తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Grains Benefits: వేసవిలో చలువ చేసే ధాన్యాలు.. నానబెట్టి తింటే ప్రయోజనాలు బోలెడు

grains benefits: వేసవిలో చలువ చేసే ధాన్యాలు.. నానబెట్టి తింటే ప్రయోజనాలు బోలెడు

Parmita Uniyal HT Telugu

07 May 2023, 12:30 IST

google News
  • grains benefits:  వేసవిలో తప్పకుండా తీసుకోవాల్సిన కొన్ని ధాన్యాలున్నాయి. వాటివల్ల శరీరానికి చలువ చేస్తుంది. అవేంటో, వాటిని ఎలా వండుకోవాలో చూద్దాం. 

చిరుదాన్యాలతో వంటలు
చిరుదాన్యాలతో వంటలు (Instagram, Pinterest)

చిరుదాన్యాలతో వంటలు

వేసవి వేడి వల్ల శరీరం తొందరగా డీ హైడ్రేట్ అవ్వడం, నీరసంగా కూడా అనిపిస్తుంది. కాలాన్ని బట్టి మీ ఆకలి తీరు మారుతుంది. తినాలనిపించే కోరికలు మారతాయి. చలికాలంలో తినాలనిపించినవన్నీ ఇప్పుడు రుచిగా అనిపించవు. వేసవి అనారోగ్యం మీ ధరి చేరకుండా కొన్ని ధాన్యాలను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. చలువ చేసే లక్షణాలుండటం వల్ల కొన్ని రకాల ధాన్యాలు, చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. సలాడ్లు, పులావ్, దోసెలు.. ఇలా చాలా వంటకాల్లో వాటిని వాడొచ్చు. వాటిని నానబెట్టి వాడుకుంటే ప్రయోజనాలు ఇంకెక్కువుంటాయి. తొందరగా జీర్ణమవ్వడమే కాక, రుచి కూడా పెరుగుతుంది.

1. బార్లీ:

పోషకాలు ఎక్కువగా ఉన్న బార్లీ వేసవిలో మంచి ఆహారం. వేడి వల్ల శరీరం కోల్పోయిన అనేక పోషకాలు బార్లీలో దొరుకుతాయి. ఇది మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా తోడ్పడుతుంది. బార్లీని సూప్స్, బ్రెడ్ తయారీలో కూడా వాడొచ్చు.

నానబెట్టాల్సిన సమయం : కనీసం 4 గంటలు

వంటకాలు: పులావ్, సలాడ్లు, రోటీలు చేయడానికి వాడొచ్చు.

2. రాగి:

దీంట్లో పీచు శాతం, క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లకి ఇదొక మంచి ఆహారం. చిన్న పిల్లలకి రాగితో చేసిన జావ తినిపించడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. బరువు తగ్గడంలో, వేసవిలో చలువ చేసేలా చేస్తుందిది.

నానబెట్టాల్సిన సమయం : 8 గంటలు

వంటకాలు: దోశలు, జావ, రోటీలు చేయడంలో వాడొచ్చు.

3. సామలు:

సామలలో ప్రొటీన్, క్యాల్షియం, ఇనుము, మినరళ్లు, విటమిన్ బి.. ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లుటెన్ ఉండదు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ తో బాధ పడుతున్న వాళ్లకి, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి ఇది మేలు చేస్తుంది.

నానబెట్టాల్సిన సమయం : 8 గంటలు

వంటకాలు: దోశెలు, పులావ్, కిచిడీ చేయడంలో ఉపయోగించొచ్చు.

4.జొన్నలు:

మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ B1, ఇనుము, పీచు అధికంగా ఉంటాయి.

నానబెట్టాల్సిన సమయం : 10 గంటలు

వంటకాలు: కిచిడీ లేదా రొట్టెలు చేయడానికి వాడొచ్చు.

పులావ్ తయారీ:

పైన చెప్పిన ధాన్యాలన్నింటితో పులావ్ చేసుకోవడం చాలా సులువు. అన్నింటినీ ఒకే రకంగా వండుకోవచ్చు. పులావ్ చేసుకోడానికి సులభమైన పద్ధతేంటో చూద్దాం.

నూనె 1 టేబుల్ స్పూన్

జీలకర్ర 1 టేబుల్ స్పూన్

మిరియాలు 4

బిర్యానీ ఆకు 1

ఉల్లిపాయ 1

క్యారట్ 2

బఠానీ 100 గ్రాములు

ఏదైనా చిరుదాన్యం సగం కప్పు

నీళ్లు రెండింతలు

తయారీ విధానం:

ఒక ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసుకుని, చిరుధాన్యం, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఏదైనా ధాన్యం, నీళ్లు పోసుకోవాలి.. మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. పులావ్ సిద్ధం.

తదుపరి వ్యాసం