తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss Drinks: ఈ పానీయాలలో నిమ్మరసం కలుపుకొని తాగండి, బరువు త్వరగా తగ్గుతారు

Weight loss Drinks: ఈ పానీయాలలో నిమ్మరసం కలుపుకొని తాగండి, బరువు త్వరగా తగ్గుతారు

Haritha Chappa HT Telugu

19 March 2024, 16:30 IST

google News
    • Weight loss Drinks: అధికబరువు ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో నిమ్మరసం ఒకటి. ఈ నిమ్మ రసాన్ని కొన్ని పానీయాలలో కలుపుకొని తాగితే బరువు సులువుగా తగ్గుతారు.
నిమ్మరసంతో ఉపయోగాలు
నిమ్మరసంతో ఉపయోగాలు (pexels)

నిమ్మరసంతో ఉపయోగాలు

Weight loss Drinks: బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. వ్యాయామాలు ఎంత చేసినా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటేనే బరువు తగ్గడం సులువవుతుంది. పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవాలంటే కొన్ని రకాల వ్యాయామాలతో పాటు ఆహార జాగ్రత్తలు అవసరం. శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాల నిండిన ఆహారాన్ని ఇవ్వడంతో పాటు, శరీరాన్ని బరువు తగ్గించే ఆహారాన్ని అందించాలి. కొన్ని రకాల పానీయాల్లో నిమ్మరసం వేసుకొని ప్రతిరోజూ తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.

బీట్‌రూట్ జ్యూస్

బీట్రూట్లో తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజూ అర గ్లాసు బీట్ రూట్ జ్యూసు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జీవక్రియ రేటు సవ్యంగా ఉంటుంది. ముఖ్యంగా DNA సంశ్లేషణలో ఈ బీట్రూట్ జ్యూస్ లోని పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి, విటమిన్ బి పోషకాలు దీనిలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

బరువు తగ్గడానికి బీట్రూట్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటివి దీనిలో ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ తాగేవారు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా గుండె పనితీరు చక్కగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి, అవయవాలకు ఆక్సిజన్ అందించడానికి, కండరాల పనితీరుకు బీట్రూట్ జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగేవారు నిమ్మ చెక్కను పిండుకొని తాగితే మంచిది. ఆ రెండూ కలిపి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది.

పసుపు నీళ్లు

ప్రతి ఇంట్లో పసుపు పొడి కచ్చితంగా ఉంటుంది. పొట్ట దగ్గర కొవ్వును కరిగించుకోవడానికి ఈ పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్లను వేసి అందులో అర స్పూను పచ్చి పసుపును పొడిని వేసి బాగా కలపండి. అందులోనే నిమ్మరసాన్ని పిండండి. దాన్ని ప్రతి రోజూ తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఇవి ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. పసుపులో కర్కుమిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే ఖనిజాలు, విటమిన్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి శక్తిని అందిస్తూనే, బరువును తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

ప్రతిరోజూ పసుపు పొడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే నెల రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా తాగుతూ ప్రతిరోజూ వ్యాయామాలు చేయాలి. పొట్ట దగ్గర కొవ్వు పెరగడం మొదలవుతుంది. నిమ్మరసం, పచ్చి పసుపు రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి.

ముఖ్యంగా నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ క్రియ సవ్యంగా సాగేలా చేస్తుంది. అలాగే పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా బరువును తగ్గించేందుకు సహాయపడతాయి. ఈ పచ్చి పసుపు, నిమ్మరసం కలిపిన నీటిలో కాస్త బీట్రూట్ జ్యూసును కూడా కలుపుకుంటే ఇంకా మంచిది. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం