తెలుగు న్యూస్ / ఫోటో /
Nutmeg benefits: చర్మానికి జాజికాయ లేపనం రాసి చూడండి.. అన్ని సమస్యలు మాయం
Nutmeg benefits: జాజికాయ ఒక రకమైన నేచురల్ ఎక్స్ఫోలియేట్, ఇది ముఖంపై ఉన్న మృతకణాలు తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. జాజికాయను ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
(1 / 6)
మెరిసే చర్మానికి జాజికాయ వల్ల అనేక లాభాలున్నాయి. జాజికాయను గంధంలా నూరి ముఖానికి రాసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెల్సుకోండి. గంధం నూరే చెక్క మీద కాస్త నీల్లు చిలకరించి జాజికాయను నూరితే గంధం లాగా వస్తుంది. లేదంటే జాజికాయను పొడి చేసుకుని అందులో నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవచ్చు.(shutterstock)
(2 / 6)
జాజికాయ లేపనం మొటిమల సమస్యను తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఈ జాజికాయ లేపనం మొటిమలున్న చోట రాసుకుంటే క్రమంగా సమస్య తగ్గుతుంది.(shutterstock)
(3 / 6)
మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తే.. జాజికాయ లేపనం రాసి చూడండి. తేమ అంది మృదువుగా మారుతుంది.(shutterstock)
(4 / 6)
చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మంపై ముడతలు, గీతలు లాంటి సమస్యలుంటే క్రమంగా జాజికాయ వల్ల తగ్గిపోతాయి. (shutterstock)
ఇతర గ్యాలరీలు