తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women Health: మహిళల్లో అండాశయాలు ఆరోగ్యంగా ఉంటేనే చక్కని పిల్లలు పుట్టేది, అందుకోసం వీటిని ప్రతిరోజూ తినండి

Women Health: మహిళల్లో అండాశయాలు ఆరోగ్యంగా ఉంటేనే చక్కని పిల్లలు పుట్టేది, అందుకోసం వీటిని ప్రతిరోజూ తినండి

Haritha Chappa HT Telugu

18 September 2024, 9:30 IST

google News
    • Women Health: మనదేశంలో పునరుత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సమస్యల వల్ల పిల్లలను కనలేకపోతున్నారు. అందుకే స్త్రీ పురుషులు ఇద్దరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
మహిళ అండశయాల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా
మహిళ అండశయాల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా (Pixabay)

మహిళ అండశయాల ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా

Women Health: మనదేశంలో పిల్లల పుట్టక ఇబ్బంది పడుతున్న జంటలు ఎన్నో ఉన్నాయి. భార్యాభర్తల్లో కొందరికి భార్యలో లోపం ఉంటే, మరికొన్ని జంటల్లో భర్తలో ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయి. అందుకే మొదటి నుంచి స్త్రీలు పురుషులు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మహిళల్లో అండాలు ఆరోగ్యకరంగా ప్రతి నెలా విడుదలవుతేనే గర్భం ధరించడం సులువు అవుతుంది. అండాశయాలు ఆరోగ్యంగా ఉండాలటే వాటి ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలు కొన్ని ఉన్నాయి

అండాల ఆరోగ్యం అనేది పునరుత్పత్తి హార్మోన్ల వ్యవస్థల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్... ఈ రెండూ అండాశయాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మానసిక స్థితి, జీవక్రియ, జీవనశైలి అలవాట్లు కూడా అండాశయాన్ని ప్రభావితం చేస్తాయి. మహిళలు ప్రతిరోజు కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల అండాశయాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఆకుపచ్చని కూరలు

పాలకూర, కాలే వంటి ఆకుపచ్చని కూరలు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. వీటిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పునరుత్పత్తి వ్యవస్థలో అత్యవసరమైనవి. ముఖ్యంగా ఫోలేట్ అని పిలిచే పోషకం ఆకుకూరల్లో అధికంగా ఉంటుంది. ఫోలేట్లు అండోత్సర్గాన్ని నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన అండాలను విడుదల చేస్తాయి. కాబట్టి వారానికి కనీసం రెండు మూడు సార్లు ఆకుపచ్చని కూరగాయలు తినేందుకు ప్రయత్నించండి.

అవిసె గింజలు

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వాటిని తినేవారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, లిగ్నాన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. అండాశయాలలో తిత్తులు వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. అవిసె గింజల్లో ఉండే లిగ్నాన్స్ మీ శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయి. సమతుల్య హార్మోన్లు ఆరోగ్యకరమైన అండాశయాలను అందిస్తాయి.

బెర్రీ పండ్లు

మార్కెట్లో ఎన్నో రకాల బెర్రీ పండ్లు లభిస్తున్నాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్పెబెర్రీలు ఇలా మీకు ఏం పండ్లు నచ్చితే ఆ పండ్లు తెచ్చుకొని తినండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరకణాలను ఆక్సీకరణ ఒత్తిడి పడకుండా కాపాడతాయి. కణాలను అనారోగ్యానికి గురికాకుండా చూస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఎండోక్రైయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిలో అధిక ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది ఇన్సూరెన్స్ స్థాయిలను కూడా స్థిరంగా ఉంచుతాయి. పిసిఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలు బెర్రీలను తినడం చాలా అవసరం.

నట్స్

పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, వాల్ నట్స్, బాదం వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి అండాశయాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటివి ఉంటాయి. కాబట్టి హార్మోన్ల అసమతుల్యత సమస్య రాకుండా అడ్డుకుంటాయి. మెగ్నీషియం అనేది తగ్గితే ఒత్తిడి అధికమైపోతుంది. కాబట్టి మెగ్నీషియం నిండుగా ఉన్న నట్స్ తినడం చాలా అవసరం. సెలీనియం అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది అండాశయాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది.

అవకాడోలు

స్త్రీల పునరుత్పత్తికి అవకాడోలు ఎంతో ఉత్తమంగా పనిచేస్తాయి. దీని సూపర్ ఫుడ్‌గా పిలుచుకుంటారు. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. అలాగే అవకాడోల్లో ఫోలేట్ ఉంటుంది. ఇది అండాల అభివృద్ధికి సహాయపడుతుంది. అండోత్సర్గము సరిగా జరిగేలా చేస్తుంది. గర్భం ధరించాలని అనుకునే మహిళలు అవకాడోలను తినడం చాలా అవసరం. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటివి నిండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కాపాడతాయి.

సాల్మన్ చేప

మీకు సాల్మన్ చేపలు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అండాశయాలలో తిత్తులు, వాపు వంటివి రాకుండా ఇది కాపాడుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ ను అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. పునరుత్పత్తి రేటును పెంచుతాయి. సాల్మన్ చేపలో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అండాశయాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. సాల్మన్ వంటి కొవ్వు చేపలు వారానికి రెండుసార్లు తింటే ఎంతో మంచిది.

తదుపరి వ్యాసం