Flipkart Big Billion Days sale : స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్స్.. ఓ లుక్ వేయండి
Flipkart Big Billion Days sale : స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. మీరు ఓ లుక్ వేయండి.
Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ స్మార్ట్‌ఫోన్స్‌పై అదిరిపోయే ఆఫర్స్‌ను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. వాటిపై మీరూ ఓ లుక్ వేయండి మరి..
ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1, రియల్మీ 9 ప్రో, ఒపపో రెనో 8 5జీపై ఈ ఆఫర్స్ ఉన్నాయి. ఈ జాబితాలోకి మరిన్ని స్మార్ట్‌ఫోన్స్ కూడా చేరే అవకాశం చేరతాయి.
Flipkart big billion days sale లో భాగంగా.. గూగుల్ పిక్సెల్ 6ఏపై రూ. 20వేల వరకు ఆఫర్ లభిస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 27,699కే లభించే అవకాశం ఉంది. ఇక నథింగ్ ఫోన్ 1 రూ. 28,999కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంకు ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లు కలుపుకునే ఈ ధర ఉండనుంది.
Flipkart big billion days sale కోసం యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరచకుంది ఫ్లిప్‌కార్ట్. ఫలితంగా సేల్ సమయంలో 10శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభించొచ్చు.
బిగ్ బిలియన్ డేస్ సేల ఎప్పుడు మొదలవుతుంది? అన్న విషయాన్ని ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఈ Flipkart big billion days sale.. సెప్టెంబర్ 23 తర్వాతే ఆరంభమవుతుందని సమాచారం.
flipkart offers on smartphones : ఇక రియల్మీ 9 ప్రో.. ఈ సేల్‌లో రూ. 14,999కే లభించనుంది. రియల్మీ 4జీ రూ. 12,999కి వచ్చే అవకాశం ఉంది. రియల్మీ 5జీపై ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు. రియల్మీ జీటీ 2 ప్రో.. డిస్కౌంట్లను కలుపుకుని రూ. 26,999కి వస్తుంది. ఒప్పో రెనో 8 5జీపై రూ. 22వేల వరకు ఎక్స్ఛైంజ్ డిస్కౌంట్ లభించనుంది.
ఇక Flipkart big billion days sale లో ఎలక్ట్రానిక్, యాక్ససరీస్‌పై 80శాతం వరకు ఆఫర్ల ఉండనున్నాయి! హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌ఫోన్స్, వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌తో పాటు మరిన్ని పరికరాలపై అదిరిపోయే ఆఫర్స్ వస్తాయి. టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపైనా డిస్కౌంట్లు ఉండనున్నాయి.
Flipkart big billion days sale కి పోటీగా.. Amazon great Indian festival sale 2022 సన్నద్ధమవుతోంది. ఈ రెండూ కూడా.. ఒకే రోజున మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక భారతీయలకు పండగే..!
వివిధ పరికరాల కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్స్ మంచి అవకాశం! వీటిని ఉపయోగించుకుని లబ్ధిపొందవచ్చు. అందుకే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్‌కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
సంబంధిత కథనం