తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods: మీకుండే ఈ 7 అలవాట్ల వల్ల పీరియడ్స్ సమయానికి రాకపోవచ్చు, జాగ్రత్త

Periods: మీకుండే ఈ 7 అలవాట్ల వల్ల పీరియడ్స్ సమయానికి రాకపోవచ్చు, జాగ్రత్త

Haritha Chappa HT Telugu

23 December 2024, 9:30 IST

google News
  • Periods:  ప్రతి నెలా పీరియడ్స్ ఆలస్యంగా రావడం లేదా సరైన సమయాని కంటే ముందుగానే రావడం అనేవి క్రమరహిత నెలసరి సమస్యను సూచిస్తుంది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అలాగే మీ జీవనశైలి కూడా కారణాలు కావచ్చు.

పీరియడ్స్
పీరియడ్స్ (shutterstock)

పీరియడ్స్

ప్రతి నెలా పీరియడ్స్ రావడం మహిళల్లో ఎంతో ఆరోగ్యకరమైన సూచిక. రజస్వల అయిన తరువాత ప్రతి అమ్మాయికి ప్రతి నెలా తప్పకుండా నెలసరి వస్తేనే ఆరోగ్యకరం. ఒక నెల వచ్చి, మరో నెల రాకపోతే వారికి ఏదో ఆరోగ్య సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. లేదా జీవనశైలి పద్ధతులు చక్కగా పాటించడం లేదని అర్థం చేసుకోవాలి. చిన్న వయసులో అమ్మాయిలు దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ క్రమరహిత పీరియడ్స్ వ్యాధులకు కారణం అవుతాయి. పీరియడ్స్ సమస్యలు వలల్ భవిష్యత్తుల గర్భధారణ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ముందుగానే సమస్యలను పరిష్కరించుకోవాలి. క్రమం తప్పకుండా పీరియడ్స్ రాకపోవడానికి ఈ 7 అలవాట్లు కారణం కావచ్చు.

నిద్ర

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒక సమయానికి నిద్ర లేవడం వంటివి అలవాటు చేసుకోవాలి. నిద్రవేళల్లో రోజూ మార్పులు చేసుకోవడం వల్ల మీ నిద్రా చక్రం చెడిపోతుంది. ఇవి మీకు నిద్ర సరిగా పట్టకుండా అవాంతరాలను కలిగిస్తుంది. కాబట్టి ఇది మెలటోనిన్, కార్టిసాల్ హార్మోన్లను దెబ్బతీస్తుంది. ఇది పునరుత్పత్తి హార్మోన్ల సమతుల్యతలో అవాంతరాలకు దారితీస్తుంది. అంటే నిద్ర కూడా పీరియడ్స్ పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

ఒత్తిడి

మీరు ప్రతి చిన్న విషయానికి ఒత్తిడి తీసుకుంటుంటే, అది మీ కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది హైపోథాలమస్‌ను ప్రభావితం చేస్తుంది. పీరియడ్స్ చక్రాన్ని నిర్వహించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఒత్తిడిని నియంత్రించడం చాలా ముఖ్యం.

కార్బోహైడ్రేట్స్

మీరు ఎక్కువ పిండితో చేసిన వంటకాలు, కార్న్ ఫ్లోర్, పాలిష్డ్ రైస్ తో వండిన అన్నం వంటివి అధికంగా తినడం వల్ల ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.

శారీరక శ్రమ

సన్నగా ఉన్నామని శారీరక శ్రమ అవసరం లేదని భావిస్తే ఈ విషయం తెలుసుకోండి. తక్కువ శారీరక శ్రమ వల్ల కూడా క్రమరహిత పీరియడ్స్ వస్తాయి. దీని వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండి రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తుంది.

హార్మోన్ల రుగ్మతలు

హార్మోన్ల రుగ్మతలు మీ ఆరోగ్యకరమైన దినచర్య, ఆహారంపై దాదాపు పూర్తిగా ఆధారపడి ఉంటాయి. పీసీఓడీ వంటి సమస్య ఉంటే అది రుతుచక్రానికి అంతరాయం కలిగిస్తుంది. ఎందుకంటే ఆండ్రోజెన్, ఇన్సులిన్ రెండింటి స్థాయి క్షీణిస్తుంది.

ఎక్కువ కూర్చుంటే

మీరు రోజు ఎక్కువ సేపు గంటల తరబడి కూర్చునే ఉద్యోగం చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ బరువును త్వరగా పెంచుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. ఇది రుతుచక్రంపై ప్రభావం చూపుతుంది.

విటమిన్ డి లోపం

మీ శరీరంలో విటమిన్ డి, ఐరన్ లోపం వంటివి ఉంటే అది హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే విటమిన్ డి హార్మోన్లు రుతుచక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీ శరీరంలో విటమిన్ డి లోపం, ఐరన్ లోపం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

తదుపరి వ్యాసం