Amazon Great Indian Festival 2022 : బ్రాండ్, ఫ్యాషన్ దుస్తులపై భారీ తగ్గింపులు
20 September 2022, 7:58 IST
- Amazon Great Indian Festival 2022 Offers : ఈ పండుగ సీజన్లో ఆకర్షణీయమైన ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ వచ్చేసింది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లలో దుస్తులు, గడియారాలు, ఇతర అగ్ర ఫ్యాషన్ వర్గాలపై భారీ తగ్గింపులు ఇస్తుంంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022
Amazon Great Indian Festival 2022 Offers : పండుగ అంటే ముందు హడావిడి అంతా షాపింగ్దే. దీనిలో భాగంగా పలు ఈ కామర్స్ తమ ఆఫర్లను ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటూ ప్రతి సంవత్సరం లాగానే.. ఈ సంవత్సరం కూడా ఆకట్టుకునే, అదిరిపోయే ఆఫర్లతో మన ముందుకు వచ్చేసింది. అమెజాన్ తన వార్షిక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను సెప్టెంబర్ 23 నుంచి రీబూట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను పొందుతారు.
50 నుంచి 80 శాతం వరకు ఉన్న అగ్ర ఫ్యాషన్ వర్గాలు ఇవే..
* మహిళల టాప్‌లు, టీ-షర్టులు
* మహిళల కుర్తీలు
* పురుషుల టీ-షర్టులు, పోలోస్
* పురుషుల పాదరక్షలు
* దుస్తులు
* ఫ్యాషన్ ఆభరణాలు
* గడియారాలు
* హ్యాండ్ బ్యాగులు
* క్రీడా బూట్లు, దుస్తులు
* పిల్లల దుస్తులు
* గృహ ఉపకరణాలు
* సన్ గ్లాసెస్, ఫ్రేమ్‌లు.
Max, Lavie, The Body Shop, Van Heusen, Fastrack వంటి మరిన్ని ఎంపిక చేసిన ప్రముఖ బ్రాండ్‌లపై Amazon కొన్ని అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తుంది.
బ్యాంకులతో భాగస్వామ్యం..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 కోసం.. e-tailer స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI బ్యాంక్)తో భాగస్వామ్యం కలిగి ఉంది. అంటే SBI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు నెలవారీ సేల్‌లో 10 శాతం తక్షణ తగ్గింపును పొందుతారు. సాధారణంగా ఎంపిక చేసిన బ్యాంకులపై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,500కి పరిమితం అవుతుంది. గత సంవత్సరం.. Amazon అనేక బ్యాంకులతో వివిధ వారాల పాటు ఒప్పందం చేసుకుంది. తద్వారా అనేక బ్యాంక్ ఖాతాలనుంచి కొనుగోలు చేసేవారు దీపావళి విక్రయంలో ఉత్తమమైన వాటిని పొందవచ్చు.