Tamannaah-Vijay Varma Dating: రిలేషన్‌షిప్‌ను కన్ఫార్మ్ చేసినట్లేనా? విజయ్‌తో మిల్కీ బ్యూటీ డిన్నర్ డేట్-rumoured couple tamannaah and vijay varma spotted on dinner date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannaah-vijay Varma Dating: రిలేషన్‌షిప్‌ను కన్ఫార్మ్ చేసినట్లేనా? విజయ్‌తో మిల్కీ బ్యూటీ డిన్నర్ డేట్

Tamannaah-Vijay Varma Dating: రిలేషన్‌షిప్‌ను కన్ఫార్మ్ చేసినట్లేనా? విజయ్‌తో మిల్కీ బ్యూటీ డిన్నర్ డేట్

Tamannaah-Vijay Varma Dating: బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట పెళ్లి వైపు అడుగులేయనున్నట్లు సమాచారం. వారే తమన్నా-విజయ్ వర్మ. ప్రస్తుతం వీరు డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒకే కారులో డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీరు తమ రిలేషన్‌షిప్‌ను దాదాపు కన్ఫార్మ్ చేసినట్లేనని సమచారం.

విజయ్ వర్మతో తమన్నా భాటియా డేటింగ్

Tamannaah-Vijay Varma Dating: బాలీవుడ్‌లో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆలియా-రణ్‌బీర్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రీనా కైఫ్-విక్కీ కౌషల్ ఇలా పలువురు బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. త్వరలో ఈ జాబితాలోకి మరో జంట రానున్నట్లు సమాచారం. వారే తమన్నా-విజయ్ వర్మ. మిల్కీ బ్యూటీ తమన్నా తన ప్రొఫెషనల్ కెరీర్‌లో ఏ విధంగా అయితే దూసుకెళ్తుందో.. వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి అంతే గొప్యంగా ఉంచుకుంటుంది.

తమన్నా తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి ఇంతవరకు బయటకు చెప్పనప్పటికీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉందంటూ గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని బలపరుస్తూ ఈ న్యూయర్ వేడుకల్లో ఇద్దరూ ముద్దుపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా పలు సందర్భాల్లో ఇరువురు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. తాజాగా ఈ విషయాన్ని నిరూపిస్తూ డిన్నర్ డేట్‌కు వెళ్లారు.

కారులో తమన్నా-విజయ్ కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్తూ మీడియాకు చిక్కారు. ఒకే కారులో ముంబయిలో ఓ రెస్టారెంటుకు డిన్నర్‌కు వెళ్తూ తమ బంధాన్ని దాదాపు అధికారికం చేశారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు ఒకరినొకరు కలిసి పెళ్లి విషయం గురించి చర్చించుకున్నారని, ఇందుకు ఇరు పక్షాలు సముఖుంగా ఉన్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే మిల్కీ బ్యూటీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది.

సినిమాల విషయానికొస్తే తమన్నా.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి బోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా తమిళంలో రజినీ సరసన జైలర్ చిత్రంలో చేస్తోంది. వీటితో పాటు మలయాళం, హిందీలో పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. మరోపక్క విజయ్ వర్మ కూడా సస్పెక్స్ ఎక్స్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇందులో కరీనా కపూర్, జేదీప్ అహ్లవాత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.