Amazon Great Indian Festival sale date : 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
Amazon Great Indian Festival sale : ఈ నెల 23న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభంకానుంది. ఆ వివరాలు..
Amazon Great Indian Festival sale date : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 డేట్‌ను ఎట్టకేలకు ప్రకటించింది ఆ సంస్థ. యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సేల్.. ఈ నెల 23న ప్రారంభంకానుంది. అయితే.. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎప్పుడు ముగుస్తుంది? అన్ని విషయాన్ని అమెజాన్ ఇంకా వెల్లడించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో.. ఈ ఫెస్టివల్ సేల్.. దీపావళి వరకు కొనసాగుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022కు సంబంధించి ఇప్పటికే అనేక అప్డేట్స్ బయటకొచ్చాయి. డీల్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ అంటూ.. చాలా హడావుడే నెలకొంది. ల్యాప్టాప్స్, స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్ గ్యాడ్జెట్స్, అమెజాన్ డివైజ్‌లపై ఈ ఆఫర్స్ అమల్లోకి రానున్నాయి.
Amazon Great Indian Festival sale : ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 కోసం ఎస్బీఐ, ఎస్బీఐ కార్డుతో జతకట్టింది ఈకామర్స్ దిగ్గజ సంస్థ. ఎస్బీఐ క్రెడిట్- డెబిట్ కార్డుల మీద ఇన్స్టెంట్గా 10శాతం డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. తొలిసారి అమెజాన్‌లో షాపింగ్ చేసేవారికి.. ఫ్లాట్ 10శాతం క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది! అదే సమయంలో.. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వారికి.. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ముందే మొదలుయ్యే అవకాశం ఉంది. దీనిపై ఆ సంస్థ ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రియల్మీ, ఐక్యూఓఓ, వన్‌ప్లస్, షియోమీ వంటి స్మార్ట్‌ఫోన్స్‌పై డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్. దీనితో పాటు రెడ్మీ 11 ప్రైమ్ 5జీతో సారు మొత్తం మీద 60కిపైగా కొత్త లాంచ్‌లు చేస్తున్నట్టు వెల్లడించింది.
Amazon Great Indian Festival sale news : మొబైల్ ఫోన్ యాక్ససరీస్, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు వంటి వాటిపై ప్రత్యేక డిస్కౌంట్లు ఉంటాయని తెలుస్తోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022కు పోటీగా.. Flipkart big billion days sale కూడా వస్తోంది. ఈ సేస్లో ఆఫర్స్, డిస్కౌంట్స్ గురించి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే అప్డేట్ ఇచ్చేసింది.
కాగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్ కూడా సెప్టెంబర్ 23నే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
వివిధ రకాల పరికరాలను కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్స్‌తో మంచి అవకాశం లభించినట్టు అవుతుంది! వీటిని ఉపయోగించుకుని యూజర్లు లబ్ధిపొందవచ్చు. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్‌కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటికోసం ఎదురుచూస్తూ ఉంటారు.
సంబంధిత కథనం
టాపిక్