వాలెంటైన్స్ డేను ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా జరుపుకొంటారు. ప్రపంచం అంతా నడిచేది ప్రేమతోనే. ఈ ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారితో గడపండి. వారికి ఉదయం లేవగానే మీరు చెప్పే మాటలు జీవితాంతం గుర్తుండిపోవాలి. అప్పుడే చాలా సంతోషంగా ఫీలవుతారు. మీలోని ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇది మంచి సమయం. ప్రేమను ప్రేమించిన వ్యక్తికి తెలియజేయడం చాలా ప్రత్యేకమైన విషయం. వారికి మంచి అనుభూతిని కలిగించడానికి మీరు చెప్పే మాటలు కీలకం. మీ కోసం కొన్ని లవ్ కొటేషన్స్ ఇక్కడ ఉన్నాయి. వాటిని షేర్ చేయండి.
ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే.. మన గుండె చప్పుడు ఆగేవరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం.. Happy Valentines Day 2024
నువ్వే నా సర్వసం అని చెప్పినా అది చిన్న మాటే అవుతుందేమో.. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు
తల్లడిల్లిన నా చిన్న హృదయాన్ని తవ్విచూసి గాయాన్ని మాన్పావు నువ్వొక దేవతవే.. ఈ అనుభవించే క్షణాలు నీ సొంతం.. గుండెల నిండా హత్తుకునే ఈ భావాలు నీ ప్రాణానికే అంకితం.. Happy Valentines Day My Dear
నిజమైన ప్రేమకు అర్థం.. మనం మనపై చూపించుకునే అభిమానం.. అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించడం.. హ్యాపీ వాలెంటైన్స్ డే
నిన్ను చూసేవరకు తెలీదు,
నిన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేనని..
నిన్ను కలిసే వరకు తెలీదు,
నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తానని..
నీతో మాట్లాడేవరకు తెలీదు,
నీతో మాట్లాడకుండా నా పెదాలు ఉండలేవని..
నిన్ను ప్రేమించే వరకు తెలీదు,
నా సర్వస్వం నువ్వే అయ్యావని..
Happy Valentines Day
నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు, అది అందంగా, రంగురంగులగా మారింది. నా జీవితాన్ని ఇంద్రధనుస్సులా రంగులమయం చేశావు.. నీకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు
నేను నిన్ను ఇప్పుడు ఎప్పుడూ హృదయపూర్వకంగా ప్రేమిస్తాను. నువ్వు నా జీవితాన్ని అందంగా మార్చావు. ఈ ప్రపంచంలో నాకు చాలా ఆనందాన్ని, ప్రేమను ఇస్తున్నావ్, ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రియతమా..
నువ్వు నా జీవితానికి ఆశీర్వాదం. నా జీవితంలో ఉన్నందుకు నేను దేవుడికి కృతజ్ఞుడను. హ్యాపీ వాలెంటైన్స్ డే
నువ్వు నాలో సగమైనప్పటి నుంచి నా రోజులు అందంగా మారాయి. నువ్వే నా లక్కీ చార్మ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. Happy Valentines day 2024
నా ప్రియమైన ప్రేమకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు. నువ్వు నా జీవితాన్ని రంగులతో, సంతోషాలతో నింపావు. నువ్వు నా జీవితంలో ఒక భాగం.. నువ్ లేని జీవితం అసంపూర్ణం.. హ్యాపీ వాలెంటైన్స్ డే డియర్
నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నిజమైన ప్రేమను అర్థం చేసుకున్నాను. ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు నా ప్రియతమా
నా జీవితంలో నేను కలిసిన అద్భుతమైన వ్యక్తి నువ్వు. నన్ను ఇంత నిజాయితీగా ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. Happy Valentines Day 2024