తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amazon Great Indian Festival: తక్కువ ధరలో Iphone .. అమెజాన్‌లో బంఫర్ ఆఫర్!

Amazon Great Indian Festival: తక్కువ ధరలో iPhone .. అమెజాన్‌లో బంఫర్ ఆఫర్!

HT Telugu Desk HT Telugu

17 September 2022, 20:39 IST

  • iPhone కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ iPhone 12ను రూ. 40 వేల కంటే తక్కువ పొందే ఛాన్స్ వచ్చింది.  ఐఫోన్ కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఈ డీల్ మంచి అవకాశం.    

Amazon Great Indian Festival
Amazon Great Indian Festival

Amazon Great Indian Festival

ఆపిల్ ఇటీవలే కొత్త ఐఫోన్స్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. కొత్త ఐఫోన్ విడుదల తర్వాత, ఆపిల్ తన పాత ఐఫోన్స్ ధరలను తగ్గించింది. ఇక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఐఫోన్‌పై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఐఫోన్ కల సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. ఇండియాలో ఐపీల్ అధికారిక సైట్‌లో iPhone 12ను రూ. 59,990 ప్రారంభ ధరకు విక్రయిస్తుంది. అయితే iPhone 12ను రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Snake Fruit: పాము చర్మంలాంటి పండును చూశారా? దీన్ని ఎప్పుడైనా మీరు తిన్నారా?

Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Green Dosa: కొత్తిమీర, పుదీనాతో గ్రీన్ దోశ చేశారంటే ఎంతో హెల్తీ, రెసిపీ ఇదిగో

World laughter day 2024: మూతి ముడుచుకుంటే వచ్చేదేం లేదు, ప్రతిరోజూ నవ్వండి నవ్వించండి, ఎక్కువకాలం జీవిస్తారు

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా అమెజాన్ తన మైక్రో-సైట్‌లో విడుదల చేసిన టీజర్‌లో ఐఫోన్ 12 మోడల్ ధర రూ. 40,000 లోపు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. టీజర్‌లో వేరియంట్ నిర్ధారించబడనప్పటికీ, ఇది 64GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ ధర అయి ఉండవచ్చని తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు ప్రకటించిన అన్ని ఐఫోన్‌ కంటే అతి తక్కువ ధర అవుతుంది.ప్రస్తుతం ఐఫోన్ 12లోని స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

Apple iPhone 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

1200nits గరిష్ట బ్రైట్నెస్ 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది HDR, డాల్బీ విజన్‌కు సపోర్ట్ ఇచ్చే సూపర్ రెటినా XDR డిస్‌ప్లే మరియు సిరామిక్ షీల్డ్ ప్రోటెక్షన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో A14 బయోనిక్ చిప్‌ని అమర్చారు. ఇది 64GB, 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే iOS 16 అప్‌డెట్‌ను ఇచ్చారు. రాబోయే సంవత్సరాల్లో సాఫ్ట్‌వేర్ నవీకరణను కూడా పొందాలి.

ఐఫోన్ 12 లో రెండు 12MP బ్యాక్ కెమెరాలను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మరియు ఫోటోగ్రఫీ కోసం ట్రూ టోన్ ఫ్లాష్‌తో ప్యాక్ చేశారు. ఇందులో సెల్ఫీల కోసం 12MP లెన్స్ కూడా ఉంది. iPhone 12 Face ID కూడా ఉంది. ఇది ఫేస్ రెకగ్నిషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది స్టీరియో స్పీకర్ సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. IP68 రేట్‌తో ఉంది. ఐఫోన్ 12 లైట్నింగ్ పోర్ట్‌ను ప్యాక్ చేస్తుంది. MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.