తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nutmeg For Health: చిటికెడు జాజికాయ పొడి రోజూ తింటే చాలు మీలో ఉన్న ఈ సమస్యలన్నీ పొగొట్టుకోవచ్చు, ముఖ్యంగా మగవారు

Nutmeg for Health: చిటికెడు జాజికాయ పొడి రోజూ తింటే చాలు మీలో ఉన్న ఈ సమస్యలన్నీ పొగొట్టుకోవచ్చు, ముఖ్యంగా మగవారు

Haritha Chappa HT Telugu

24 August 2024, 9:30 IST

google News
    • Nutmeg for Health: చిటికెడు జాజికాయ పొడి ఏ వంటకం రుచినైనా రెట్టింపు చేస్తుంది. దీనిని భారతీయ ఆహారంలోనే కాకుండా విదేశాలలో కూడా ఉపయోగిస్తారు. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల మగవారిలో ఉన్న కొన్ని సమస్యలు పోతాయి, ముఖ్యంగా వారి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
జాజికాయ తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు
జాజికాయ తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు

జాజికాయ తినడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు

భారతీయ వంటల్లో అనేక రకాల మసాలా దినుసులను ఉపయోగిస్తాము. వాటిలో జాజికాయ ఒకటి. భారతదేశంతో పాటు, పాశ్చాత్య ఆహారంలో కూడా సువాసన, భిన్నమైన రుచి కోసం దీన్ని కలుపుతారు. ఇంగ్లిషులో జాజికాయను నట్ మగ్ అంటారు. సాధారణంగా, మనం ఈ మసాలాను తక్కువగా వాడతాము. కానీ దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మార్కెట్లో అనేక రకాల జాజికాయలు అందుబాటులో ఉన్నాయి. జాజికాయ కొనేటప్పుడు, అవి మరీ తేలికగా, రంధ్రాలతో ఖాళీగా లేకుండా చూసుకోవాలి. పెద్దగా, మృదువుగా, బరువుగా ఉండే జాజికాయను మాత్రమే కొనుగోలు చేయాలి. జాజికాయను సాధారణంగా తీపి, రుచికరమైన వంటలలో ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పులు ఉన్న వారికి జాజికాయ నూనె మార్కెట్ లో దొరుకుతుంది. దీన్ని కీళ్లకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

జాజికాయ ఎలా వాడాలి?

జాజికాయను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. మొదట మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ ను తయారుచేసి పెట్టుకోవాలి. దాన్ని అవసరమైన సమయంలో వాడుకోవచ్చు. రెండవది జాజికాయను ఒక రాయిపై రుద్దడం ద్వారా ఆ సారాన్ని సేకరించాలి. ఆ సారాన్ని ఆహారంలోభాగం చేసుకోవాలి.

ఇంట్లో సూప్, ఏదైనా స్వీన్ చేసినప్పుడల్లా వాటిలో ఖచ్చితంగా జాజికాయ పొడిని కలిపితే టేస్టీగా ఉంటుంది.

మసాలా టీ తయారు చేసేటప్పుడు లవంగాలు, యాలకులు, నల్ల మిరియాలు మొదలైన వాటితో పాటు జాజికాయ పొడిని వేస్తే మంచిది.

ఆపిల్ పండ్ల ముక్కలపై చాట్ మసాలాతో పాటూ, చిటికెడు జాజికాయ పొడిని చల్లి తింటే రుచి, ఆరోగ్యం రెండూ అందుతాయి.

చలికాలంలో కాలీఫ్లవర్, చిలగడదుంపలు వంటకాలు వండితే జాజికాయ పొడిని వేస్తే మంచిది.

పాయసం, స్మూతీ మొదలైనవి తయారు చేసేటప్పుడు చిటికెడు జాజికాయ పొడిని జోడించడం వల్ల రుచి పెరుగుతుంది. పాస్తా, నూడుల్స్ మొదలైనవి వండినప్పుడు అందులో జాజికాయ పొడిని జోడించాలి.

కాఫీ, టీ, వేడి పాలు లేదా హాట్ చాక్లెట్ పైన ఈ పొడిని వేసుకుని తాగవచ్చు.

జాజికాయతో ఆరోగ్యం

1. ఇది మెదడుకు ఉద్దీపనగా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

2. జాజికాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది

3. ఇది నిద్రను కూడా మెరుగుపరుస్తుంది. జాజికాయ నూనె నొప్పి, మంటను తగ్గించడంలో ఉపయోగిస్తారు. ఈ నూనెను అప్లై చేయడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. పిల్లలకు జలుబు ఉన్నప్పుడు కొద్దిగా జాజికాయను రుద్ది, పాలతో కలిపి వారికి పెట్టడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. డయేరియా వచ్చినా జాజికాయ మేలు చేస్తుంది. పాలలో చిటికెడు జాజికాయ కలుపుకుని తాగడం వల్ల అలసట, నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మగవారి సంతానోత్పత్తి సామర్థ్యం

జాజికాయ పొడిని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. దాన్ని చిటికెడు ఉదయం, సాయంత్రం ఆవు పాలలో కలిపి తాగాలి. ఆ పాలు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. మగవారిలో వీర్య కణాల సంఖ్య పెంచేందుకు ఇది సహాయపడుతుంది. కాబట్టి పిల్లలను కనేందుకు ప్రయత్నిస్తున్న మగవారు ప్రతిరోజూ జాజికాయ పొడిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం