తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Exercise And Memory | ఎక్కువగా వ్యాయామాలు చేస్తే.. గజినీలు అయిపోతారట!

Exercise and Memory | ఎక్కువగా వ్యాయామాలు చేస్తే.. గజినీలు అయిపోతారట!

26 September 2022, 11:54 IST

  • వ్యాయామం శారీరకంగానే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని తెలుసు. కానీ అన్ని రకాల వ్యాయామాలు మెదడుపై ఒకే ప్రభావాన్ని కలిగి ఉండవు. డార్ట్‌మౌత్ అధ్యయనం ప్రకారం, వ్యాయామం కనబరిచే ప్రభావాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. సుదీర్ఘ కాలం పాటు తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటే అది వ్యక్తుల జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తక్కువ తీవ్రతతో వ్యాయామం చేసే వ్యక్తుల్లో మెమరీ కొన్ని అంశాల్లో మెరుగ్గా ఉండగా, అధిక తీవ్రతతో వ్యాయామం చేసే వ్యక్తుల్లో మెమరీ మరికొన్ని అంశాల్లో మెరుగ్గా ఉందని ఫలితాల్లో తేలింది. అయితే ఇంటెన్స్ వ్యాయామాలు చేసే వారు మానసికంగా కూడా అధిక ఒత్తిడి స్థాయిలను అనుభవిస్తారు. అలాగే క్రమం తప్పకుండా మితమైన వ్యాయామం చేసే వ్యక్తుల్లోనే ఆందోళన, డిప్రెషన్ తక్కువ కలిగి ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఇక, బైపోలార్ డిజార్డర్ ఉన్నవారికి ఎపిసోడిక్ మెమరీ మెరుగ్గా ఉందని ఇదే పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో గత ఏడాది కాలంగా ఫిట్‌నెస్ ట్రాకర్లలో నమోదైన డేటాను పరిశీలించారు. ఈ రకంగా వ్యాయామం, మానసిక ఆరోగ్యం మధ్య సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు.