Drinking Water Tips : నీరు తాగేటప్పుడు ఈ 5 తప్పులు దయచేసి చేయకండి
11 April 2023, 9:41 IST
- Drinking Water Tips : నీరు తాగేటప్పుడు మనం చేసే కొన్ని సాధారణ తప్పులను నివారించడం చాలా ముఖ్యం. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ, మనం తెలిసి తెలియక దీనిని విస్మరిస్తాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
నీరు తాగేందుకు చిట్కాలు
ప్రతి మనిషికి మంచి ఆరోగ్యాన్ని అందించడంలో నీరు(Water) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా పోషకాలను సులభంగా గ్రహించడంలో, ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. నీరు శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి, శరీరం నుండి విషాన్ని బయటకు పంపడానికి కూడా ఉపయోగపడుతుంది. నీరు మీ శరీరానికి మంచి మార్గంలో సహాయపడటానికి, నీరు తాగేటప్పుడు(Drinking Water) కొన్ని సాధారణ తప్పులను నివారించడం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం.. నీరు తాగేప్పుడు కొన్ని చేయవలసిన, చేయకూడని వాటిని సూచిస్తుంది.
వేగంగా నీరు తాగవద్దు
నీటిని చాలా వేగంగా తాగడం వల్ల శరీరానికి(Body) చిన్న చిన్న షాక్‌లు వస్తాయి. ఫలితంగా పొట్టలోని నరాలు దెబ్బతింటాయి కాబట్టి అజీర్ణం పెరిగే అవకాశం ఉంది. నీటిని మెల్లగానే తాగాలి.
భోజనం తర్వాత నీరు తాగాలి
ఆయుర్వేదం ప్రకారం, భోజనానికి ముందు నీరు తాగడం జీర్ణశక్తిని తగ్గిస్తుంది. భోజనం(Food) తర్వాత నీరు తాగటం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీరు తినడానికి ముందు నీరు తాగడానికి దూరంగా ఉండాలి. లేదంటే ఊబకాయం పెరుగుతుంది. నీరు, భోజనం మధ్య కనీసం 45 నిమిషాల గ్యాప్ ఇవ్వడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నీరు తాగడం మానుకోండి
ప్లాస్టిక్ బాటిళ్లలో(Plastic Bottle) ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించండి. స్టిల్ లేదా రాగి సీసాలు ఉత్తమం.
దాహం వేసినప్పుడే నీళ్లు తాగాలి
రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. కొందరు ఎనిమిది నుండి పది గ్లాసులను కూడా సిఫార్సు చేస్తారు. ఇవి సాధారణ అపోహలు. దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం మంచిది.
చల్లని నీరు తాగడం మానుకోండి
మనలో చాలా మంది పనిలో పడి.. ఫ్రిజ్ నుండి చల్లని నీటి సీసాలు తాగుతాం. కానీ దాని వల్ల కలిగే నష్టం గురించి చాలా తక్కువగా తెలుసు. ఆయుర్వేదం ప్రకారం, చల్లని నీరు(Cool Water) ఆహారం యొక్క జీర్ణక్రియ ప్రక్రియలో చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. రక్త నాళాలను సంకోచిస్తుంది.
కుదిరితే ఇలా చేయండి..
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు(Glass Water) తాగడం అలవాటు చేసుకోండి. నీరు మన శరీరానికి(Body) చాలా ముఖ్యమైనది. శరీరంలో దీని లోపం వల్ల అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం నీళ్లు తాగాలని వైద్యుల సూచిస్తున్నారు.
ఉదయం లేచిన వెంటనే నీరు తాగితే.. ఇది రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. నీరు తక్కువగా తీసుకుంటే.. తలనొప్పి, మలబద్ధకం, చర్మం(Skin) పొడిబారడం, కీళ్ల నొప్పులు, అజీర్ణం, తక్కువ రక్తపోటు, ఊబకాయం, బ్రెస్ట్ క్యాన్సర్(Breast Cancer) వంటి వ్యాధులు వస్తాయి.
ఖాళీ కడుపుతో 2 కప్పుల నీళ్లు తాగడం వల్ల చర్మం మెరుస్తూ, అకాల ముడతలు రాకుండా చేస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం(Drinking Water) వల్ల మన ముఖ్యమైన అవయవాలను రక్షిస్తుంది. హైడ్రేట్ చేస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో 2-3 గ్లాసుల నీరు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. నీరు తాగితే.. శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు.