తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Hair Home Remedies : తెల్ల జుట్టు నల్లగా మారేందుకు.. సింపుల్ చిట్కాలు

Black Hair Home Remedies : తెల్ల జుట్టు నల్లగా మారేందుకు.. సింపుల్ చిట్కాలు

HT Telugu Desk HT Telugu

27 February 2023, 16:00 IST

    • White Hair To Black Hair : చాలామంది తెల్ల జుట్ట కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బయటకు వెళ్లేందుకు కూడా ఆలోచిస్తారు. ఇతర జుట్టు సమస్యలు కూడా ఉంటాయి. అలాంటి వారి కోసం కొన్ని సింపులు చిట్కాలు..
బ్లాక్ హెయిర్
బ్లాక్ హెయిర్ (unsplash)

బ్లాక్ హెయిర్

Black Hair Home Remedies : జుట్టు రాలిపోవడం, తెల్ల జుట్టు, చుండ్రు.., లాంటి సమస్యలు ఈ కాలంలో ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేకుండా సమస్యలు వస్తున్నాయి. వంశపారంపర్యంగా వస్తున్న కారణాలు, ఇతర కారణాలు కూడా ఉంటాయి. వాతావరణ పరిస్థితులు కూడా జుట్టు మీద ఉంటుంది. థైరాయిడ్, హార్మోన్ల లోపం, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వంటివి జుట్టు(Hair) సమస్యలకు కారణం అవుతాయి. అయితే కొన్ని చిట్కాలు, పాటిస్తే.. మీ జుట్టు దృఢంగా మారుతుంది.

కొబ్బరి నూనె(Coconut Oil)ను 150 ఎంఎల్ మోతాదులో తీసుకోండి. అందులో 10 ఎండు ఉసిరికాయ ముక్కలను వేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై వేడి చేయాలి. ముక్కలు మెత్తబడి పూర్తిగా నూనెలో కలిసిపోతాయి. అయితే మధ్య మధ్యలో కలపాలి. నూనె తయారు అవుతుంది. కాస్త చల్లారిన తర్వాత వడకట్టి ఓ గాజు సీసాలో నిల్వ చేయాలి. ఇలా వచ్చిన నూనెను తరచూ.. జుట్టుకు రాస్తూ ఉండాలి. తెల్ల జుట్టు(White Hair) సమస్య తగ్గుతుంది. అంతే కాదు.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

జుట్టు నల్లగా అయ్యేందుకు గోరింట, మందార కూడా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కోరింటాకు, 2 తాజా మందార పువ్వులు, 20 గ్రాముల వేపాకు, అర ముక్క కర్పూరం బిల్లలు, 250 ఎంఎల్ కొబ్బరి నూనెను తీసుకోవాలి. అన్నింటిని కలిపి మంట మీద మరిగించాలి. బాగా మరిగిన తర్వాత చల్లార్చి.. నూనె(Oil)ను గాజు సీసాలో పోసుకోవాలి. నెలకు నాలుగు సార్లు మీ జుట్టుకు అప్లై చేయండి. అయితే స్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. జుట్టు సమస్యలు పోతాయి. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

దీర్ఘకాలం పాటు ఒత్తిడి(Stress)ని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా జుట్టు తెల్ల బడుతుంది. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.