తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hormonal Imbalance । మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కలగడానికి కారణాలివే!

Hormonal Imbalance । మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కలగడానికి కారణాలివే!

HT Telugu Desk HT Telugu

28 April 2023, 11:18 IST

google News
    • Hormonal Imbalance: హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినపుడు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలోని వ్యవస్థలు అస్తవ్యస్తమవుతాయి. ఇందుకు ప్రేరేపించే కారకాలు ఇక్కడ తెలుసుకోండి.
Hormonal Imbalance
Hormonal Imbalance (unsplash)

Hormonal Imbalance

Hormonal Imbalance: మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి సంబంధించి మీ శరీరంలో జరిగే ప్రతీ చర్యకు హార్మోన్లు బాధ్యత వహిస్తాయి. మీ శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి వివిధ హార్మోన్లు నిర్దిష్ట మొత్తంలో అవసరం అవుతాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా భావోద్వేగాలలో మార్పులు కలుగుతాయి. మీకు అప్పుడప్పుడు కోపం, ఆనందం, వికారం, విసుగు, డిప్రెషన్ కలగటానికి కూడా హార్మోన్లే కారణం. ఈ హార్మోన్లు మీ మొత్తం సిస్టమ్‌ను నియంత్రిస్తాయి. ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు సహా అనేక ఇతర అనారోగ్య సమస్యలకు హార్మోన్లలో అసమానతలు కారణం కాగలవు.

అయితే శరీరంలో హార్మోన్ల అసమానతలు అనేవి యాదృచ్ఛికంగా జరిగే విషయం కాదు. కొన్ని బాహ్య కారకాలు కూడా వీటి హెచ్చుతగ్గులలో పాత్ర వహిస్తాయి. వాటిని నియంత్రణలో ఉంచుకుంటే హార్మోన్లను కూడా సమతుల్యంగా ఉంచుకోవచ్చు. హార్మోన్ల అసమానతలకు దారితీసే కారకాలేమిటో ఇక్కడ తెలుసుకోండి.

కెఫిన్

కెఫిన్ అధికంగా తీసుకుంటే, మన హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. కెఫిన్ అనేది శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. పెరిగిన కార్టిసాల్ స్థాయిలు మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావం చూపుతుంది. బాధలు, నొప్పిని దిగమింగుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది ఇతర అనర్థాలకు దారితీయవచ్చు. జంక్ ఫుడ్ తినడం, ఆల్కాహాల్ అతి వినియోగం కూడా ఇలాంటి దుష్రభావాలను కలిగి ఉంటాయి.

సరిపోని నిద్ర

మన శరీరాలను రీబూట్ చేయడానికి, రీఛార్జ్ చేయడానికి, పునరుజ్జీవింపజేయడానికి నిద్ర అనేది అత్యంత శక్తివంతమైన యంత్రాంగం. మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత విశ్రాంతి అవసరం. మీకు తగినంతగా విశ్రాంతి లేకపోతే, ఒత్తిడి ప్రతిస్పందనలు పెరుగుతాయి. అలసట, నీరసంతో పాటు మానసిక అశాంతికి దారితీస్తుంది.

భోజనం చేయకపోవడం

మనం కొన్ని సందర్భాల్లో ఉదయం అల్పాహారం చేయలేకపోతాం. మధ్యాహ్న భోజనం కూడా చేయలేని తీవ్రమైన షెడ్యూల్‌లను కలిగి ఉంటాము. ఈ అలవాట్లు కూడా మీ సాధారణ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇది దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తుంది.

అయిష్టతతో కూడిన పనులు

కేలరీలను బర్న్ చేయడానికి శారీరక శ్రమలో పాల్గొనడం, వ్యాయామం చేయడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, మీరు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కష్టంగా వ్యాయామం చేయడం, ఇష్టంలేని పనులు చేస్తూ నిరంతరంగా ఒత్తిడిని అనుభవించడం వంటివి హార్మోన్ల అసమతుల్యతకు దారితీయవచ్చు.

రసాయనాలు

ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, అల్యూమినియం డబ్బాలు, కొన్ని సౌందర్య సాధనాలు ఎండోక్రైన్ విధులకు అంతరాయం కలిగించే టాక్సిన్‌లను కలిగి ఉంటాయి. ఎండోక్రైన్ అనేది హార్మోన్ స్రావానికి బాధ్యత వహించే ఒక వ్యవస్థ. మీ శరీరంలో టాక్సిన్లు చేరినపుడు హార్మోన్ల అసమతుల్యత కలగవచ్చు.

తదుపరి వ్యాసం