తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Problems In Men: మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఆ ప్రాణాంతక వ్యాధులు ఎక్కువని చెబుతున్న అంతర్జాతీయ అధ్యయనం

Health Problems in Men: మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఆ ప్రాణాంతక వ్యాధులు ఎక్కువని చెబుతున్న అంతర్జాతీయ అధ్యయనం

Haritha Chappa HT Telugu

25 May 2024, 7:00 IST

google News
    • Health Problems in Men: కొన్ని వ్యాధులు స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా వస్తున్నట్టు ఒక అంతర్జాతీయ అధ్యయనం వివరిస్తోంది. ఆ వ్యాధులు గుండె జబ్బులు, కరోనా, క్యాన్సర్ వంటివి.
మగవారికొచ్చే అనారోగ్యాలు
మగవారికొచ్చే అనారోగ్యాలు (Pixabay)

మగవారికొచ్చే అనారోగ్యాలు

Health Problems in Men: ప్రపంచంలో ఎన్నో ప్రాణాంతక రోగాలు ఉన్నాయి. అందులో క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి అధికం. అయితే ఇలాంటి వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషుల అధికంగా ఉన్నట్టు లాన్సెట్ నివేదిక చేసిన తాజా అధ్యయనంలో తేలింది. అలాగే కోవిడ్ బారినపడి మరణించిన వారిలో కూడా పురుషులు అధికంగా ఉన్నారని చెబుతోంది ఈ నివేదిక. అయితే స్త్రీలు, పురుషులు కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నా కూడా... వారు అనారోగ్యం, వైకల్యం బారిన పడుతున్నట్టు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

2021లో కోవిడ్ వల్ల ఆడవారికంటే మగవారే ఎక్కువగా ఇబ్బంది పడ్డారని, దాదాపు 45% మంది పురుషులు ఆరోగ్యాన్ని నష్టపోయారని లాన్సెట్ వివరిస్తోంది. ఇస్కీమిక్ గుండె జబ్బులు కూడా మగవారికి అధికంగా వచ్చినట్టు వివరించింది.

స్త్రీలకు వచ్చే రోగాలు ఇవే

ఇక స్త్రీల విషయానికి వస్తే మహిళల్లో ప్రధానంగా తలనొప్పి, డిప్రెషన్, పొట్ట నొప్పి, ఆందోళన, చిత్తవైకల్యం, అల్జీమర్స్, హెచ్ఐవి వంటివి ఉన్నాయి. ఇవి అకాల మరణానికి దారి తీసేవి కావు. కానీ జీవితాంతం ఇబ్బంది పెడతాయి. అనారోగ్యంతో కుదేలయ్యేలా చేస్తాయి. డిప్రెసెవ్ డిజార్డర్స్ వల్ల పురుషుల కంటే స్త్రీలే ఆరోగ్యపరంగా అధికంగా నష్టపోతున్నట్టు ఈ నివేదిక చెబుతోంది.

అలాగే పురుషులను వేధిస్తున్న ఇతర సమస్యలు ఉన్నాయి. వారిలోనూ ఐరన్ లోపం అధికంగానే ఉంటుంది. దీనివల్ల అలసటగా అనిపించడం, చర్మం పాలిపోవడం, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మధుమాహం వంటివి కూడా వీరిపై అధికంగానే దాడి చేస్తున్నాయి. అధిక ఆల్కహాల్ వినియోగం వల్ల వీరు కాలేయ సమస్యల బారిన పడుతున్నారు. అధిక ఆల్కహాల్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా వీరికే ఎక్కువగా ఉంది. ప్రొస్టేట్ క్యాన్సర్ కేవలం పురుషులకు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది కూడా వారిలో ప్రాణాంతక పరిస్థితులకు తీసుకొస్తుంది. నియంత్రణ లేకుండా పెరగడం ప్రారంభించినప్పుడు అక్కడ క్యాన్సర్ కణితులు ఏర్పడతాయి. ఇవి చాలా ఇబ్బంది పెట్టే సమస్యనే చెప్పాలి. అలాగే మద్యపాన అలవాటు ఉన్నవారిలో కూడా లివర్ సిరోసిస్ వ్యాధి వస్తుంది. లివర్ సిరోసిస్ వ్యాధి వస్తే శరీరంపై మచ్చలు, పుండ్లు వస్తాయి. తీవ్రంగా అలసిపోతారు. ఆకలి వేయదు. బరువు కూడా త్వరగా తగ్గిపోతారు.

కాబట్టి పురుషులు కూడా తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. నిద్రా నాణ్యతను మెరుగుపరుచుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. నీరు అధికంగా తాగుతూ ఉండాలి. ధూమపానం, ఆల్కహాల్ వంటివి మానేయాలి. సాత్విక ఆహారాన్ని తినాలి.

టాపిక్

తదుపరి వ్యాసం