తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga For Lazy Mornings । సోమరితనంగా ఉంటే ఈ యోగాసనాలు ఆచరించండి, చురుకుగా మారతారు!

Yoga for Lazy Mornings । సోమరితనంగా ఉంటే ఈ యోగాసనాలు ఆచరించండి, చురుకుగా మారతారు!

HT Telugu Desk HT Telugu

22 June 2023, 9:10 IST

google News
    • Yoga for Lazy Mornings: ఉదయం పూట సోమరిగా అనిపిస్తే ఆ బద్ధకాన్ని పోగొట్టి మిమ్మల్ని చురుకుగా మార్చేందుకు కొన్ని యోగాసనాలు ఉన్నాయి, అవి ఇక్కడ తెలుసుకోండి.
Yoga for Lazy Mornings- ananda balasana
Yoga for Lazy Mornings- ananda balasana (istock)

Yoga for Lazy Mornings- ananda balasana

Yoga for Lazy Mornings: మాన్‌సూన్ సీజన్‌లో ఉదయం లేవాలన్నా, బయటకు వెళ్లి పనులు చేసుకోవాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది. మరోవైపు వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఎక్కువే. అయితే మారుతున్న సీజన్‌లో యోగా మీకు రక్షణ కవచంలా ఉంటుంది.

ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు యోగాభ్యాసంతో మీ దినచర్యను ప్రారంభించేందుకు ప్రయత్నించండి. ఇది మీకు లోపలి నుంచి వెచ్చదనం కలిగిస్తుంది, మీరు చురుకుగా ఉండగలుగుతారు. అంతేకాకుండా, మీ రోగనిరోధక శక్తి కూడా బలోపేతం అవుతుంది.

వర్షాకాలం సీజన్‌లో ఉదయం వేళ మీరు తప్పనిసరిగా ఆచరించవలసిన కొన్ని యోగాసనాలు ఉన్నాయి. ఈ యోగాసనాలు క్రమం తప్పకుండా కొంతకాలం ఆచరించడం ద్వారా మీలోని సోమరితనం కూడా మటుమాయమవుతుంది. ఏయే ఆసనాలు వేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆనంద బాలాసనం

ఆనంద బాలాసనం (Happy Baby Pose) ఛాతీ, భుజాలు, తొడలు, గజ్జలను సాగదీస్తుంది. తద్వారా ఆయా భాగాలలోని కండరాలు సక్రియం అవుతాయి. తుంటిని, వెన్ను భాగంలోని ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఫలితంగా వశ్యత, చలనశీలత పెరుగుతుంది. ఈ ఆసనం ఉదయం వేళ ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది.హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. మైకము లేదా అలసటను తొలగించి చురుకుగా అయ్యేలా చేస్తుంది. రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

త్రికోణాసనం

త్రికోణాసనం (Triangle Pose) అనేది నిలబడి ఆచరించే ఒక యోగాసనం. పాదాల మధ్య 3-4 అడుగుల దూరం ఉంచి ప్రారంభించాలి. ఒకసారి ఎడమవైపు, మరోసారి కుడివైపు రెండు వైపులా కొద్ది సమయం పాటు సమానంగా చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం కండరాలను బలోపేతం చేస్తుంది. శరీర సమతుల్యత, స్థిరత్వంలో సహాయపడుతుంది. వెన్నెముకను సాగదీస్తుంది, ఈ భంగిమ వెన్నులో అచలత్వాన్ని తగ్గించడం ద్వారా వశ్యతను పెంచుతుంది. మీ శరీరంలోని వివిధ అవయవాలను ఉత్తేజపరుస్తుంది. మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.

వీర భద్రాసనం

వీర భద్రాసనం (Warrior Pose) చేతులు, భుజాలు, కాళ్ళను బలోపేతం చేస్తుంది. రెండు భుజాల మధ్య సమతుల్యత, స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. శరీర సమతుల్యతను కాపాడుతుంది. కండరాల ఓర్పును పెంచుతుంది. డెస్క్ జాబ్‌లు చేసే వారికి వీర భద్రాసనం చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీలో స్టామినా పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. వీర భద్రాసనం మొత్తం శరీరానికి శక్తినిస్తుంది, రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం