Avoid tomatoes and cucumber : టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? జాగ్రత్త! కారణం ఇదే!
18 August 2023, 11:10 IST
- Avoid tomatoes and cucumber : మీరు సలాడ్ ఎక్కువగా తింటారా? వీటిల్లో టమాటాలు, కీర దోసకాయలు కలిపి ఉంటాయా? అయితే జాగ్రత్త!
టమాటా- కీర దోసకాయ కలిపి తింటున్నారా? జాగ్రత్త!
Avoid tomatoes and cucumber : బరువు తగ్గడం కోసం మనం చాలా చేస్తుంటాము. ముఖ్యంగా డైట్‌పై మన ఫోకస్ పడుతుంది. అప్పుడే 'సలాడ్'లు గుర్తొస్తాయి. ఇక టైమ్ బట్టి వాటిని ఆరగించేస్తూ ఉంటాము. అయితే.. ఇక్కడే కొన్ని తప్పులు చేయకండి అని డైటీషియన్స్ చెబుతున్నారు. టమాటా- కీర దోసకాయలను కలిపి తినండం.. వీటిల్లో ఒకటి! దీనికి అసలు కారణాలు ఇక్కడ తెలుసుకుందాము..
టమాటా- కీర కలిపి తింటే కలిగే నష్టాలు..
సలాడ్‌లో టమాటాలు, కీర దోసకాయలు కచ్చితంగా ఉంటాయి! కానీ కీర దోసకాయలను, టమాటాతో కలిపి తినేడప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. కీర దోసకాయల్లో చాలా మినరల్స్ ఉంటాయి. వాటి వల్ల మనం హైడ్రేటెడ్‌గా ఉంటాము. అయితే.. టమాటాల్లో ఉండే విటమిన్ సీ ని మన శరీరం అబ్సార్బ్ చేసుకునే ప్రక్రియకు కీర దోసకాయల్లోని ఎంజైమ్ ఆటంకం కలిగిస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు. అందుకే.. ఎంత వీలైత ఎంత.. వాటిని కలపకూడదని అంటున్నారు.
Digestion problems with tomatoes and cucumber : అంతేకాదు.. కీర దోసకాయను టమాటాలతో కలిపితే జీర్ణక్రియ మందగించే ప్రమాదం కూడా ఉంటుంది. వీటి వల్ల శరీరంలో డైజేషన్ మరింత కష్టమవుతుంది. ఈ రెండింటికీ జీర్ణక్రియ ప్రక్రియ వేరువేరుగా ఉంటుంది. అందుకే వీటిని కలిపితే కడుపు నొప్పి వస్తుంది. కడుపు ఉబ్బడం వంటివి కూడా జరుగుతాయి.
ఇదీ చూడండి:- Cucumber Side Effects । దోసకాయ తినడం మంచిదే కానీ.. అందరికీ కాదు!
డైజేషన్లో భాగంగా కొన్ని ఆహారాలు త్వరగా అరిగిపోతాయి. ఇంకొన్నింటికి ఆలస్యం అవుతుంది. ఇలా ఆలస్యమయ్యే ఆహారాలు కొన్ని రోజుల పాటు ప్రేగుకు అతుక్కుపోతాయి. ఫలితంగా డైజేషన్ సమస్యలు వస్తాయి. కీర దోసకాయ- టమాటాలు కలిపితే ఇదే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా త్వరగా అరిగే, త్వరగా అరగని వాటిని కలిపి తింటే.. గ్యాస్ సమస్యలు కూడా రావొచ్చు!
Can we eat tomatoes and cucumber together : అయితే కీర దోసకాయను ఇతర కూరగాయలతో కలిపి తినొచ్చని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు.
అలా అని టమాటాలను, కీర దోసకాయలను పూర్తిగా తినడం మానేయడం కూడా మంచిది కాదు. సలాడ్‌లో ఒకసారి టమాటాలు వేసుకుంటే, ఇంకోసారి కీర దోసకాయలను వాడండి. ఈ రెండు కూడా వేరువేరుగా తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచి చేస్తాయి. కలిపి తీసుకుంటేనే కాస్త సమస్య!