HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  B Virus: కోతుల నుంచి సోకుతున్న B వైరస్ ఇన్ఫెక్షన్, కోతుల జోలికి పోకండి

B Virus: కోతుల నుంచి సోకుతున్న B వైరస్ ఇన్ఫెక్షన్, కోతుల జోలికి పోకండి

Haritha Chappa HT Telugu

18 April 2024, 9:00 IST

    • B Virus: కోతుల నుండి బి వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఒక వ్యక్తి ఐసీయూలో చేరాల్సి వచ్చింది. అప్పటినుంచి ఈ బి వైరస్ ఇన్ఫెక్షన్ పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. కోతుల ద్వారా ఈ వైరస్ ఎలా సోకుతుందో తెలుసుకోండి.
కోతులతో బి వైరస్ ఇన్ఫెక్షన్ (Pixabay)

కోతులతో బి వైరస్ ఇన్ఫెక్షన్

B Virus: హాంగ్ కాంగ్ దేశానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తిని ఓ కోతి కరిచింది. దీనివల్ల అతనికి బి వైరస్ ఇన్ఫెక్షన్ సోకింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అది బి వైరస్ ఇన్ఫెక్షన్ అని తెలిసాక ఆ ఇన్ఫెక్షన్ గురించి మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. ప్రపంచంలో ఇతనే బి వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన తొలి వ్యక్తి అనే అనుమానం వచ్చింది. కానీ యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం 1932 నుండి ఇప్పటివరకు యాభై B వైరస్ కేసులు నమోదైనట్టు తెలిసింది.

తొలి B వైరస్ కేసు ఇదే

తొలిసారిగా ఒక యువ వైద్యుడిని ఓ కోతి కరిచింది. అప్పుడు అతనికి ఈ వైరస్ సోకింది. కోతి కరిచిన ప్రదేశంలో గాయం నయమైంది, కానీ నాడీ సంబంధిత అనారోగ్యాలు, శ్వాసకోశ వైఫల్యం వంటివి జరిగాయి. దీంతో ఆ వైద్యుడు మరణించాడు. అప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ పై అధ్యయనాలు మొదలయ్యాయి. అప్పటినుంచి కోతులు కరవడం వల్ల కొందరిలో ఈ B వైరస్ ఇన్ఫెక్షన్ కనిపించింది. కానీ ఇది చాలా అరుదుగా... ప్రపంచం మొత్తం మీద కేవలం 50 మందికే సోకింది.

ఏమిటి B వైరస్ ఇన్ఫెక్షన్?

బి వైరస్ లేదా హెర్పస్ బి వైరస్ అని కూడా ఈ ఇన్ఫెక్షన్ ను పిలుస్తారు. అలాగే మకాసిన్ హెర్పేస్వైరస్ అని కూడా అంటారు. ఇది తొలిసారిగా మకాక్ అనే జాతి కోతులలో కనిపించింది. ఈ కోతులు కరిస్తే ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుంది. కరవడమే కాదు అవి గోళ్ళతో రక్కినా దాని శరీరంలోని ద్రవాలు మన చర్మంలోకి ఇంకి ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఇది మానవులలో మెదడు వాపుతో సహా నరాల సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

మానవులలో B వైరస్ ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకంగా మారుతాయి. మరికొన్నిసార్లు జ్వరం, తలనొప్పి వంటివి వచ్చి తగ్గిపోతాయి. అమెరికాలో మొత్తం 50 కేసులు నమోదైతే 21 మంది ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు.

మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సంక్రమించడం చాలా అరుదు. కాబట్టి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన మనుషుల సంఖ్య తక్కువగా ఉంది.

B వైరస్ లక్షణాలు

బి వైరస్ సోకితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒక నెలలోపే ఇన్ఫెక్షన్ వ్యాధిగా మారుతుంది. జ్వరం రావడం, తలనొప్పి, తిమ్మిరి, దురద, నరాల సమస్యలు, వికారం, వాంతులు, కడుపునొప్పి వంటివి కనిపిస్తాయి. మీకు కోతి కరిచినా లేక కోతి గోళ్ళతో గీకినా జాగ్రత్తగా ఉండండి. కోతులకు దూరంగా ఉంటేనే అన్ని విధాలా మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్