Harmful Effects of Lipsticks : లిప్‌స్టిక్ ఎక్కువగా వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త..
Harmful Effects of Lipsticks : అమ్మాయిల అందాన్ని మరింత పెంచేవి లిప్స్టిక్స్. అందుకే వారి స్కిన్‌టోన్‌కి తగ్గట్లు నప్పే వాటిని ఎంచుకుంటారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. లిప్‌స్టిక్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? అంటే.. అవుననే అంటున్నారు నిపుణులు. మరి లిప్‌స్టిక్ వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Harmful Effects of Lipsticks : లిప్ స్టిక్ వేసుకోవడం అనేది స్త్రీల మేకప్‌లలో మొదటి ఎంపిక. ఎక్కడికి వెళ్లినా ఈజీగా తీసుకువెళ్లగలిగేది అది ఒక్కటే. పైగా ఏ సమయంలోనైనా.. ఎక్కడైనా దానిని ఈజీగా ఉపయోగించవచ్చు. మహిళలు తమ దుస్తులు, సందర్భం, మానసిక స్థితి, శైలిని బట్టి లిప్‌స్టిక్‌ను ఎంచుకుంటారు. లిప్‌స్టిక్ సడెన్‌గా వేసుకున్నవారి లుక్‌ని మార్చేస్తాయి.
అయితే చాలా సౌందర్య సాధనాలు మహిళలకు హాని చేస్తాయి. అయితే లిప్‌స్టిక్ వల్ల కూడా.. దుష్ప్రభావాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి శరీరానికి చాలా ప్రమాదకరమైనవని చెప్తారు. ఎందుకంటే పెదవులపై లిప్‌స్టిక్‌ను పూయడం వల్ల ఆహారం తిన్నప్పుడు అది నేరుగా శరీరంలోకి వెళ్లిపోతుంది. దీని కారణంగా, హానికరమైన రసాయనాలు నేరుగా జీర్ణవ్యవస్థలోకి చేరుతాయి. మీ పెదాలను దెబ్బతీయడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. అయితే మీ పెదాలను దెబ్బతీయకుండా.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు.. లిప్‌స్టిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొనుగోలు చేసేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..
మాంగనీస్, కాడ్మియం, క్రోమియం, అల్యూమినియం శరీరంలో కలిసిపోతే.. అవి చాలా హాని చేస్తాయి. లిప్‌స్టిక్ వేసుకున్నప్పుడు ఆహారం తీసుకుంటే ఆ మూలకాలన్నీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం పెరుగుతుంది. కాబట్టి లిప్‌స్టిక్‌ను కొనుగోలు చేసేటప్పుడు.. అది ఈ ఉత్పత్తులను కలిగి ఉండకూడదని గుర్తుంచుకోండి.
హానికరమైన ప్రభావాలు:
* చాలా లిప్‌స్టిక్‌లలో సీసం కనిపిస్తుంది. సీసం శరీరానికి చాలా హానికరం. దీని వల్ల హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు వస్తాయి.
* లిప్‌స్టిక్‌లలో శరీరానికి హాని కలిగించే అనేక రకాల ప్రిజర్వేటివ్‌లు ఉన్నాయి. వాటి పరిమాణం ఎక్కువగా ఉంటే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పారాబెన్ వంటి సంరక్షణకారి.. క్యాన్సర్‌కు కారణమని చెప్తారు. దీని వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య కనిపిస్తుంది.
* బిస్మత్ ఆక్సిక్లోరైడ్‌ను లిప్‌స్టిక్‌లో ప్రిజర్వేటివ్‌గా కూడా ఉపయోగిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది శరీరాన్ని అనారోగ్యానికి గురి చేస్తుంది. చాలా మందికి దీనివల్ల ఎలర్జీ కూడా ఉంటుంది.
* మీరు గర్భవతిగా ఉన్నట్లయితే.. లిప్‌స్టిక్‌ను అన్ని సమయాలలో వేయకండి. లిప్‌స్టిక్‌ను అప్పుడప్పుడు మాత్రమే వేయండి. చౌక బ్రాండ్‌ల నుంచి లిప్‌స్టిక్‌లను అస్సలు కొనుగోలు చేయవద్దు. మీకు కావాలంటే.. మీరు హెర్బల్ లిప్‌స్టిక్‌ను ఉపయోగించవచ్చు.
ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..
* లిప్‌స్టిక్‌ను కొనుగోలు చేసేటప్పుడు డార్క్ షేడ్స్‌కి దూరంగా ఉండండి. ఎందుకంటే హెవీ మెటల్స్ డార్క్ షేడ్స్‌లో ఎక్కువగా ఉంటాయి.
* లిప్‌స్టిక్‌ను పూయడానికి ముందు పెదవులపై నెయ్యి లేదా పెట్రోలియం జెల్లీని పూయండి. ఇది దుష్ప్రభావాలను తగ్గిస్తుంది.
* స్థానిక బ్రాండ్లు చౌకగా ఉండవచ్చు కానీ.. అవి మీ పెదాలను దెబ్బతీస్తాయి.
* మంచి బ్రాండ్‌ల నుంచి మాత్రమే లిప్‌స్టిక్‌ను కొనుగోలు చేయండి. దానిలోని పదార్థాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి.
* లిప్‌స్టిక్‌ల వల్ల కలిగే పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి చక్కెర, తేనెతో మీ పెదాలను స్క్రబ్ చేయండి.
సంబంధిత కథనం