Home Remedies for Flu Relief : ఇంటి నివారణలతో.. జలుబు, దగ్గు లక్షణాలను ఇలా సులభంగా తగ్గించుకోండి..
06 January 2023, 8:46 IST
- Home Remedies for Flu Relief : చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ రావడం చాలా సహజం. అయితే వీటి నుంచి మీరు ఉపశమనం పొందాలి అనుకుంటే.. లేదా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలంటే మనకి ఇంట్లోనే సహజంగా లభించే నివారణలు ఉన్నాయి.
జలుబు, దగ్గును తగ్గించే ఇంటి చిట్కాలు
Home Remedies for Flu Relief : ముక్కు కారడం, గొంతులో గీర, తుమ్ములు, జలుబు లేదా ఫ్లూ సాధారణ లక్షణాలు. చలికాలంలో ఇవి సహజంగా అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, ముక్కు దిబ్బడ, దగ్గు, తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో మీ గొంతు కూడా దురదగా ఉంటుంది. దీనివల్ల మీకు ఇష్టమైన కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటుంది.
ఇలాంటి సమయాల్లో మీ రోగనిరోధక వ్యవస్థ చాలా ముఖ్యం. అది సరిగా పనిచేయనప్పుడే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి.. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తారు. సాధారణ జలుబు, దగ్గుకు చికిత్స చేయడానికి ఇంటి నివారణలను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నివారణలు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగించకుండా ఫ్లూ చికిత్సలో అద్భుతంగా పనిచేస్తాయి. జలుబు, ఫ్లూ నివారించే ఇంటి చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ
అల్లం చికిత్సా ప్రయోజనాలు జింజెరోల్స్, షోగోల్స్ అనే సమ్మేళనాల ఉనికి కారణంగా ఉన్నాయి. కొన్ని పచ్చి తాజా అల్లం ముక్కలను వేడినీటిలో లేదా టీలో కలిపి తీసుకుంటే జలుబు, ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో అల్లం టీ హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
పాలు, పసుపు
సాధారణ జలుబు, ఫ్లూని నివారించడానికి ప్రతిరోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపును తీసుకోవాలని చాలా మంది నిపుణులు సలహా ఇస్తున్నారు. పసుపు దాని శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలకు విస్తృతంగా ప్రసిద్ది చెందింది. ఇది శ్వాసకోశ రుగ్మతలు, వాపు, కీళ్ల అసౌకర్యం, కాలేయ ఇబ్బందులు, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి అనేక రకాల ఆరోగ్య వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
అవిసె గింజలు
అవిసె గింజలు, ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం. మీ శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడుతుంది. మీ సిస్టమ్ రక్షణను పటిష్టం చేస్తుంది. జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది.
దీనికోసం 2 టీస్పూన్ల అవిసె గింజలను 1 కప్పు నీటిలో చిక్కగా, తినే వరకు ఉడకబెట్టండి. ఈ అవిసె గింజలు వెచ్చగా ఉంటాయి కాబట్టి.. అవి అత్యుత్తమ జలుబు, ఫ్లూ నివారణగా పనిచేస్తాయి.
తేనె, నిమ్మరసం, నీరు
నిమ్మకాయ శ్లేష్మం క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఇది టాక్సిన్లను సులభంగా బయటకు పంపిస్తుంది. మరోవైపు తేనెలో పెరాక్సైడ్లు ఉంటాయి. ఇవి వైరస్ కలిగించే సూక్ష్మక్రిములను శుభ్రపరుస్తాయి. జీర్ణక్రియ, జీవక్రియను మెరుగుపరచడానికి ఇది అద్భుతమైన మోతాదు.
సాధారణ జలుబు, దగ్గుకు చికిత్స చేయడానికి గోరువెచ్చని నీటిలో తేనె వేయడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఈ సిట్రస్ టీ మీకు విటమిన్ సి అద్భుతమైన మోతాదును కూడా ఇస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది.
ఉసిరి
ఉసిరి చాలా కాలంగా ఫ్లూ, జలుబులకు బలమైన ఇంటి చికిత్సగా ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల సంశ్లేషణను పెంచుతుంది. ఇది వివిధ వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడుతుంది. రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల రక్త ప్రసరణ, కాలేయ పనితీరు మెరుగుపడటంతో పాటు బహుళ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పైన పేర్కొన్న గృహ చికిత్సలు అనారోగ్యాన్ని నివారించడానికి, లక్షణాలను తగ్గించడానికి, జలుబు లేదా ఫ్లూ వ్యవధిని తగ్గించడంలో సహాయపడవచ్చు. ఎటువంటి ఫలితం లేకుంటే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించండి.