Afternoon Sleep । మధ్యాహ్నం 3 తర్వాత నిద్ర పోవద్దు, కునుకు తీయడానికి సరైన సమయం ఇదీ!-napping after 3pm is not good expert on ideal time and duration for taking a nap afternoon ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Afternoon Sleep । మధ్యాహ్నం 3 తర్వాత నిద్ర పోవద్దు, కునుకు తీయడానికి సరైన సమయం ఇదీ!

Afternoon Sleep । మధ్యాహ్నం 3 తర్వాత నిద్ర పోవద్దు, కునుకు తీయడానికి సరైన సమయం ఇదీ!

HT Telugu Desk HT Telugu
May 04, 2023 02:39 PM IST

Afternoon Sleep: మధ్యాహ్నం కునుకు (Afternoon Sleep) తీయడం వలన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే పగటి నిద్ర ఎక్కువైతే కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. సరైన సమయం ఇక్కడ కీలకం.

Afternoon Sleep
Afternoon Sleep (Unsplash)

Napping: మధ్యాహ్న భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. అయితే తప్పు మీది కాదు, దీనికి ఒక జీవసంబంధమైన కారణం ఉంది, మెదడులోని అడెనోసిన్ అనే రసాయనం ఉత్పత్తి జరగటం వలన నిద్ర కలుగుతుంది. సాధారణంగా దీని ఉత్పత్తి రాత్రివేళ నిద్రకు ముందు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. మధ్యాహ్నం సమయంలోనూ దీని ప్రభావం కొంత ఉంటుంది. మీరు తినే ఆహారమే ఈ నిద్రమత్తుకు ప్రధాన కారణం, కొన్ని రకాల ఔషధాల ప్రభావమూ ఉంటుంది.

మధ్యాహ్నం కునుకు (Afternoon Sleep) తీయడం వలన కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే పగటి నిద్ర ఎక్కువైతే కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. పగటివేళ నిద్రతో రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది, ఇది అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. రోజులో ఉత్పాదకత తగ్గి, బద్ధకానికి దారితీస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం నిద్రపోవాలనుకుంటే 30 నిమిషాలకు మించి నిద్రపోకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. అంతకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల అధిక BMI, రక్తపోటు పెరగడం, గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు తలెత్తుతాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.

మీరు సుదీర్ఘమైన పని షిఫ్ట్ కారణంగా అలసిపోయినపుడు, మగతగా అనిపించినపుడు కచ్చితంగా కొంత నిద్రపోవాల్సిందే. ఇది అలసిన మీ శరీరానికి విశ్రాంతినిచ్చి, మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది. అదే సమయంలో, మీ రాత్రి నిద్రకు భంగం కలగకుండా, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రణాళికాబద్ధమైన పగటి నిద్రను మీ దినచర్యలో భాగం చేసుకోండి. అందుకు నిపుణులు ఆందించిన కొన్ని చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.

Tips For Afternoon Naps- పగటివేళ నిద్రించడానికి ఉత్తమ మార్గాలు

పగటి నిద్ర నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి, ఈ చిట్కాలను అనుసరించండి

  • చిన్నపాటి కునుకు తీయండి. కేవలం 10 నుండి 20 నిమిషాలు మాత్రమే నిద్రపోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీరు ఎంత తక్కువ నిద్రపోతే, అంత చురుకుగా ఉంటారు. లేదంటే గజిబిజి గందరగోళంగా ఉంటుంది. నిద్రమత్తు, బద్ధకం పెరుగుతుంది.
  • పగటివేళ నిద్రపోవాలనుకుంటే కాస్త త్వరగానే నిద్రపోండి. అంటే 1 PM నుండి 3 PM సమయంలోపే నిద్రపోండి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిద్రపోవడం వలన రాత్రిపూట నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. ఇది మీ నిద్ర షెడ్యూల్ ను పూర్తిగా ప్రభావితం చేయవచ్చు.
  • పగటివేళ నిద్రపోవాలనుకున్నప్పుడు సమయం వృధాకాకుండా చూసుకోండి. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించండి. సౌకర్యవంతమైన గది ఉష్ణోగ్రత, చీకటి ప్రదేశంలో నిద్రించండి. పరధ్యానాలను నివారించండి. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టుకోకండి.
  • మధ్యాహ్నం కునుకు తీసిన తర్వాత, మళ్లీ మీ కార్యకలాపాలను పునఃప్రారంభించే కొంత సమయం ఇవ్వండి. నిద్రలేచిన తర్వాత వెంటనే వెళ్లి పనిలో నిమగ్నం అవకుండా, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కొని, కొద్దిగా నడిచి పని మొదలుపెట్టండి.

ఇలా ప్రణాళికాబద్ధమైన పగటి నిద్రను కలిగి ఉంటే మీరు చురుగ్గా మారడమే కాకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు, మీ రాత్రి నిద్రకు కూడా ఎలాంటి భంగం వాటిళ్లదు.

WhatsApp channel

సంబంధిత కథనం