Morning Meditation Benefits । ఉదయం వేళ కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి, కలిగే ప్రయోజనాలివే!
24 May 2023, 9:17 IST
- Morning Meditation Benefits: మీరు శక్తివంతంగా మీ దినచర్యను మొదలుపెట్టాలంటే ఉదయం ధ్యానం చేయాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
Morning Meditation Benefits
Morning Meditation: ధ్యానం అనేది మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అయ్యే అద్భుతమైన అభ్యాసం. ఇది మీ నాడీవ్యవస్థను ప్రేరేపించి ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ హృదయ స్పందన రేటును మరింత నియంత్రిస్తుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది.మీ ఆలోచనాశక్తిని పెంచుతుంది. ధ్యానం మీ ఆలోచనలను మంచి మార్గంలో ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది.
మీరు మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా మీ దినచర్యను మొదలుపెట్టాలంటే ఉదయం ధ్యానం చేయాలని ఆరోగ్య నిపుణులు సిఫారసు చేస్తున్నారు. కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీ శరీరంలో అద్భుతాలు చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది.
Morning Meditation Benefits- ఉదయం పూట ధ్యానంతో ప్రయోజనాలు
ఉదయం పూట ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.
మంచి ఏకాగ్రత
ఉదయం ధ్యానం చేస్తే మీకు ఆ రోజును వృధా చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు. మంచి ఏకాగ్రతను కూడా కలిగి ఉంటారు. మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది.
మంచి అనుభూతి
నిద్రలేచిన తర్వాత మీ మూడ్ బాగుండాలంటే కాసేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అవసరమైన పనులపై దృష్టిపెట్టేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది.
విషయాలపై స్పష్టత
పనిభారం ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా మీరు స్మార్ట్ గా, సమర్థవంతంగా పనులు చేయాలంటే ఉదయం పూట ధ్యానం చేయాలని చెబుతున్నారు. ధ్యానంతో మీకు విషయాలపై స్పష్టత లభిస్తుంది.
రోగనిరోధక శక్తి
ధ్యానం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కాలానుగుణ ఇన్ఫెక్షన్‌లతో పాటు బాధలు, నొప్పులను నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండగలుగుతారు.
ఆనందంగా ఉంటారు
మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం అభ్యసించడం వల్ల మీరు అన్ని బాధలను, ఆందోళనలను మరిచిపోయి ప్రస్తుత క్షణంలో జీవించగలుగుతారు. ఇది మీ ప్రతికూల ఆలోచనలను, మీ మనస్సులను తప్పుదోవ పట్టించే ఆలోచనల నుంచి విముక్తి కలిగిస్తుంది. మీరు ఆనందంగా ఉండేందుకు కారణం అవుతుంది.
ధ్యానం అనేది మానసికంగా, శారీరకంగా విశ్రాంతినిచ్చి ఆరోగ్యాన్ని పెంపొందించే టెక్నిక్. మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే రోజులో ఒక గంట పాటైనా ధ్యానం చేయాలి. ఒకవేళ మీకు అంత సమయం లేదనుకుంటే కనీసం 20 నిమిషాల పాటైనా ధ్యానం చేయాలి అని నిపుణులు చెబుతున్నారు.