Drinking Water : ప్రతిరోజూ ఎప్పుడు, ఎంత నీరు తాగాలి? నిలబడి నీళ్లు తాగుతున్నారా?-drinking water when and how much water should we drink each day details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Drinking Water When And How Much Water Should We Drink Each Day Details Inside

Drinking Water : ప్రతిరోజూ ఎప్పుడు, ఎంత నీరు తాగాలి? నిలబడి నీళ్లు తాగుతున్నారా?

HT Telugu Desk HT Telugu
Mar 27, 2023 01:30 PM IST

Drinking Water : నీరు అనేది మన శరీరానికి ఒక ముఖ్యమైన అవసరం. శరీరంలో అత్యధికంగా ఉండేది నీరే. నీరు తాగడం వలన టాక్సిన్స్‌ను బయటకు పంపడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, మూత్రపిండాలు, మెదడు పనితీరును మెరుగుపరచడం జరుగుతుంది. దీని ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చు.

ఎక్కువగా నీరు తాగాలి
ఎక్కువగా నీరు తాగాలి

కొంతమంది నీటిని తాగడమే మరిచిపోతారు. నీటిని ఎక్కువ తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. లేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. తగినంత నీరు తీసుకోవడం చర్మ ఆరోగ్యాన్ని(Skin Health) మెరుగుపరుస్తుంది. ఎంత నీరు తాగాలి, తాగేటప్పుడు కూర్చోవాలా లేదా నిలబడాలా? నీరు తాగడానికి సరైన సమయం ఏదీ అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో చర్చకు ఉన్నాయి. ఇది వేసవి కాలం(Summer Season) హైడ్రేటెడ్‌గా ఉండటం మరింత ముఖ్యం.

భోజనం తర్వాత నీరు ఎప్పుడు తీసుకోవాలి?

భోజనం తర్వాత నీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్లాలు బలహీనపడతాయని, ఆహార జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందని సాధారణంగా నమ్ముతారు. అయితే, ఈ నమ్మకం నిరాధారమైనది. వాస్తవానికి, తాగునీరు(Drinking Water) ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో, జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, భోజనం(Food) తర్వాత కొన్ని సిప్స్ నీటిని తీసుకోవడం కచ్చితంగా ఆమోదయోగ్యమైనదని చెబుతున్నారు నిపుణులు.

అయితే భోజనం తర్వాత నీటిని ఎక్కువగా ఉపయోగించకుండా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని అలా తాగాలి అంతే. ఎక్కువ తాగితే.. ఇది ఉబ్బరం, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల బోజనం అయ్యాక తక్కువగా నీరు తాగటం మంచిది.

నిలబడి నీళ్లు తాగుతున్నారా?

పోషకాహార నిపుణుల ప్రకారం.., నిలబడి నీరు తాగడం హానికరం అని సూచించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది మోకాళ్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. నిలబడి ఉన్నప్పుడు వాయునాళంలోకి నీరు చేరకుండా నిదానంగా, జాగ్రత్తగా నీటిని తాగడం మంచిది. నిటారుగా ఉన్న సమయంలో నీరు తాగేటప్పుడు(Drinking Water) జాగ్రత్త వహించాలి.

రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం?

ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ 2-3 లీటర్లు లేదా 8-10 గ్లాసుల నీరు సరిపోతుంది. అయితే ఇది వాతావరణ పరిస్థితులు(Weather Situation), శారీరక శ్రమ స్థాయిలను బట్టి మారవచ్చు. నీరు ఒక ముఖ్యమైన అవసరం. దానిని సకాలంలో తీసుకోవడం చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. అయితే క్రమం తప్పకుండా తాగకపోవడం డీహైడ్రేషన్‌(dehydration)కు దారితీయవచ్చు. అందుకే సమయాన్ని చూసుకుని.. నీటిని తాగుతూ ఉండాలి.

ఉదయంపూట లేవగానే.. నీరు తాగడం ఇంకా మంచిది. అలా నీరు తాగడం వల్ల కడుపులో ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి రక్తప్రసరణ మెరుగుపడడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని(Skin Health) మెరుగుపరుస్తుంది. ఇది మీ చర్మాన్ని మరింత ప్రకాశవంతంగా, కాంతివంతంగా మార్చగలదు.

డీహైడ్రేషన్(dehydration).. అలసట, బద్ధకానికి దారితీస్తుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో, మీ శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రోజంతా ఏదైనా పని మీద దృష్టి కేంద్రీకరించడంలో మీకు సహాయపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం