NNS 3rd December Episode: పిల్లల కిడ్నాప్‌కు కొత్త ప్లాన్.. బలవంతంగా ఎక్స్‌కర్షన్‌కు పంపేందుకు మనోహరి ప్రయత్నం
03 December 2024, 8:39 IST
- NNS 3rd December Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (డిసెంబర్ 3) ఎపిసోడ్లో భాగీని అమర్ హత్తుకొని థ్యాంక్స్ చెబుతాడు. అటు పిల్లలను మిస్సమ్మకు దూరం చేసి, ఎక్స్‌కర్షన్ కు పంపించేందుకు మనోహరి కొత్త ప్లాన్ వేస్తుంది.
పిల్లలను మిస్సమ్మకు వ్యతిరేకంగా తయారుచేసే పనిలో మనోహరి.. భాగీని హత్తుకున్న అమర్!
NNS 3rd December Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (డిసెంబర్ 3) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వాకిట్లో ముగ్గు పెడుతున్న మిస్సమ్మ దగ్గరకు వచ్చి రాత్రి ఆ తీవ్రవాదుల్ని అలా ఎలా కొట్టావు? అని అడుగుతుంది ఆరు. అక్క అప్పగించిన పిల్లల బాధ్యతను ఆయన నాకు ఇచ్చారు.
దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనుకున్నాను.. అందుకోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నాను అని మిస్సమ్మ చెప్పగానే నీ లాంటి కోడలు దొరకడం ఈ ఇంటి అదృష్టం. నీ ప్లేస్‌లో ఎవరున్నా ఇంత ధైర్యం చేయలేరు అంటుంది ఆరు. ఊరుకోండి అక్కా నా పిల్లలను నేను కాపాడుకున్నాను అంటుంది. సరే మిస్సమ్మ నేను వెళ్తాను అని వెళ్లిపోతుంది.
మిస్సమ్మకు అమర్ థ్యాంక్స్
అమర్ ఆఫీసుకు వెళ్తూ.. ఏదో చెప్పాలనుకుని వెళ్లబోతుంటే.. మిస్సమ్మ ఏదైనా చెప్పాలా అండి అని అడుగుతుంది. థాంక్స్ మిస్సమ్మ.. నువ్వు చేసిన పనికి థాంక్స్ చెప్పి సరిపెట్టలేను. ఇంకేం చేయాలో తెలియదు అంటాడు అమర్. ఏంటండీ ఈ మాటలు నా పిల్లలను నేను కాపాడుకోవడం నా బాధ్యత. నేను నిలబెట్టుకోవాల్సిన నమ్మకం. ఆరు అక్క నా మీద పెట్టుకున్న నమ్మకం.
నేను ఈ ఇంటికి కోడలుగా అడుగుపెట్టినప్పుడే అక్క నాకు ఇంటి బాధ్యత పిల్లల బాధ్యత అప్పగించింది అండి. పిల్లల గురించి అత్తయ్య, మామయ్యల గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి. నేనున్నాను. వాళ్లకేం కానివ్వను అంటుంది మిస్సమ్మ. దీంతో అమర్ వెళ్లబోతూ మిస్సమ్మ నాకు ఎదురు వస్తావా..? అని అడుగుతాడు. చాటు నుంచి వింటున్న ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. వెనకే వచ్చి అంతా గమనిస్తున్న మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. మిస్సమ్మ ఎదురు రాగానే అమర్ వెళ్లిపోతాడు.
పిల్లల కిడ్నాప్‌కు కొత్త ప్లాన్
అరవింద్ తన అనుచరులను కొడుతుంటాడు. ఒక ఆడపిల్ల చేతిలో దెబ్బలు తిని పారిపోయి వస్తారా మీరు.. అంటూ తిడతాడు. దీంతో వినోద్ అన్న.. అమరేంద్ర తన పెళ్లాన్ని షేర్ లా తయారు చేశాడు. ఆ ముసలోడేమో గన్ పట్టుకుని వచ్చాడు. ఇక అమరేంద్రను గెలవాలంటే అతనొక్కడే కాదు అతని పెళ్లాం కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్తాడు.
దీంతో అరవింద్ పిల్లల్ని కిడ్నాప్ చేయాలంటే కొత్తగా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి స్కూల్ లో ఎంక్వైరీ చేసి వచ్చాను. రేపు పిల్లలను ఎక్స్‌కర్షన్ కు తీసుకెళ్తున్నారట అని చెప్తాడు. అయితే నాటకం ఆడి పిల్లలను కిడ్నాప్ చేయాలని అనుకుంటారు. అందుకోసం వినోద్ వాళ్లను పోలీసులకు లొంగి పొమ్మని చెప్తాడు.
ఎక్స్‌కర్షన్‌కు రామని చెప్పిన అమ్ము
పిల్లలు ఆలోచిస్తుంటారు. డాడీ ఇంకా ఆ రౌడీలను పట్టుకోలేదేమో అక్కా అంటాడు ఆనంద్. మేడంకు కాల్ చేసి మీరు కూడా రావడం లేదని చెప్పు అమ్ము అంటుంది అంజు. మరోవైపు ప్రిన్సిపాల్ అమ్మును సైడ్ చేసి ఎక్స్‌కర్షన్‌కు బంటిని అటెండ్ చేస్తే మనకు హెడ్ ఫోన్స్ వస్తాయి అది ఎలా అని ఆలోచిస్తుంది. ఇంతలో అమ్ము ఫోన్ చేసి రేపు మేము ఎక్స్ కర్షన్‌కు రాలేకపోతున్నామని చెప్తుంది. దీంతో ప్రిన్సిపాల్ హ్యాపీగా ఫీలవుతుంది. అదే విషయం బంటికి చెప్తే వాడు హ్యాపీగా ఫీలవుతాడు.
పిల్లల మాట్లాడుకుంటుంటే.. అక్కడకు మనోహరి వస్తుంది. అంజు డాన్స్ చేస్తుంది. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా..? ఏంటమ్మా ఏంటి నన్ను వదిలేసి ఎక్స్ కర్షన్‌కు వెళ్తారా..? ఇప్పుడు వెళ్లండి.. బట్టలు సర్దుకోండి ప్లానింగ్ వేసుకోండి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది అంజు. దీంతో అమ్ము కోపంగా మేము వెళ్లంది దేవుడి వల్ల కాదు. ఆ రౌడీల వల్ల. వాళ్లు నిన్ను కిడ్నాప్ అటెంప్ట్ చేయకపోయినా.. నిన్న అటాక్ చేయకపోయినా మేం కచ్చితంగా వెళ్లి ఉండేవాళ్లం అంటుంది అమ్ము.
పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి
చూడండి అమ్ము ఏం జరిగిన నా మంచి కోసమే జరగుతుంది. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఇంట్లోనే ఉండండి అని అంజు చెప్తుంది. డోర్ దగ్గర వింటున్న మనోహరి.. వీళ్లను ఎక్స్‌కర్షన్‌కు పంపించేలా చేయాలని దీంతో పిల్లలకు దగ్గరై ఆ మిస్సమ్మ మీద యుద్దం మొదలు పెట్టొచ్చు అనుకుని పిల్లల దగ్గరకు వెళ్లి మీ డాడీతో మాట్లాడి మిమ్మల్ని ఎక్స్ కర్షన్‌కు తీసుకెళ్లేలా చేస్తానంటుంది. దీంతో పిల్లలు అయితే ఈ విషయం వెంటనే మిస్సమ్మకు చెప్తాము అని వెళ్లిపోతారు. మనోహరి షాక్ అవుతుంది.
నిర్మల, శివరాంలకు కాఫీ ఇస్తున్న మిస్సమ్మ దగ్గరకు పిల్లలు వెళ్లి నిన్న మన ఇంట్లో అటాక్ చేసిన వాళ్లు దొరికారంట కదా..? ఇక మేము ఎక్స్ కర్షన్ కు వెళ్లొచ్చా అని అడుగుతారు. మిస్సమ్మ ఆలోచిస్తుంటే.. మనోహరి అటాక్ చేసిన వాళ్లు దొరికేశాక.. ఇంకా పిల్లల ఆనందానికి అడ్డుపడుతున్నావు మిస్సమ్మ అంటూ పిల్లల దగ్గర మార్కులు కొట్టేయాలని ఈ నాటకాలు ఆడుతున్నావా..? అంటుంది. దాంతో శివరాం కోపంగా మనోహరిని తిడుతాడు.
మిస్సమ్మ పిల్లలకు తల్లి. తల్లి బిడ్డల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలన్న అవసరం లేదు అని బుద్ది చెప్తాడు. పరిస్థితులు సర్దుమణిగాక అందరం కలిసి బయటకు వెళ్దామని మిస్సమ్మ చెప్తుంది. దాంతో మనోహరి ఫ్రెండ్స్ తో వెళ్లడం వేరు మనతో వెళ్లడం వేరు అంటుంది. డాడీ ఓకే అంటే ఇంకెవరితో మనకు అవసరం లేదు అంటుంది అంజు. అమర్ పిల్లలు పిక్నిక్ వెళ్లడానికి ఒప్పుకుంటాడా? పిక్నిక్లో మనోహరి ఏం ప్లాన్ చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు డిసెంబర్ 03న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్