తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bottle Gourd Chapati: సొరకాయ చపాతీ ఇలా చేశారంటే దూదిలా మెత్తగా, టేస్టీగా వస్తుంది

Bottle Gourd Chapati: సొరకాయ చపాతీ ఇలా చేశారంటే దూదిలా మెత్తగా, టేస్టీగా వస్తుంది

Haritha Chappa HT Telugu

24 May 2024, 6:00 IST

google News
    • Bottle Gourd Chapathi: సొరకాయతో చేసే రెసిపీలు టేస్టీగా ఉంటాయి. ఒకసారి వీటితో చపాతీలు చేసి చూడండి. ఇవి సుతిమెత్తగా వస్తాయి. ఏ కూరతో తిన్నా ఇవి బావుంటాయి.
సొరకాయ చపాతీలు రెసిపీ
సొరకాయ చపాతీలు రెసిపీ

సొరకాయ చపాతీలు రెసిపీ

Bottle Gourd Chapathi: చపాతీలు అంటే గోధుమపిండితో చేసేవే కాదు, కేవలం గోధుమపిండితోనే చేస్తే వాటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి. ఒకసారి సొరకాయ చపాతీలు చేసి చూడండి. ఇది పోషకాలను అందించడంతోపాటు మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి. ఈ చపాతీలు వేయించడానికి చాలా తక్కువ నూనె సరిపోతుంది. కాబట్టి ఇది హెల్తీ రెసిపీ. సొరకాయ చపాతీలు చేయడం ఎలాగో తెలుసుకోండి. ముఖ్యంగా పిల్లలకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.

సొరకాయ చపాతీలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గోధుమపిండి - రెండున్నర కప్పులు

నూనె - తగినంత

నీళ్లు - సరిపడినన్ని

ఇంగువ - చిటికెడు

మిరియాల పొడి - అర స్పూను

పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

సొరకాయ తురుము - రెండు కప్పులు

సొరకాయ చపాతీ రెసిపీ

1. ఒక గిన్నెలో గోధుమ పిండిని వేసి రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి.

2. అలాగే పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, నూనె, సొరకాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి.

3. సరిపడినంత నీటిని వేసుకుని చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దానిపై మూత పెట్టాలి.

4. పావుగంట తర్వాత కొంత ముద్దను తీసి గుండ్రంగా చుట్టి చపాతీల్లా ఒత్తుకోవాలి.

5. స్టవ్ మీద పెనం పెట్టి కాస్త నూనె రాయాలి.

6. ఈ చపాతీలు వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే సుతిమెత్తని సొరకాయ చపాతీలు రెడీ అయిపోతాయి.

7. వీటిని ఏ కర్రీతో తిన్నా టేస్టీగానే ఉంటాయి. పెరుగుతో తింటే మరీ మంచిది.

సొరకాయలను సూపర్ ఫుడ్ గా చెప్పుకుంటారు. మీకు తినడం వల్ల అన్ని లాభాలే. హై బీపీ ఉన్నవారు సొరకాయ తినడం వల్ల బీపీ పెరగకుండా కంట్రోల్ లో ఉంటుంది. బరువు కూడా త్వరగా తగ్గుతారు. శరీరంలోని వ్యర్ధాలను, విషాలను బయట పంపించడంలో సొరకాయ ముందుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తిని ఇవి రోగనిరోధక వ్యవస్థకు ఇస్తుంది. కాబట్టి తరచూ సొరకాయ చపాతీ తినేందుకు ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం