పూర్తి వైవిధ్యాలతో నిండి ఉంటాయి. అదనంగా ఈ వ్యాయామం ఓర్పు, బలం, సమన్వయాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు దీనిని ప్రారంభించాలని, మీ స్ట్రెంత్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ వ్యాయామాలతో దీనిని ప్రారంభించండి.
పుల్-అప్స్
రోజుకి 10 పుల్-అప్స్ చేయండి. ఇది మీ ఎగువ శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఈ వ్యాయామాన్ని చేయడానికి.. పుల్ అప్ బార్ కింద నిలబడండి. కొంచెం పైకి ఎగిరి.. బార్‌ను మీ చేతులతో గట్టిగా పట్టుకోండి. మీ చేతులు భుజం వెడల్పు కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ భుజం కండరాలను ఉపయోగించి మిమ్మల్ని మీరు పైకి ఎత్తండి. మీ తలను బార్ పైకి తీసుకురండి. ఇలా ఓ 10 చేయండి.
డిప్స్
డిప్స్ 20 సార్లు చేయండి. మీ చేతులు, భుజం, ఛాతీ, ట్రైసెప్స్‌ను టోన్ చేయడంలో ఇవి మీకు సహాయం చేస్తాయి. డిప్ బార్ లోపల నిల్చొని.. మిమ్మల్ని పైకి లేపడానికి మీ చేతులు, భుజాల బలాన్ని ఉపయోగించండి. ఇప్పుడు మీ ట్రైసెప్ కండరాలను ఉపయోగించి, మీ మోచేతులను వెనుకకు ఉంచి పైకి, కిందికి కదలండి.
జంప్ స్క్వాట్స్
మీ పాదాలను సమాంతరంగా ఉంచండి. అవి మీ భుజాల కింద ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ మోకాళ్లను వంచేటప్పుడు మీ తుంటిని వెనుకకు తగ్గించడం ద్వారా స్క్వాట్ పొజిషన్‌లో ఉంచండి. మీరు మీ ముఖం, తల, మెడ, భుజాలను ముందుకు ఉంచి మీ ఛాతీని నిటారుగా ఉంచుతున్నారని నిర్ధారించుకోండి. మీరు కిందికి వెళ్లిన తర్వాత.. పైకి ఎగరండి. ఈ వ్యాయామాన్ని 25 సార్లు చేయండి.
క్రంచ్స్
పడుకుని మీ పాదాలను నేలపై ఉంచండి. ఇప్పుడు మీ శరీరం వైపు 90-డిగ్రీల కోణంలో మీ మోకాళ్లను వంచి.. మీ చేతులను మీ తలకింద ఉంచండి. మీ చేతులతో మీ మోకాళ్లను తాకించండి. మీరు లేచి కూర్చున్నప్పుడు ఊపిరి పీల్చుకోండి. ఇలా 50 క్రంచ్స్ చేయండి.
స్కిప్పింగ్..
మీ జంపింగ్ తాడును దాని హ్యాండిల్స్‌తో పట్టుకోండి. మీ రెండు చేతుల మధ్య సమానంగా దూరం ఉండేలా చూసుకోండి. మణికట్టుతో తాడును తిప్పుతూ.. స్కిప్పింగ్ చేయండి. మీరు దూకుతున్నప్పుడు మీరు మీ మోకాళ్లను కొద్దిగా వంచవచ్చు. ఇలా 30 సెకన్లు చేయండి. క్రమంగా ఈ సమయాన్ని పెంచుకోవచ్చు. ఇది మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది.
టాపిక్