Sleeping Problems : ఈ 10 పనులు చేస్తే నిద్రలేమి సమస్యలు వస్తాయ్.. జాగ్రత్త
11 May 2023, 20:00 IST
- Sleeping Problems : కళ్లు మూసుకున్న వెంటనే నిద్రించే వారు ధన్యులు. ఎందుకంటే నిద్ర రాకుండా చాలామంది బెడ్ మీద అటు ఇటు దొర్లుతారు. ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు తలలో తిరుగుతుంటాయి. కొన్ని రకాల ఆహారాలు కూడా మీకు నిద్రరాకుండా చేస్తాయి.
నిద్ర సమస్యలు
మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8 గంటల నిద్ర(8 Hours Sleep) అవసరం. అనారోగ్యం, మానసిక ఒత్తిడి ఉంటే నిద్ర సరిగా రాదు. నిద్ర పట్టనప్పుడు నిద్రమాత్రలు వేసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. శారీరక వ్యాయామం చేయండి. నిద్రను ప్రేరేపించడానికి సువాసనగల నూనెతో మీ పాదాలకు మసాజ్ చేయండి. ఇలా కొన్ని చిట్కాలు పాటించాలి. కొన్నింటికి దూరంగా కూడా ఉండాలి.
కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి. చాక్లెట్, కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్(Energy Drinks) వంటి కెఫిన్ ఉన్న ఉత్పత్తులను ఎక్కువగా తాగితే రాత్రి నిద్ర సరిగా పట్టదు. కొంతమందికి పడుకునే ముందు కాఫీ లేదా టీ తాగడం అలవాటు ఉంటుంది. అది కూడా మంచిది కాదు.
ఆల్కహాల్(Alcohol) శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది నిద్రలేమికి కారణమయ్యే శరీరంలో సెరోటోనిన్ (సెరోటోనిన్) మొత్తాన్ని తగ్గిస్తుంది.
అధిక ప్రోటీన్ ఉన్న పదార్థాలు నిద్ర(Sleep)కు ముందు తీసుకోవడం కూడా మంచిది కాదు. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని కూడా తగ్గిస్తుంది, రాత్రంతా మేల్కొని ఉంచేలా చేస్తుంది.
బీన్స్, బఠానీలు, చిక్పీస్, బ్రోకలీ వంటి గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు నిద్రలేమి ఉన్నవారు తినకూడదు. చాలా స్పైసీ ఫుడ్స్(Spicy Foods) కూడా మంచివి కావు.
అధిక తీపి పదార్థాలు తినొద్దు. రాత్రిపూట చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
పడుకునే ముందు పాల ఉత్పత్తులను(Milk Products) తినకూడదు, తిన్నప్పటికీ, మితంగా తినాలి. లేదంటే జీర్ణక్రియ కష్టమై నిద్ర సరిగా రాదు.
చాలా మందికి రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్(Fast Food) తినే అలవాటు ఉంటుంది. కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని తిని పడుకుంటే త్వరగా నిద్రపట్టదు. దీన్ని రోజూ తినే అలవాటుగా చేసుకుంటే నిద్రలేమి సమస్య వస్తుంది.
మన శరీరంలో నికోటిన్ పేరుకుపోవడంతో, నిద్రలేమి సమస్యగా మారుతుంది. కొంతమంది పడుకునే ముందు సిగరేట్ తాగుతారు. ఇది చాలా డేంజర్
ఈరోజుల్లో రెడీమేడ్ ఫుడ్స్ ఎక్కువగా వాడుతున్నాం. ప్లాస్టిక్‌లోని ఆహారాలు ఆరోగ్యకరమైనవి కావు. ప్యాక్ చేసిన ఆహారాలు పడుకునే ముందు తింటే నిద్రరాదు.
నీళ్లు ఎక్కువగా తాగే(Drinking Water) అలవాటు కూడా మంచిది కాదు. శరీరంలో నీరు ఎక్కువగా ఉంటే తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. దీని వల్ల నిద్రకు కూడా భంగం కలుగుతుంది. ఎంత నీరు తాగాలో అంతే తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగడం కిడ్నీ ఆరోగ్యానికి మంచిది కాదు.