Amazon Great Indian Festival Sale 2022 : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ వచ్చేస్తోంది..!-amazon great indian festival sale 2022 announced check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amazon Great Indian Festival Sale 2022 : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ వచ్చేస్తోంది..!

Amazon Great Indian Festival Sale 2022 : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ వచ్చేస్తోంది..!

Sharath Chitturi HT Telugu
Sep 06, 2022 10:43 AM IST

Amazon Great Indian Festival Sale 2022 : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ 2022 వచ్చేస్తోంది. ఆ వివరాలు..

అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ వచ్చేస్తోంది..
అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ వచ్చేస్తోంది..

Amazon Great Indian Festival Sale 2022 : పండుగ సీజన్​ వేళ భారతీయులకు అదిరిపోయే వార్త! అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్ 2022 వచ్చేస్తోంది. ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​కు పోటీగా.. అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ నిలుస్తుంది. ప్రతియేటా సెప్టెంబర్​/అక్టోబర్​ నెలల్లో సేల్స్​ ఇస్తుంటాయి ఈ కంపెనీలు.

అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్ 2022:

గతేడాది అక్టోబర్​ 3న ప్రారంభమైన అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​.. ఈసారి సెప్టెంబర్​ చివర్లోనే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. సెప్టెంబర్​ 23న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

'కమింగ్​ సూన్​' అంటూ అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ 2022 టీజర్​ విడుదలైంది. ఈ సేల్​ కోసం ఎస్​బీఐతో అమెజాన్​ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. అంటే.. ఎస్​బీఐ బ్యాంకు డెబిట్​, క్రెడిట్​ కార్డులు ఉన్న వారికి మరిన్ని ఆఫర్లు లభిస్తాయి. 10శాతం వరకు డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది.

Amazon Great Indian Festival Sale 2022 date : అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ 2022లో భాగంగా.. ప్రజలు స్మార్ట్​ఫోన్​, ల్యాప్​టాప్​, టీవీల నుంచి అన్ని వస్తువులను కొనుగోళ్లు చేసుకోవచ్చు. అమెజాన్​ ప్రకారం.. మొబైల్స్​, యాక్ససరీస్​పై 40శాతం డిస్కౌంట్​ లభించనుంది. హోం అప్లయెన్సెస్​పై 75శాతం వరకు డిస్కౌంట్​ ఉంటుంది. నిత్యావసరాలకు సంబంధించి 65శాతం ఆఫర్లు ఉండనున్నాయి.

ఎక్స్​ఛేంజ్​ డీల్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​ కార్డులపై నో కాస్ట్​ ఈఎంఐ వంటి ఆప్షన్లు కూడా ఇస్తుంది అమెజాన్​. ఇక ప్రైమ్​ మెంబర్​షిప్​ ఉన్నవారికి.. అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ 2022.. ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వస్తుంది.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​..

Flipkart big billion days : అమెజాన్​కు పోటీగా.. ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​ కూడా వచ్చేస్తోంది. ఈ రెండు సేల్స్​ ఒకే రోజు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే.. వివిధ ప్రాడక్ట్స్​పై ఇచ్చే ఆఫర్స్​కు సంబంధించి హింట్​ ఇచ్చేసింది ఫ్లిప్​కార్ట్​.

ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో ల్యాప్​టాప్స్​పై 40శాతం వరకు ఆఫర్లు పొందవచ్చు. రూ. 8,999తో ప్రారంభమయ్యే టీవీలపై 80శాతం డిస్కౌంట్​ పొందవచ్చు.

ఇక ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ సేల్​లో పోకో, యాపిల్​ ఐఫోన్​, వివో, రియల్​మీ, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ ప్రాడక్ట్స్​పై భారీగా డిస్కౌంట్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్