తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Makeup Tips : మీ నుదురు పెద్దగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్​తో చిన్నదిగా మార్చేయండి

Makeup Tips : మీ నుదురు పెద్దగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్స్​తో చిన్నదిగా మార్చేయండి

29 November 2022, 9:47 IST

google News
    • Makeup Tips for Big Forehead : మాధురి దీక్షిత్ బ్యూటీ ఏజ్ పెరుగుతున్నా.. ఏమాత్రం ఆమెకున్న క్రేజ్ తగ్గట్లేదు. అయితే ఈ బ్యూటీకి కూడా ఓ అభద్రతా భావం ఉండేదట. అదేంటంటే.. ఆమె నుదురు పెద్దగా ఉండడం. దీనివల్ల ఆమె మొదట్లో కొన్ని ఇబ్బందులు పడినా.. దానిని యాక్సెప్ట్ చేస్తూ.. వివిధ మేకప్ ట్రిక్​లతో.. ఆ సమస్యను అధిగమించింది. మీరు కూడా మీ నుదురు పెద్దగా ఉందని ఫీల్ అయితే.. ఈ సింపుల్ చిట్కాలతో నుదురు చిన్నగా కనిపించేలా మార్చుకోండి. 
నుదురు పెద్దగా ఉంటే ఇలా కవర్ చేయండి..
నుదురు పెద్దగా ఉంటే ఇలా కవర్ చేయండి..

నుదురు పెద్దగా ఉంటే ఇలా కవర్ చేయండి..

Makeup Tips for Big Forehead : చాలామందికి నుదురు పెద్దదిగా ఉంటుంది. కొందరికి ముందు నుంచే నుదురు పెద్దదిగా ఉంటుంది. మరికొందరికి.. జుట్టు ఊడిపోతున్న సమయంలో నుదురు పెద్దది అవుతుంది. దీనినే చాలా మంది సమస్యగా భావిస్తారు. మనం ఎలా ఉన్నామో.. అలాగే ఉండడం మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. లేదు అంటే.. మనంలో అభద్రతా భావం చాలా ఎక్కువైపోతుంది.

మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటే.. ఇతరుల ఫీలింగ్స్​తో మనకు సంబంధం ఉండదు. అయినా సరే కొన్ని మేకప్ ట్రిక్​లతో.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు మేకప్ నిపుణులు. కొన్ని సింపుల్ చిట్కాలు మీ నుదురు చిన్నదిగా కనిపించేలా చేస్తాయని అంటున్నారు. ఆ ట్రిక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫౌండేషన్ ట్రిక్

మీరు మీ నుదురు.. చిన్నదిగా కనిపించాలనుకుంటే.. మీ హెయిర్‌లైన్‌కు ఫౌండేషన్‌ను పూయడం ఆపండి. ఇది మీ హెయిర్‌లైన్‌పై సహజమైన నీడను, మీ హెయిర్‌లైన్ అసలైన దానికంటే తక్కువగా ప్రారంభమయ్యే భ్రమను సృష్టించడంలో సహాయపడుతుంది.

ఇదే కాకుండా.. మీ నుదిటిని చిన్నదిగా కనిపించడం కోసం.. మీ నుదిటి లైన్ వెంట్రుకల పొడవునా.. డార్క్ షేడ్ ఫౌండేషన్‌ను అప్లై చేయండి. దీనివల్ల కూడా మీ నుదురు చిన్నగా కనిపిస్తుంది.

బోల్డ్, డార్క్ ఐ బ్రోస్..

డార్క్, బోల్డ్ కనుబొమ్మలు మీ ముఖాన్ని యవ్వనంగా, సన్నగా, చిన్నగా కనిపించేలా చేస్తాయి. అలా అని భయానకంగా డార్క్ చేయాలని కాదు. మీ కనుబొమ్మలకు ఆకృతినిస్తూ.. వాటిని కాస్త బ్రాడ్​గా, డార్క్​గా చేయాలి. ఇవి మీ నుదురును చిన్నగా కనిపించేలా చేస్తాయి.

కనుబొమ్మలను ఓవర్‌డ్రా చేయకుండా.. నుదురు ఎముక, కంటి మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లు భ్రమ కలిగించడానికి మీ కనుబొమ్మల వంపు ఎత్తుగా ఉండేలా చూసుకోండి.

బ్లష్​తో మరో సింపుల్ ట్రిక్

మీ బుగ్గలపై ప్రకాశవంతమైన, గులాబీ రంగు బ్లష్ వేసుకుంటే.. అది మీ పెద్ద నుదురు వైపు నుంచి.. చూపరుల దృష్టిని మళ్లిస్తుంది. అంతేకాకుండా లుక్స్​ని ఎక్కువ హైలైట్ చేస్తుంది.

మీ బుగ్గలపై యాపిల్స్‌తో పాటు పీచు లేదా రోజీ-రంగు బ్లష్‌ని అప్లై చేసి.. లిఫ్టింగ్ ఎఫెక్ట్‌ను ట్రై చేయండి. ఈ ట్రిక్ మీ నుదురు చిన్నదిగా కనిపించేలా చేయడానికి సహాయం చేస్తుంది. ఎగువ చెంపలపై, మీ ముక్కుపై మెరిసే హైలైటర్‌ను స్వైప్ చేస్తే.. మీ లుక్​ పర్​ఫెక్ట్​ ఉంటుంది.

షైనీ లిప్​స్టిక్

ప్రకాశవంతమైన, బోల్డ్ లిప్‌స్టిక్ మీ ముఖాన్ని హైలెట్ చేస్తుంది. కొన్ని సెకన్లలో మీ విశాలమైన నుదిటి నుంచి.. దృష్టి మరల్చగలిగే శక్తి లిప్​స్టిక్స్​కు ఉంది.

మీ పెదవులు పాప్ చేయడానికి, నుదురు నుంచి ఇతరుల దృష్టి మరల్చడానికి.. ప్రకాశవంతమైన ఎరుపు, గులాబీ లిప్‌స్టిక్‌ను అప్లై చేయండి. అయితే ఆ సమయంలో మీరు మాట్లాడుతూ ఉంటే.. ఇతరుల దృష్టి కచ్చితంగా మీ పెదవులపై ఎక్కువగా ఉండే అవకాశముంది.

బ్రోంజర్ ఉపయోగించండి

ఒక బ్రోంజర్ మీ నుదిటిని తక్షణమే చిన్నదిగా చేస్తుంది. మీ ముఖాన్ని మరింత ఉల్లాసంగా, నిర్మాణాత్మకంగా, గ్లోగా కనిపించేలా చేస్తుంది. ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి బ్రోంజర్‌కు మ్యాట్ ఫినిషింగ్ ఇవ్వండి. మీ ఒరిజినల్ స్కిన్ టోన్ కంటే కనీసం మూడు షేడ్స్ ముదురు రంగులో ఉండేలా చూసుకోండి.

హెయిర్‌లైన్ చుట్టూ బ్రోంజర్‌ను అప్లై చేయండి. దీనిని అప్లై చేయడానికి టేపర్డ్ బ్రష్‌ని ఉపయోగించండి. ఇది తక్షణమే మీ నుదురు చిన్నదిగా కనిపించేలా చేస్తుంది.

తదుపరి వ్యాసం