Goa Mistakes: గోవాకు ఫస్ట్ టైమ్ వెళుతున్నారా? ఈ పొరపాట్లు చేయకండి
02 December 2024, 10:30 IST
- Goa Mistakes: వెకేషన్‍కు వెళ్లేందుకు గోవా అద్భుతమైన ప్రాంతంగా ఉంటుంది. బీచ్‍లతో పాటు చాలా అట్రాక్షన్స్ అదిరిపోతాయి. అయితే, గోవాకు మొదటిసారి వెళ్లాలనుకునే వారు కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే ట్రిప్ మరింత సంతోషకరంగా సులువుగా అవుతుంది. అవేంటంటే..
Goa Mistakes: గోవాకు ఫస్ట్ టైమ్ వెళుతున్నారా? ఈ పొరపాట్లు చేయకండి (Photo: Unsplash)
గోవా అంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇక్కడికి వెకేషన్‍కు వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడతారు. అందమైన బీచ్‍లు, ఫుల్‍గా ఎంజాయ్ చేసేలా నైట్‍లైఫ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, రకరకాల ఫుడ్, వెరైటీ డ్రింక్స్.. ఇలా గోవాలో అట్రాక్షన్స్ చాలా ఉంటాయి. అందుకే అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుతం ఏడాది చివరి నెల డిసెంబర్ కావడంతో చాలా మంది గోవాకు పయనమయ్యేందుకు సిద్ధమవుతారు. అయితే, గోవాకు తొలిసారి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వారు కొన్ని పొరపాట్లు చేయకూడదు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండే ట్రిప్ మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. అవేవో ఇక్కడ చూడండి.
రీసెర్చ్ చేయకపోవడం
గోవాకు వెళ్లే ముందు సరిగా రీసెర్చ్ చేయకపోతే ట్రిప్ అంత ఎంజాయ్ చేయలేరు. గోవాలో చాలా బీచ్‍లు ఉంటాయి. అయితే, ఏ బీచ్ ఎక్కడ ఉందో.. ఏది బాగుంటుందో ముందే తెలుసుకోవాలి. ఇంటర్నెట్‍లో వెతకడం, ఇంతకు ముందు వెళ్లిన వారిని కనుక్కోవడం లాంటి రీసెర్చ్ చేయాలి. అలాగే గోవాలో బెస్ట్ ప్లేసెస్ ఏవో.. తప్పకుండా చూడాల్సినవి ఏవో ముందే కనుక్కోవాలి. వీలైనంత ఎక్కువ కవర్ అయ్యేలా జాగ్రత్త పడాలి. అందుకు అనుగుణంగా టూర్ ప్లాన్ చేసుకోవాలి. ఏమేం చూడాలో ముందే డిసైడ్ అయితే ఏదైనా మిస్ అయ్యామనే అసంతృప్తి ఉండదు. గోవాకు వెళ్లేందుకు బెస్ట్ టైమ్ ఏదో కూడా చూడాలి. సాధారణంగా గోవాకు వెళ్లేందుకు అక్టోబర్ నుంచి మార్చి మధ్య మంచి టైమ్.
ట్యాక్సీలపై ఆధారపడొద్దు.. రెంట్ టూవీలర్స్ బెస్ట్
గోవాకు వెళ్లినప్పుడు అక్కడ తిరిగేందుకు పూర్తిగా ట్యాక్సీలపై ఆధారపడకూడదు. గోవాలో ట్యాక్సీల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే, ట్యాక్సీల్లో వెళితే చుట్టుపక్కల ప్రాంతాలు సరిగా చూడలేరు. గోవాలో టూ వీలర్స్ అద్దెకు సులువుగా దొరుకుతాయి. రోజువారి రెంట్ ఇచ్చి బైక్స్, స్కూటర్స్ తీసుకోవచ్చు. గోవాలో తిరిగేందుకు ఇవి బెస్ట్. ఎక్కువ ప్రాంతాలకు వెళ్లేందుకు టూవీలర్స్ చాలా ఉపయోగపడతాయి. ట్యాక్సీలతో పోలిస్తే ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే వీలైనంత వరకు గోవాలో రెంటెడ్ బైక్‍లు, స్కూటర్లపై తిరగడం మేలు.
ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం
గోవాలో ట్రాఫిక్ రూల్స్, చెకింగ్స్ ఎక్కువగానే ఉంటాయి. చలానాలు కూడా ఎక్కువ ధరతో ఉంటాయి. అందుకే గోవాకు సొంత వాహనాల్లో వెళ్లినా.. రెంట్ టూవీలర్స్‌లో తిరిగినా ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి. బైక్‍లు, స్కూటర్లపై వెళితే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. లైసెన్స్ ఉండాలి. అలాగే, సొంత వాహనాల్లో వెళ్లినా కారులో అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండి. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు మరిచిపోకుండా తీసుకెళ్లండి.
ఫుడ్ వెరైటీస్ ట్రై చేయకపోవడం
చాలా మంది వేరే ప్రాంతాలకు వెకేషన్‍కు వెళ్లినా.. తాము ఎప్పుడూ తినే లాంటి ఫుడ్ దొరికే హోటళ్లలో తినేందుకు ఇష్టపడతారు. అయితే, గోవాకు వెళితే అక్కడి వెరైటీలు తినేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే గోవాలో రకరకాల ఫుడ్స్ దొరుకుతాయి. ఎన్నో వెరైటీలు ఉంటాయి. అందుకే అక్కడి స్పెషల్ ఆహారాలు ట్రై చేయడం కూడా మంచిది. కాస్త డిఫరెంట్‍గా.. కొత్త అనుభూతి ఉంటుంది.
బీచ్‍లు ఒక్కటే కాదు
గోవా అంటే బీచ్‍లు మాత్రమే కాదు. చుట్టు పక్కల చూడాల్సిన చాలా ప్రాంతాలు ఉంటాయి. చారిత్రక కట్టడాలు ఉన్నాయి. గోవా పరిసరాల్లో వాటల్ ఫాల్స్ ఉంటాయి. ట్రెక్కింగ్ చేసే ప్లేస్‍లు ఉంటాయి. షాపింగ్ కోసం తిరిగేందుకు మార్కెట్స్ ఉంటాయి. అందుకే గోవాలో బీచ్‍లకే పరిమితం కాకుండా వివిధ ప్లేస్‍లకు వెళ్లాలి.
థ్రిల్‍ను ఇచ్చేవి మిస్ కావొద్దు
గోవా బీచ్‍ల్లో వాటర్ యాక్టివిటీస్ లాంటివి చాలా థ్రిల్ ఇస్తాయి. స్కూబా డైవింగ్, జెట్ స్కీయింగ్, పారాసైలింగ్, విండ్ సర్ఫింగ్ లాంటి అడ్వెంచర్ యాక్టివిటీలు మంచి కిక్ కలికిస్తాయి. అందుకే అక్కడికి వెళ్లినప్పుడు ఇలాంటివి చేసేందుకు ట్రై చేయండి. ట్రిప్ మరింత ఆహ్లాదకరంగా, స్పెషల్‍గా ఉంటుంది.