Find Fake Relationship : మీరు ఫేక్ రిలేషన్‌లో ఉన్నారని చెప్పడానికి ఈ ఐదు సంకేతాలు చాలు
13 February 2024, 19:00 IST
- Valentines Day : ప్రేమించడం అందరూ చేస్తుంటారు. కానీ నిజమైన ప్రేమను పొందినవారే జీవితంలో ఆనందంగా ఉంటారు. మీ ప్రేమ ఎలాంటిదో తెలుసుకోండి.
ఫేక్ రిలేషన్ షిప్ తెలుసుకోవడం ఎలా
రానే వచ్చింది ప్రేమికుల రోజు.. వికసించిన ప్రేమ పుష్పాలు, కంచికి చేరిన ప్రేమ కథలు ఎన్నో. రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్లకు ఇది పండగ లాంటిది అని అందరూ అంటారు.. రిలేషన్‌షిప్‌లో ఉండి కూడా ఒంటిరిగా ఉన్నారంటే.. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరే అర్థం చేసుకోవాలి..ఒంటిరిగా ఉండాలి అనుకోవడం వేరు, ఒంటరి అవడం వేరు. ప్రేమతో వచ్చిన చిక్కు ఏంటంటే.. ఇది కొంచెంతో వదిలిపెట్టదు.. పూర్తిగా పీకల్లోతు దింపుతుంది.. అయితే దానివల్ల మంచి జరుగుతుంది.. లేదా కోలుకోలేని దెబ్బతింటారు.
మనం ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉంటే.. వారిని గుడ్డిగా నమ్మేస్తాం.. ముఖ్యంగా అమ్మాయిలు రోజులు పెరిగేకొద్ది ఆ వ్యక్తిపై ఎనలేని ప్రేమను, నమ్మకాన్ని పెంచుకుంటారు. మిమ్మల్ని శాశించే హక్కు మీరే వారికి కల్పిస్తారు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం.. కాయిన్‌కు రెండో సైడ్ ఉన్నవారి బాధల గురించి తెలుసుకుందాం.. కొన్ని సంకేతాల ద్వారా మీరు ఒక ఫేక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలుసుకోవచ్చు.. అవి ఏంటంటే..
మీ పార్టనర్ మీకు విలువ ఇవ్వకుండా ప్రతి దాంట్లో లోకువగా చూస్తారు. మీకు ఏం తెలియదు అన్నట్లు వ్యవహరిస్తారు. మీ మాటలకు వారి దగ్గర ఏ మాత్రం విలువ ఉండదు. చాలా తేలిగ్గా కొట్టిపడేస్తారు. అలా మీతో ప్రవర్తిస్తే మీరు వారికి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా వేస్ట్.
మీరు ఏదైనా స్టాండ్ తీసుకుంటే..మిమ్మల్ని ఎలాగోలా ఒప్పించి వేరే డైరెక్షన్‌లోకి తీసుకెళ్తారు.. మీ జీవితంలో మీ నిర్ణయాలు ఉండవు. అన్నీ వారి నిర్ణయాలే ఉంటాయి.. మీకు మీరు తీసుకున్న నిర్ణయం, చేసే పని కరెక్టా కాదా అని ఆలోచించే హక్కు కూడా ఉండదు..
ఏదైనా అవసరం ఉంటేనే మీ మీద వారికి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ట్రై చేస్తారు..అవసరం వచ్చినప్పుడే ప్రేమగా ఉంటారు. మీరు అది నిజమైన ప్రేమ అనుకోని భ్రమపడతారు. వారి మూడ్ స్వింగ్స్‌కు తగ్గట్టు మీతో ఉంటారు.
మిమ్మల్ని మీ కుటుంబం నుంచి స్నేహితుల నుంచి దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంటారు. వారు మాత్రం అందరితో ఉంటారు. మీరు వారికి చెప్పకుండా గడప కూడా దాటొద్దు అన్నట్లు ప్రవరిస్తారు.
మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోని ఈ రిలేషన్ వల్ల నా లైఫ్‌లో ఏదైనా గ్రోత్ జరిగిందా..అని ప్రశ్నించుకంటే..మీ దగ్గర నుంచి నో అనే సమాధానం వస్తే..మీరు ఇప్పుడే మీ రిలేషన్‌షిప్‌ను సరిచేసుకోండి. నో చెప్పేయండి. కనీసం వాస్తవం గుర్తురెగి నడుచుకోండి. వాళ్లు మీకు మెసేజ్ చేస్తున్నారా, లేక మీ మెసేజులకు రిప్లై మాత్రమే ఇస్తున్నారా, కాల్ చేస్తున్నారా కాల్‌బ్యాక్ చేస్తున్నారా, టైమ్‌పాస్‌కు ఫోన్ చేస్తున్నారా, అవసరం వచ్చినప్పుడే మీరు వారికి గుర్తుకు వస్తున్నారా ఇలా అన్ని విధాలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ప్రేమలో ఉండి కూడా ప్రేమను కోల్పోతున్నారంటే.. మీరే ఆలోచించుకోండి. వదిలేస్తే కొన్ని రోజులే బాధ.. భరిస్తే జీవితాంతం తీరని వ్యథే.! ఎన్ని గొడవలు వచ్చినా సరే కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి.. కానీ మీరు మీ జీవితంలో ఆ వ్యక్తి వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతున్నారంటే..స్టెప్ తీసుకోవడమే మంచిది! ఆల్ ది బెస్ట్ ఫర్ యూవర్ ఫ్యూచర్...