Weight Loss | బరువు తగ్గేందుకు రోజుకు 5 నిమిషాలు చాలు.. ఎలాగో చూడండి!-easy ways to lose your weight add this 5 minute workout ideas to your daily routine ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weight Loss | బరువు తగ్గేందుకు రోజుకు 5 నిమిషాలు చాలు.. ఎలాగో చూడండి!

Weight Loss | బరువు తగ్గేందుకు రోజుకు 5 నిమిషాలు చాలు.. ఎలాగో చూడండి!

Jan 08, 2024, 10:18 PM IST HT Telugu Desk
Nov 03, 2022, 11:51 PM , IST

  • Easy Weight Loss Tips: బరువు తగ్గేందుకు బరువులు ఎత్తడాలు, జిమ్ లో ఎక్కువ సేపు భారీ వ్యాయామాలు చేయనవసరం లేదు. రోజుకు 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఎలాగో చూడండి.

బరువు తగ్గాలంటే, ఆహారాన్ని తగ్గించడం, ఎక్కువ వ్యాయామాలు చేయడం ఉంటుందని చాలా మంది భావిస్తారు. అయితే సులభంగా బరువు తగ్గడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

(1 / 8)

  మరీ ముఖ్యంగా, ఈ విధంగా బరువు తగ్గడానికి మీరు ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. రోజూ కేవలం 5 నిమిషాలు కేటాయిస్తే చాలు, బరువు తగ్గవచ్చు. అది కూడా చాలా తక్కువ కాలంలోనే. మరి మీరు ఉదయం 5 నిమిషాలు కేటాయించగలరా?

(2 / 8)

కొన్ని చాలా తేలికపాటి వ్యాయామాలు మీ శరీర కొవ్వును గణనీయంగా తగ్గిస్తాయి. ఆ జాబితాను చూడండి.

(3 / 8)

స్కిప్పింగ్:  ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 5 నిమిషాలు తాడు జంప్ చేయండి. దాని వల్ల కలిగే ప్రయోజనాలను మీరు ఊహించలేరు. కొవ్వు కరగడం, బరువు తగ్గడం అన్నీ జరుగుతాయి.

(4 / 8)

బర్పీస్: కొంచెం కష్టపడాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజూ సరిగ్గా 5 నిమిషాలు బర్పీలు చేయండి.  ఈ వ్యాయామం త్వరగా బరువును తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

(5 / 8)

ప్లాంక్: ప్రతిరోజూ 5 నిమిషాలు ప్లాంక్ చేయండి. దీంతో  కూడా బరువు త్వరగా తగ్గుతుంది. ఇది నడుము, వెనుక కండరాలను మెరుగుపరుస్తుంది

(6 / 8)

స్క్వాట్స్: ఇది కూడా గొప్ప వ్యాయామం. కాళ్లలో, నడుము దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నవారు,  ఈ వ్యాయామం చేయవచ్చు. రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే బరువు తగ్గుతారు. కానీ గుర్తుంచుకోండి, ఈ వ్యాయామాలన్నింటినీ చేసే ముందు డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించండి. ఎందుకంటే నిపుణులు మాత్రమే మీకు ఏది ఉత్తమమైనది, సురక్షితమైనదో చెప్పగలరు

(7 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు