Amazon Republic Day Sale: ఆమెజాన్ లో లభిస్తున్న బెస్ట్ డాగ్ ఫుడ్స్ ఇవే..-amazon republic day sale top dog foods for your pet ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Republic Day Sale: ఆమెజాన్ లో లభిస్తున్న బెస్ట్ డాగ్ ఫుడ్స్ ఇవే..

Amazon Republic Day Sale: ఆమెజాన్ లో లభిస్తున్న బెస్ట్ డాగ్ ఫుడ్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu
Jan 17, 2023 08:26 PM IST

ప్రస్తుతం కొనసాగుతున్న ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Republic Day Sale) లో పెంపుడు కుక్కల ప్రత్యేక ఆహారం డిస్కౌంట్ లో లభిస్తోంది. ఆమెజాన్ లో లభిస్తున్న బెస్ట్ పెట్ డాగ్ ఫుడ్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ సైట్ ఆమెజాన్ లో ప్రస్తుతం రిపబ్లిక్ డే సేల్ (Amazon Republic Day Sale) నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్ తదితర విభాగాల్లో మంచి డిస్కౌంట్స్ ల్లో ఉత్పత్తులు లభిస్తున్నాయి. అలాగే, ఇంట్లో పెంచుకుంటున్న జంతువులకు సంబంధించిన బెస్ట్ ఫుడ్స్ కూడా డిస్కౌంట్స్ లో లభిస్తున్నాయి.

Meat up: చికెన్ ఫ్లేవర్ డాగ్ బిస్కట్

మీట్ అప్ బ్రాండ్ నుంచి వచ్చిన చికెన్, ఎగ్, వెజ్జీస్, విటమిన్స్.. అన్నీ ఉన్న బెస్ట్ డాగ్ ఫుడ్ ఇది. బిస్కట్ రూపంలో ఉంటుంది. పెట్స్ ఇష్టంగా తింటాయి. ఒరిజినల్ చికెన్ తో వీటిని తయారు చేస్తారు. ధర 500గ్రాములకు సుమారు రూ. 215. వీటి తయారీలో ఎలాంటి ధాన్యాలను, కృత్రిమ ఫ్లేవర్లను వాడలేదు. ఈ ఫుడ్ తో మీ పెట్ స్టామనా కూడా పెరుగుతుంది. అన్ని ఏజ్ ల పెట్ డాగ్స్ కు పెట్టవచ్చు.

Promise adult dog food: ప్రామిస్ అడల్ట్ డాగ్ ఫుడ్

పెట్ డాగ్ మజిల్, బోన్, కార్డియో స్ట్రెంథ్ కోసం ఇది మంచి ఫుడ్. ఇందులో చికెన్ మీల్, చికెన్ ప్రొటీన్, సోయా లెసిథిన్, యాంటాక్సిడెంట్స్, నాచురల్ ప్రొబయాటిక్స్, సాల్మన్ ఆయిల్ మొదలైనవి ఉన్నాయి. దీంతో డాగ్ గట్ హెల్త్ మెరుగుపడుతుంది. ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్ లో ఈ ఫుడ్ 4 కేజీల పౌచ్ రూ. 2,549కి లభిస్తుంది.

Drools: డ్రూల్స్

అన్ని న్యూట్రియెంట్స్ లభించే బాలెన్స్ డ్ ఫుడ్ ఇది. రుచి కూడా బావుండడంతో పెట్స్ ఇష్టంగా తింటాయి. ఈ ఫుడ్ లో ప్రొటీన్, ఫ్యాట్ సమపాళ్లలో ఉంటాయి. ఈ గ్రెయిన్ పెట్ ఫుడ్ తో డాగ్స్ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అన్ని బ్రీడ్స్ డాగ్స్ ఈ డ్రూల్స్ ఫుడ్ తినవచ్చు. చికెన్ ఫ్లేవర్ తో లభించే ఈ ఫుడ్ ధర ఆమెజాన్ సేల్ లో కిలోకి రూ. 644.

Bark out loud: బార్క్ ఔట్ లౌడ్

ఫ్రెష్ చికెన్ తో తయారైన బార్క్ ఔట్ లౌడ్ బ్రాండ్ నుంచి వచ్చిన డాగ్ ఫుడ్ ఇది. ఇందులో 10 రకాల కీలకమైన వైటమిన్స్, మినరల్స్, ఇతర న్యూట్రియెంట్స్ ఉంటాయి. హెల్త్ అండ్ ఎనర్జీని ఇచ్చే ఈ చికెన్ చ్యూస్టిక్స్ ను పెట్స్ ఇష్టంగా తింటాయి. డాగ్స్ బరువు పెరగడానికి, స్కిన్, ఫర్ స్మూత్ గా తయారవడానికి ఈ ఫుడ్ దోహదపడుతుంది. ఇది కూడా రిపబ్లిక్ డే సేల్ లో రూ. 825కి లభిస్తోంది.

Pedigree: పెడిగ్రీ

పెట్ ఫుడ్ లో మోస్ట్ పాపులర్ బ్రాండ్. పెట్ డాగ్ కు పూర్తి సంతృప్తినిచ్చే హోల్ సమ్, న్యూట్రీషినల్ ఆహారం. డాగ్ అవసరాలపై పరిశోధన జరిపి రూపొందించిన ఆహార పదార్ధాలు ఇందులో ఉంటాయి. వైటమిన్స్, మినరల్స్, ఇతర న్యూట్రియెంట్స్ ఉన్న మీట్, వెజ్జీస్, పప్పు ధాన్యాలు ఇందులో ఉంటాయి. సేల్ లో ఈ ప్రొడక్ట్ రూ. 674కి లభిస్తుంది. ఇవి కాకుండా హిమాలయ అడల్ట్ డ్రై డాగ్ ఫుడ్, కెన్నెల్ కిచెన్, చప్పి డ్రై ఫుడ్ మొదలైన బ్రాండ్స్ నుంచి కూడా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి.

WhatsApp channel

టాపిక్