రైస్, చపాతీల కంటే మిల్లెట్సే బెటర్.. ఈ సూపర్ ఫుడ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?-best reasons why you should include millets in daily diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రైస్, చపాతీల కంటే మిల్లెట్సే బెటర్.. ఈ సూపర్ ఫుడ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

రైస్, చపాతీల కంటే మిల్లెట్సే బెటర్.. ఈ సూపర్ ఫుడ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 07:15 PM IST

Benefits Of Millets: చిరుధాన్యాలకు ప్రాధన్యత పెరుగుతుంది. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు తినే ఆహారాలను ఇప్పుడు సూపర్ ఫుడ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి.

Benefits Of Millets
Benefits Of Millets

నేటి ఆధునిక జీవనశైలి చాలా మందిని అనేక రకాల వ్యాధులు పట్టి పీడుస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం రోజువారి ఆహార విధానమే నిపుణులు అంటున్నారు. దీంతో ఇప్పుడు చాలా పాత డైట్‌ విధానాన్ని తిరిగి అలవాటు చేసుకుంటున్నారు. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు తినే ఆహారాలను ఇప్పుడు సూపర్ ఫుడ్స్ రూపంలో ట్రెండ్ అవుతున్నాయి. జోవర్, బజ్రా, రాగి, సావన్, కంగ్నీ, చీనా, కోడో, కుట్కి, కుట్టు, మిల్లెట్స్ వంటి చిరుధాన్యాలకు రానున్న కాలంలో మరింత డిమాండ్ పెరగనుంది. తాజాగా వీటి ప్రాధన్యతను వివరిస్తూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్విట్టర్‌లో మిల్లెట్‌ల ప్రయోజనాల వివిరిస్తూ ఓ పోస్టు చేసింది. గోధుమలు, బియ్యం కంటే మిల్లెట్లలో ఎక్కువ ఎంజైములు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది కాకుండా, వాటిలో కరిగే ఫైబర్స్ కూడా ఎక్కువగా ఉంటాయని తన పోస్టులో తెలిపింది. ఇంతటి ప్రాధన్యత గల మిల్లెట్లను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి మరింతగా తెలుసుకుందాం.

పోషణ

మిల్లెట్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె, మూత్రపిండాలు రెండింటికీ మంచిది. అంతే కాకుండా విటమిన్ ఎ, బి, నియాసిన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో లభిస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చాలా అవసరం.

చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది

మిల్లెట్లు గోధుమలకు కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అవి గ్లూటెన్ ఫ్రీ, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇందులో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. అలాగే బ్లడ్ షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. వీటిలో అన్ని రకాల ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, ప్రొటీన్లు ఉంటాయి. అదనంగా, రక్తపోటు కూడా నిర్వహించబడుతుంది.

బరువు తగ్గుదల

బరువు తగ్గాలనుకున్నవారికి మిల్లెట్లు ఉత్తమమైనవి. మీ ఆహారంలో రైస్‌కు బదులుగా మిల్లెట్లను చేర్చుకోవచ్చు. అవి జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తాయి.

క్యాన్సర్ నియంత్రణ

మిల్లెట్లు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఇవి ముఖ్యంగా పెద్దప్రేగు, కాలేయం, రొమ్ములోని క్యాన్సర్ కణాలను చంపుతాయి.

మిల్లెట్స్‌ గుండెకు మేలు చేస్తాయి

మిల్లెట్స్‌లో ఫ్లేవనాయిడ్స్, ఆంథోసైనిడిన్స్, టానిన్‌లు, బీటా-గ్లూకాన్‌లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. దీంతో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం