తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Small Business Ideas : ఈ 6 ఐడియాలతో ఇంట్లో నుంచే డబ్బు సంపాదించుకోవచ్చు

Small Business Ideas : ఈ 6 ఐడియాలతో ఇంట్లో నుంచే డబ్బు సంపాదించుకోవచ్చు

Anand Sai HT Telugu

27 May 2024, 15:30 IST

google News
    • Small Business Ideas In Telugu : ఇంటి నుండి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం సరైన ప్రణాళిక ఉండాలి. చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. మీకోసం కొన్ని ఐడియాలు ఉన్నాయి.
ఇంట్లో నుంచే బిజినెస్ చేసేందుకు చిట్కాలు
ఇంట్లో నుంచే బిజినెస్ చేసేందుకు చిట్కాలు (Unsplash)

ఇంట్లో నుంచే బిజినెస్ చేసేందుకు చిట్కాలు

ఇటీవలి సంవత్సరాలలో కొత్త పారిశ్రామికవేత్తలు ఎక్కువగా అవుతున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఏదో ఒక బిజినెస్‌లో దిగాలని చూస్తున్నారు. చాలా మంది గృహిణులు ఇంటి నుంచి వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఇళ్ల నుండి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. మన దగ్గర ఇలాంటి మార్కెట్‌ అనువైనది. ఎందుకంటే పెట్టుబడి తక్కువగా పెట్టి.. లాభాలు పొందవచ్చు. ఇంట్లో నుంచి బిజినెస్ చేసేందుకు కొన్ని ఐడియాలు మీకోసం..

ఆన్‌లైన్ ట్యూటరింగ్

ఆన్‌లైన్ లెర్నింగ్ వెబ్‌సైట్‌ల పెరుగుదల, నాణ్యమైన విద్య కోసం డిజిటల్ మీద జనాలు పడుతున్నారు. దీంతో ఆన్‌లైన్ ట్యూటరింగ్ అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మారింది. మీకు ఏదైనా రంగంలో నైపుణ్యం లేదా ప్రతిభ ఉంటే, మీరు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఆన్‌లైన్ ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. ఉదాహరణకు మీకు హిందీ ఎక్కువగా మాట్లాడటం వస్తే.. మీరు వేరేవారికి ఆన్ లైన్ ద్వారా హింది నేర్పవచ్చు.

గృహ ఆధారిత క్యాటరింగ్

తెలుగు రాష్ట్రాల వంటకాల రుచులు ప్రత్యేకమైనవి. మీకు వంట చేసే నైపుణ్యాలు ఉంటే, ఇంట్లో క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించండి. మీరు మీ ప్రాంతంలో చిన్న సమావేశాలు, పార్టీలు లేదా ఈవెంట్‌ల కోసం ఇంట్లో తయారుచేసిన స్నాక్స్, డెజర్ట్‌లు లేదా క్యాటరింగ్‌ను అందించడంలో ఎదగవచ్చు. స్విగ్గీ, Zomatoలో మీ ఆహారాన్ని జాబితా చేయడం ద్వారా మీరు కొత్త కస్టమర్‌లను పొందవచ్చు. ఇంట్లో నుంచి క్యాటరింగ్ సర్వీస్ అందిస్తే మీకు పెట్టుబడి కూడా ఎక్కువగా ఉండదు.

కళాకృతులు

భారతదేశ సాంస్కృతిక వారసత్వం హస్తకళలతో నిండుగా ఉందని చెప్పవచ్చు. మీరు హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్‌లు, నగలు, పెయింటింగ్‌లు, మరేదైనా కళాకృతులు తయారు చేయడంలో నిపుణులైతే లేట్ చేయకుండా ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఇ-కామర్స్ సైట్‌లలో మీరు నమోదు అయి అక్కడ కూడా అమ్ముకోవచ్చు. లేదు అంటే సొంతంగా ఒక యాప్ డిజైన్ చేయించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు.

కంటెంట్ రైటర్

డిజిటల్ యుగంలో కంటెంటే రారాజు. అనేక వ్యాపారాలు తమ వెబ్‌సైట్‌లు, బ్లాగులు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం నాణ్యమైన కంటెంట్ కోసం నిరంతరం వెతుకుతున్నాయి. మీకు రాత నైపుణ్యాలు ఉంటే వారి బిజినెస్ మెరుగుపరిచే ఐడియాలతో పని చేయవచ్చు. వ్యాపారాలు, వ్యక్తులకు మీరు ఫ్రీలాన్స్ ప్రాతిపదికన కంటెంట్‌ను అందించవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ సేవలు

ఆన్‌లైన్ వ్యాపారాల విస్తరణతో డిజిటల్ మార్కెటింగ్ సేవలకు డిమాండ్ ఆల్ టైమ్ హైలో ఉందని చెప్పవచ్చు. మీకు SEO, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈ-మెయిల్ మార్కెటింగ్‌లో నైపుణ్యాలు ఉంటే మీ సేవలను ఇంటి నుండి వివిధ పరిశ్రమలకు అందించవచ్చు. తద్వారా డబ్బు పొందవచ్చు.

ఆన్‌లైన్ వ్యాపారం

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదల ఆన్‌లైన్ వ్యాపారానికి మంచి బూస్ట్ ఇచ్చింది. వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని గతంలో కంటే సులభతరం చేసింది. మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న ఉత్పత్తులను సంస్థల నుంచి నేరుగా కొనవచ్చు. మీరు బల్క్‌గా కొంటే తక్కువ ధరకే అందిస్తారు. వాటిని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా eBay వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రిటైల్ ధరలకు తిరిగి విక్రయించవచ్చు.

ఇంటి నుండి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడం పెద్ద పనేం కాదు. కానీ ప్లానింగ్ సరిగా ఉండాలి. ఇలా డబ్బు సంపాదించడం సాధ్యమవుతుంది. అత్యంత లాభదాయకంగా కూడా మారుతోంది. సరైన నైపుణ్యాలు, అభిరుచి, అంకితభావంతో మీ కలలను రియాలిటీగా మార్చవచ్చు. మంచి గుడ్ విల్ సృష్టించవచ్చు. అది ఆదాయాన్ని మాత్రమే కాకుండా సంతృప్తిని అందిస్తుంది.

తదుపరి వ్యాసం