Roti Pizza Recipe : అల్పాహారంలో రోటి పిజ్జా.. హెల్తీ కూడా
20 February 2023, 6:30 IST
- Breakfast Recipe : సరైన ఆహారం తీసుకుంటేనే.. హెల్తీగా ఉంటారు. ఉదయం పూట తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. రోజంతా ఎనర్జీగా ఉండాలంటే.. బ్రేక్ ఫాస్ట్ సరిగా తినాలి. మిస్ చేయకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరోగ్యకరమైన రోటి పిజ్జాను అల్పాహారంలోకి తీసుకోండి.
రోటి పిజ్జా తయారీ
ఉదయం తీసుకునే ఆహారం.. సరిగా ఉంటే.. చాలా వరకు ఆరోగ్య సమస్యలు దగ్గరకు రావు. మీ బ్రేక్ ఫాస్ట్(Breakfast) ను రోటి పిజ్జాతోనూ మెుదలుపెట్టొచ్చు. హెల్తీగా టెస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినేందుకు ఆసక్తి చూపిస్తారు. పిజ్జా(Pizza) అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. బయట కొనుగోలు చేసే పిజ్జాను రిఫైండ్ పిండితో తయారు చేస్తారు. మీరు ఇంట్లోనే ఎంచక్కా పిజ్జా తయారు చేసుకుని తినొచ్చు. ఇందులోకి ఆరోగ్యకరమైనవి జోడించొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
రోటి పిజ్జా(Roti Pizza) చేసుకునేందుకు ముఖ్యంగా కావాల్సింది చపాతీ. చపాతీలను సిద్ధంగా చేసుకుని తర్వాత మీకు ఇష్టమైన కూరగాయలను ఉపయోగించి సులభంగా చేసుకోవచ్చు. ఈ పిజ్జాను తయారు చేసేందుకు మెుదటగా.. ఒక పాన్ పై చపాతీలు పెట్టాలి. దీనిపై కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి. దీంతో రుచి మరింత పెరుగుతుంది.
ఆ తర్వాత పిజ్జా తయారు చేసేందుకు ఉపయోగించే.. పిజ్జా సాస్ లేదంటే.. టామాట సాస్ ను చపాతీపై పూయాలి. తర్వాత మీకు నచ్చిన కూరగాయలను చపాతీపై వేసుకోవాలి. వాటిపై కాస్త మోజెరెల చీజ్ తురిమి వేసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా రోటీని పిజ్జా బేస్‌గా ఉపయోగించుకోవడమే. దానిపై పిజ్జా సాస్, వెజిటేబుల్స్(Vegetables), పనీర్, చీజ్ వేసి కాల్చండి. పిజ్జా స్టైల్‌లో రోటీని తయారు చేసి తినడమే. ఇది రుచికరంగా హెల్తీగా ఉంటుంది.
ఇంట్లో చపాతీలు మిగిలితే.. పిల్లలకు స్నాక్స్ గా వీటిని తయారుచేసుకోవచ్చు. మీ పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తినేస్తారు. అయితే ఇలాంటి రెసిపీ చేసే ముందు పిల్లలు ఎలాంటి వాటిని ఇష్టపడతారో చూసి.. చపాతీల మీద వేసుకోవాలి. హెల్తీ రెసిపీ కోసం.. కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి.